Shiv Nader University: 2025-26 విద్యా సంవత్సరానికి దరఖాస్తులను ఆహ్వానించిన షివ్ నాడర్ యూనివర్శిటీ.. ఢిల్లీ-ఎన్ సిఆర్

సంస్థ అందచేసే ఆఫరింగ్స్ లో కంప్యూటర్ సైన్స్ మరియు బిజినెస్ డేటా అనలిటిక్స్ లో ద్వంద్వ డిగ్రీ అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రాంస్ ఇవి కొత్త చేరిక. అరిజోనా రాష్ట్ర యూనివర్శిటీ, యుఎస్ఏ సహకారంతో ఇవి ప్రారంభించబడ్డాయి.

Published By: HashtagU Telugu Desk
Shiv Nadar University inviting applications for academic year 2025-26.. Delhi-NCR

Shiv Nadar University inviting applications for academic year 2025-26.. Delhi-NCR

Shiv Nader University : షివ్ నాడర్ యూనివర్శిటీ, ఢిల్లీ-ఎన్.సి.ఆర్, ప్రముఖ బహుళ విభాగాలు మరియు పరిశోధనా-కేంద్రీయ సంస్థ, 2025-26 విద్యా సంవత్సరం కోసం ప్రవేశాలను ప్రారంభించింది. ఇంజనీరింగ్, నేచురల్ సైన్సెస్, మేనేజ్మెంట్ మరియు ఎంటర్ ప్రెన్యుర్ షిప్ మరియు హ్యుమానిటీస్ మరియు సోషల్ సైన్సెస్ నాలుగు స్కూల్స్ లో ప్రోగ్రాంస్ కోసం దరఖాస్తులను ఆహ్వానించింది. కాబోయే అభ్యర్థులు యూనివర్శిటీ అధికారిక వెబ్ సైట్ (http://www.snu.edu.in/home) ద్వారా దరఖాస్తు చేయవచ్చు.

2025-26 కోసం, యూనివర్శిటీ విద్యా శ్రేష్టతను మద్దతు చేసి మరియు బహుకరించడానికి ఉపకారవేతనాల శ్రేణిని అందించడం కొనసాగిస్తోంది. సంస్థ అందచేసే ఆఫరింగ్స్ లో కంప్యూటర్ సైన్స్ మరియు బిజినెస్ డేటా అనలిటిక్స్ లో ద్వంద్వ డిగ్రీ అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రాంస్ ఇవి కొత్త చేరిక. అరిజోనా రాష్ట్ర యూనివర్శిటీ, యుఎస్ఏ సహకారంతో ఇవి ప్రారంభించబడ్డాయి. ఈ ప్రోగ్రాంస్ విద్య మరియు పరిశ్రమ యొక్క అభివృద్ధి చెందుతున్న డిమాండ్లను పరిష్కరించడానికి రూపొందించబడ్డాయి. ఉపకారవేతనాల గురించి వివరాలు ఈ వెబ్ సైట్ లింక్ లో లభిస్తున్నాయి: https://snuadmissions.com/.

ఇన్ స్టిట్యూషన్ ఆఫ్ ఎమినెన్స్ గా గుర్తించబడిన, షివ్ నాడర్ యూనివర్శిటీ విద్య కోసం సమగ్రమైన, విద్యార్థి-కేంద్రీకృత విధానంతో దృఢమైన పరిశోధనా అవకాశాలను మిశ్రమం చేస్తోంది. విద్యార్థులకు కీలకంగా ఆలోచించగలగడం, సృజనాత్మకత, మరియు నాయకత్వ నైపుణఅయాలను కలగచేయడానికి, వేగంగా వృద్ధి చెందుతున్న అంతర్జాతీయ పరిస్థితి యొక్క డిమాండ్లకు అనుగుణంగా వారు సిద్ధంగా ఉండటాన్ని నిర్థారించడానికి యూనివర్శిటీ యొక్క విభిన్నమైన పోర్ట్ ఫోలియో ప్రోగ్రాంస్ రూపొందించబడ్డాయి.

“కొత్త విద్యా సంవత్సరానికి ప్రవేశాలు ప్రారంభమవడంతో, తాము ఎంచుకున్న రంగాల్లో శ్రేష్టతను సాధించడానికి ఆతృతగా ఉన్న అభిరుచి గల వ్యక్తులను షివ్ నాడర్ యూనివర్శిటీ, ఢిల్లీ-ఎన్ సిఆర్ లో మేము సాదరంగా ఆహ్వానిస్తున్నాము. మా సంస్థ అకాడమిక్స్ ను మించి అందచేస్తోంది, సృజనాత్మకత, విశ్లేషణాత్మకమైన ఆలోచనలు, వ్యక్తిగత మరియు వృత్తిపరమైన వృద్ధికి సమతుల్యమైన విధానాన్ని పోషిస్తోంది,” అని ప్రొఫెసర్ అనన్య ముఖర్జీ, వైస్-ఛాన్స్ లర్, షివ్ నాడర్ యూనివర్శిటీ, ఢిల్లీ-ఎన్ సిఆర్ అన్నారు.

