తొలిసారిగా వింగ్స్ ఇండియా 2026లో పాల్గొననున్న శక్తి ఎయిర్ క్రాఫ్ట్ ఇండస్ట్రీస్

పైలట్ శిక్షణా మౌలిక వసతులు ప్రాంతీయ విమాన కనెక్టివిటీ దేశీయ విమాన తయారీ సామర్థ్యాల విస్తరణపై దృష్టితో SAIPL ఈ అంతర్జాతీయ వేదికపై తమ శక్తిని ప్రదర్శించనుంది.

Published By: HashtagU Telugu Desk
Shakti Aircraft Industries to participate in Wings India 2026 for the first time

Shakti Aircraft Industries to participate in Wings India 2026 for the first time

. పైలట్ శిక్షణకు ఆధునిక విమానాలు

. ప్రాంతీయ కనెక్టివిటీకి L410 NG

. మేక్ ఇన్ ఇండియాతో ముందడుగు

Shakti Aircraft Industries : భారత పౌర విమానయాన రంగంలో మరో కీలక అధ్యాయం మొదలుకానుంది. శక్తి గ్రూప్ మరియు ఆస్ట్రియా కేంద్రంగా పనిచేసే డైమండ్ ఎయిర్ క్రాఫ్ట్ ఇండస్ట్రీస్ భాగస్వామ్యంతో ఏర్పడిన శక్తి ఎయిర్ క్రాఫ్ట్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ (SAIPL)  2026 జనవరి 28 నుంచి 31 వరకు హైదరాబాద్‌లో జరగనున్న వింగ్స్ ఇండియా 2026లో తొలిసారిగా పాల్గొననున్నట్లు ప్రకటించింది. పైలట్ శిక్షణా మౌలిక వసతులు ప్రాంతీయ విమాన కనెక్టివిటీ దేశీయ విమాన తయారీ సామర్థ్యాల విస్తరణపై దృష్టితో SAIPL ఈ అంతర్జాతీయ వేదికపై తమ శక్తిని ప్రదర్శించనుంది.

వింగ్స్ ఇండియా 2026లో భాగంగా SAIPL డైమండ్ ఎయిర్ క్రాఫ్ట్‌కు చెందిన ప్రపంచ ప్రఖ్యాత శిక్షణా విమానాలను స్థిర ప్రదర్శనలో ఉంచనుంది. ఇందులో DA40 NG, DA42, DA62 మోడళ్లకు ప్రధాన స్థానం ఉంటుంది. ఇంధన సామర్థ్యం గల డీజిల్ ఇంజన్లు, ఆధునిక అవియోనిక్స్, భద్రతా ప్రమాణాల్లో ఉన్నత స్థాయి విశ్వసనీయత కారణంగా ఈ విమానాలు ప్రపంచవ్యాప్తంగా పైలట్ శిక్షణ సంస్థల విశ్వాసాన్ని పొందాయి. శిక్షణతో పాటు మల్టీ-మిషన్ ఆపరేషన్లలోనూ ఈ విమానాలు సమర్థంగా ఉపయోగపడతాయి. భారతదేశంలో పెరుగుతున్న పైలట్ల అవసరాలను దృష్టిలో పెట్టుకొని శిక్షణా వ్యవస్థను బలోపేతం చేయడమే SAIPL యొక్క ప్రధాన లక్ష్యంగా సంస్థ ప్రతినిధులు పేర్కొన్నారు.

ప్రాంతీయ విమానయానానికి ఊతమిచ్చే దిశగా SAIPL మరో కీలక విమానాన్ని కూడా ప్రదర్శించనుంది. Omnipol సంస్థకు చెందిన L410 NG – 19 సీట్లతో కూడిన ఆధునిక ప్రాంతీయ విమానం. చిన్న రన్‌వేల్లో టేక్-ఆఫ్, ల్యాండింగ్ చేయగల సామర్థ్యం, విభిన్న భౌగోళిక పరిస్థితుల్లో దృఢమైన పనితీరు దీనికి ప్రత్యేకత. దూరప్రాంతాలు తక్కువ మౌలిక వసతులు ఉన్న ప్రాంతాలకు విమాన సేవలను విస్తరించేందుకు ఇది ఎంతో అనుకూలమని నిపుణులు భావిస్తున్నారు.
భారతదేశంలో ప్రాంతీయ విమాన కనెక్టివిటీ లక్ష్యాలకు ఈ విమానం కీలకంగా మారనుందని SAIPL అభిప్రాయపడింది.

2025 మార్చిలో SAIPL, DA40 NG విమానాన్ని అధికారికంగా ప్రారంభించింది. పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామమోహన్ నాయుడు సమక్షంలో DGCA నుంచి CAR-21 విమాన తయారీ లైసెన్స్ పొందిన అనంతరం భారతదేశంలోనే తుది అసెంబ్లీ లైన్‌ను ఏర్పాటు చేసింది. మేక్ ఇన్ ఇండియా కార్యక్రమానికి అనుగుణంగా దేశీయ కస్టమర్లకు DA40 NG సరఫరా చేయనుంది. శిక్షణా విమానాలను భారత్‌లో తయారు చేసే మొదటి ప్రైవేట్ సంస్థగా SAIPL గుర్తింపు పొందింది. స్థానిక తయారీ ద్వారా పైలట్ శిక్షణ ఖర్చులను తగ్గించడం శిక్షణా సామర్థ్యాన్ని పెంచడం సంస్థ దీర్ఘకాలిక లక్ష్యంగా పెట్టుకుంది. వింగ్స్ ఇండియా 2026లో హాల్ నంబర్ బిలో స్టాల్ నంబర్ 21 వద్ద SAIPL తన ప్రదర్శనను ఏర్పాటు చేయనుంది. భారత విమానయాన భవిష్యత్తుకు దిశానిర్దేశం చేసే ఈ ప్రదర్శనపై రంగ నిపుణుల్లో భారీ ఆసక్తి నెలకొంది.

 

  Last Updated: 24 Jan 2026, 09:16 PM IST