Site icon HashtagU Telugu

Sensex 85000 : 85వేలు దాటిన సెన్సెక్స్.. లైఫ్ టైం గరిష్ఠానికి చేరిక

Stock Market

Stock Market

Sensex 85000 : భారత స్టాక్ మార్కెట్‌లో బుల్ రన్ కొనసాగుతోంది. తాజాగా ఇవాళ బీఎస్‌ఈ సెన్సెక్స్ 80.74 పాయింట్లు పెరిగి 85,030 పాయింట్లు దాటింది. సెన్సెక్స్‌కు ఇది జీవితకాల గరిష్ఠ స్థాయి. ఇక ఎన్ఎస్‌ఈ నిఫ్టీ 29.15 పాయింట్లు పెరిగి 25,972 పాయింట్ల (Sensex 85000) స్థాయికి చేరింది. మెటల్, పవర్, క్రూడ్, గ్యాస్‌ రంగ కంపెనీల షేర్లలో కొనుగోళ్లు పెద్దఎత్తున జరుగుతున్నాయి.  టాటా స్టీల్‌, హిందాల్కో, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, పవర్‌గ్రిడ్‌ కార్పొరేషన్‌, అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఐటీ షేర్లు స్వల్ప నష్టాల్లో ఉన్నాయి.

Also Read :Telegram : టెలిగ్రాం యూజర్లకు అలర్ట్.. పావెల్ దురోవ్ సంచలన ప్రకటన

ఇవాళ అంతర్జాతీయ మార్కెట్లలోని సానుకూలతల వల్ల భారత స్టాక్ మార్కెట్ పాజిటివ్ మూడ్‌లో నడుస్తోంది. ఆప్షన్స్ ఎక్స్‌పరీ సమీపించడంతో కొన్ని సెగ్మెంట్లలో ఎక్కువగా కదలికలు కనిపిస్తున్నాయి. నెలవారీ ఎక్స్‌పరీ కూడా చేరువైంది. ఈ ప్రభావం సైతం మార్కెట్‌పై ఉందని అంటున్నారు. మరోవైపు కొందరు మార్కెట్ నిపుణులు మాత్రం జాగ్రత్తగా ఉండాలని స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు సూచిస్తున్నారు. మార్కెట్ ఓవర్ బాట్ జోన్‌లో ఉందని, చిన్న తరహా స్టాక్ మార్కెట్ ట్రేడర్లు అలర్ట్‌గా ఉండటం మంచిదని చెబుతున్నారు. కొన్ని  ప్రధాన స్టాక్స్‌లో చోటుచేసుకుంటున్న పరిణామాల బలంతో మార్కెట్ దూకుడుగా ముందుకు వెళ్తోందని గుర్తు చేస్తున్నారు. రిలయన్స్ ఇండస్ట్రీస్, అదానీ గ్రూప్ లాంటి స్టాక్స్ గత పదేళ్లలో భారీగా ముందుకు సాగాయని.. వాటి దన్నుతో మార్కెట్ ఇంతలా పురోగమించిందని విశ్లేషిస్తున్నారు.

మొబిక్విక్‌.. దేశంలో పేరు గడించిన పేమెంట్‌ ప్లాట్‌ఫామ్‌. ఇది స్టాక్ మార్కెట్‌లో ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీఓ)కు వస్తోంది. ఐపీఓ ద్వారా  దాదాపు రూ.700 కోట్లను సమీకరించాలని మొబిక్విక్ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ కంపెనీ ఐపీఓకు ఇప్పటికే సెబీ అనుమతులు మంజూరు చేసింది. ఇక సోలార్‌ ప్యానెళ్ల తయారీ కంపెనీ వారీ ఎనర్జీస్‌ కూడా ఐపీఓకు వస్తోంది. దీని ద్వారా రూ.3,000 కోట్లను సమీకరించాలని అది లక్ష్యంగా పెట్టుకుంది.

Also Read :Japan Earthquake: జ‌పాన్‌లో భారీ భూకంపం.. సునామీ హెచ్చ‌రిక‌లు జారీ..!

Exit mobile version