యూనివర్శిటీ అత్యంత విజయవంతమైన కెరీర్ డవలప్ మెంట్ సెంటర్ (సిడిసి)ని కలిగి ఉంది, ప్రపంచవ్యాప్తంగా ఇది ప్రముఖ సంస్థలతో ప్లేస్మెంట్స్ మరియు ఇంటర్న్ షిప్స్ ను అందచేస్తుంది. షివ్ నాడర్ యూనివర్శిటీ నుండి గ్రాడ్యుయేట్ చేసిన వారిని రంగాల్లోని ప్రముఖ కంపెనీలు నియామకం చేస్తున్నాయి, చాలామంది విద్యార్థులు తమ అండర్ గ్రాడ్యుయేట్ అధ్యయనాలు తరువాత నేరుగా పిహెచ్.డి. ప్రోగ్రాంస్ లోకి నేరుగా ప్రవేశాలు పొందడం సహా ఉన్నత విద్య కోసం అంతర్జాతీయంగా ప్రతిష్టాత్మకమైన సంస్థలలో ప్రవేశాలు పొందుతున్నారు. ఇది యూనివర్శిటీ యొక్క నాలుగేళ్ల అండర్ గ్రాడ్యుయేట్ పరిశోధనా డిగ్రీ యొక్క విలువను, మరియు అంతర్జాతీయంగా పోటీయుత ప్రతిభను పోషించడానికి యూనివర్శిటీ యొక్క సామర్థ్యాన్ని ప్రదర్శిస్తోంది. గత ఏడాది, యూనివర్శిటీకి చెందిన గ్రాడ్యుయేట్స్ ను భారతదేశం, విదేశాల్లోని ప్రముఖ సంస్థలు నియామకం చేసాయి. 2011లో స్థాపించబడిన యూనివర్శిటీ 286 ఎకరాల రెసిడెన్షియల్ క్యాంపస్ లో సుమారు 4000+ విద్యార్థులు మరియు 250+ బోధనా సిబ్బందితో వ్యాపించింది. 2022లో దీనికి ‘ఇన్ స్టిట్యూషన్ ఆఫ్ ఎమినెన్స్’ హోదా బహుకరించబడింది.

విద్యార్థులకు బహుళ ప్రయోజనాలు..

యూనివర్శిటీకి తమ సంబంధిత రంగాల్లో సుసంపన్నమైన మరియు విభిన్నమైన అనుభవం కలిగిన అంతర్జాతీయంగా ప్రసిద్ధి చెందిన బోధనా సభ్యులు ఉన్నారు. 50+ క్లబ్స్ మరియు సొసైటీస్ తో, నేర్చుకునే అవకాశాలు తరగతి గదిని మించి ఉన్నాయి. కొన్ని ప్రసిద్ధి చెందిన క్లబ్స్ లో సుస్థిరత, మోడల్ యునైటెడ్ , కృత్రిమ మేధస్సు, ఫోటోగ్రఫీ, రోబోటిక్స్ మరియు ఇంకా ఎన్నో వాటి కోసం సహకార డిజైన్ ఉంది. క్రీడలు మరియు శారీరక సంక్షేమాలు యూనివర్శిటీలో నేర్చుకోవడం మరియు వృద్ధిలో ఒక అంతర్భాగంగా ఉన్నాయి. ఇది ప్రపంచ స్థాయికి చెందిన క్రీడా మౌళిక సదుపాయాలకు మరియు విద్యార్థులకు లభ్యమయ్యే కార్యకలాపాల ఎంపికగా నిలిచింది. వీటిలో 90,000 చదరపు అడుగుల గొప్ప ఇండోర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ మరియు 5,71,410 చదరపు అడుగుల అంతర్జాతీయ ప్రామాణాలు గల అవుట్ డోర్ క్రీడా మైదానాలు మరియు స్క్వాష్, బ్యాడ్మింటన్, ఈక్విస్ట్రియన్ శిక్షణ మొదలైన వాటితో సహా బహుళ ఆప్షన్స్ ఉన్నాయి.

షివ్ నాడర్ ఇన్ స్టిట్యూషన్ ఆఫ్ ఎమినెన్స్ గురించి..

షివ్ నాడర్ ఇన్ స్టిట్యూషన్ ఆఫ్ ఎమినెన్స్ బహుళ విభాగాల, విద్యార్థి-కేంద్రీకృత పరిశోధనా యూనివర్శిటి. షివ్ శ్రీ. నాడర్ 2011లో దీనిని స్థాపించారు. భారతదేశపు దాతలు మరియు భారతదేశంలో సాంకేతిక విప్లవంలో మార్గద్రశకులలో ఈయన ఒకరు. దీనిలో నాలుగు స్కూల్స్ ఉన్నాయి: ఇంజనీరింగ్; నేచురల్ సైన్సెస్; హ్యుమానిటీస్ మరియు సోషల్ సైన్సెస్; మేనేజ్మెంట్ & ఎంటర్రిప్రెన్యుర్ షిప్. భారత ప్రభుత్వంచే ఇన్ స్టిట్యూషన్ ఆఫ్ ఎమినెన్స్ గా గుర్తించబడిన అతి పిన్న విశ్వవిద్యాలయం ఇది, “ కాల క్రమేణా ప్రపంచంలోని ప్రముఖ వంద సంస్థలలో భాగంగా మారడానికి కృషి చేసిన” ఉన్నత విద్యా సంస్థల యొక్క ఒక విలక్షణమైన శ్రేణి. సంస్థ 17 అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ప్రోగ్రాంస్, 10 మాస్టర్స్ ప్రోగ్రాంస్, మరియు 16 పిహెచ్.డి ప్రోగ్రాంస్ ను అందిస్తోంది. యూనివర్శిటీకి ప్రస్తుతం 3515 మంది విద్యార్థులు ఉన్నారు. విభిన్నమైన విద్యార్థి సంస్థలో దేశంలోని 27 రాష్ట్రాలు మరియు కేంద్ర పాలిత ప్రాంతాలకు మరియు భారతదేశం కాకుండా 12 ఇతర దేశాలకు చెందిన వారు ఉన్నారు.

Read Also: IPL Mega Auction: ఈ ఐదుగురు స్టార్ ఆట‌గాళ్ల‌కు షాకిచ్చిన ఐపీఎల్ వేలం!

  Last Updated: 25 Nov 2024, 08:18 PM IST