September 2025 Bank Holidays: సెప్టెంబర్ నెలలో ఏకంగా 15 రోజుల వరకు బ్యాంకులకు సెలవులు

September 2025 Bank Holidays : ఈ సెలవులు బ్యాంక్ బ్రాంచ్ కార్యకలాపాలకు మాత్రమే వర్తిస్తాయి. ఆన్‌లైన్ బ్యాంకింగ్ సేవలు, యూపీఐ, డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు లావాదేవీలు మాత్రం ఎప్పటిలాగే కొనసాగుతాయి. కాబట్టి ఖాతాదారులు డిజిటల్ సేవలను ఉపయోగించి నగదు బదిలీలు చేయడం

Published By: HashtagU Telugu Desk
Bank

Bank

సెప్టెంబర్ 2025లో బ్యాంకుల సెలవులు (September 2025 Bank Holidays) ఖాతాదారులకు చాలా ప్రాధాన్యం కలిగిన విషయం. నెలలో పలు పండుగలు, ప్రత్యేక సందర్భాలు రావడంతో పాటు ఆదివారాలు, రెండో మరియు నాల్గవ శనివారాలు కలిపి దాదాపు 15 రోజులు బ్యాంకులు మూసివేయబోతున్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) విడుదల చేసిన లిస్టు ప్రకారం దేశంలోని వివిధ రాష్ట్రాలలో వేర్వేరు తేదీల్లో సెలవులు ఉండగా, జాతీయ స్థాయిలో వచ్చే సెలవులు మాత్రం దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకులకు వర్తిస్తాయి.

సెప్టెంబర్ నెలలో సెలవుల లిస్ట్ చూస్తే

సెప్టెంబర్ 7, 14, 21, 28 తేదీలలో ఆదివారం కనుక బ్యాంకులకు సెలవు
సెప్టెంబర్ 13, 20 తేదీలలో రెండో శనివారం నాడు దేశ వ్యాప్తంగా బ్యాంకులకు హాలిడే
సెప్టెంబర్ 3న రాంచీలో కర్మ పూజ సందర్భంగా బ్యాంకులు మూసివేత.
సెప్టెంబర్ 4న కొచ్చి, తిరువనంతపురంలో తొలి ఓనం సందర్భంగా బ్యాంకులు మూసివేస్తారు.
సెప్టెంబర్ 5న ఈద్-ఎ-మిలాద్/మిలాద్-ఉన్-నబి లేదా తిరువోణం సందర్భంగా అహ్మదాబాద్, ముంబైతో సహా పలు నగరాల్లో బ్యాంకులకు సెలవు ఇస్తారు
సెప్టెంబర్ 6న ఈద్-ఎ-మిలాద్/ఇంద్రజాత్ర సందర్భంగా గ్యాంగ్‌టక్, జమ్మూ, రాయ్‌పూర్, శ్రీనగర్‌లలో బ్యాంకులకు సెలవు ఉంటుంది.
సెప్టెంబర్ 12న జమ్మూ, శ్రీనగర్‌లలో ఈద్-ఎ మిలాద్-ఉల్-నబి కారణంగా బ్యాంకులు మూసివేస్తారు.
సెప్టెంబర్ 22న జైపూర్‌లోని బ్యాంకులు నవరాత్రి సందర్భంగా బ్యాంకులకు సెలవు.
సెప్టెంబర్ 23న, జమ్మూ, శ్రీనగర్‌లలో మహారాజా హరి సింగ్ జీ జయంతి సందర్భంగా బ్యాంకులు మూసివేస్తారు
సెప్టెంబర్ 29న అగర్తలా, గ్యాంగ్‌టక్, కోల్‌కతాలో మహాసప్తమి సందర్భంగా బ్యాంకులకు సెలవు ఉంటుంది
సెప్టెంబర్ 30న భువనేశ్వర్, అగర్తలా, ఇంఫాల్, జైపూర్, గౌహతి, కోల్‌కతా, పాట్నా, రాంచీలలో మహాఅష్టమి రోజున బ్యాంకులకు సెలవు

ఈ సెలవులు బ్యాంక్ బ్రాంచ్ కార్యకలాపాలకు మాత్రమే వర్తిస్తాయి. ఆన్‌లైన్ బ్యాంకింగ్ సేవలు, యూపీఐ, డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు లావాదేవీలు మాత్రం ఎప్పటిలాగే కొనసాగుతాయి. కాబట్టి ఖాతాదారులు డిజిటల్ సేవలను ఉపయోగించి నగదు బదిలీలు చేయడం, బిల్లులు చెల్లించడం, బ్యాలెన్స్ చెక్ చేయడం వంటి పనులను నిరాటంకంగా కొనసాగించవచ్చు. బ్యాంకుల పనులను ముందుగానే ప్లాన్ చేసుకుంటే ఎటువంటి ఇబ్బందులు ఎదురుకావు.

  Last Updated: 31 Aug 2025, 12:18 PM IST