Site icon HashtagU Telugu

Sreela Venkataratnam : ‘టెస్లాలో పనిచేయడం కష్టం’.. వైస్‌ ప్రెసిడెంట్‌ శ్రీలా వెంకటరత్నం రాజీనామా

Sreela Venkataratnam Elon Musk

Sreela Venkataratnam : అపర కుబేరుడు ఎలాన్ మస్క్‌కు ప్రపంచమంతా మంచి పేరు వస్తున్నా.. తన కంపెనీల్లోని ఉద్యోగుల దగ్గర మాత్రం మంచి క్రెడిట్ లభించడం లేదు. మస్క్‌కు చాలా స్టార్టప్‌లు ఉన్నాయి. వాటిలోని చాలామంది నిపుణులు ఇప్పటికీ రాజీనామా చేసి వెళ్లిపోయారు. ట్విట్టర్‌ను మస్క్ కొన్న వెంటనే ఎంతోమంది గుడ్ బై చెప్పారు. మరెంతో మందితో బలవంతంగా రాజీనామాలు చేయించారు. తాజాగా ఎలాన్ మస్క్‌కు చెందిన ఎలక్ట్రిక్ కార్ల తయారీ కంపెనీ టెస్లా నుంచి భారత సంతతికి చెందిన శ్రీలా వెంకటరత్నం(Sreela Venkataratnam) వైదొలిగారు. ఉద్యోగానికి రాజీనామా చేసే సమయానికి ఆమె టెస్లా కంపెనీలో కీలకమైన వైస్‌ ప్రెసిడెంట్‌ హోదాలో ఉన్నారు.

We’re now on WhatsApp. Click to Join

టెస్లా కంపెనీకి తన రాజీనామా గురించి సోషల్ మీడియా సైట్ ‘లింక్డ్‌ఇన్’ వేదికగా శ్రీలా వెంకటరత్నం కీలక ప్రకటన చేశారు. ‘‘నేను చేరిన తర్వాతే టెస్లా రూ.58 లక్షల కోట్లు విలువైన కంపెనీగా అవతరించినందుకు  సంతోషంగా ఉంది. సుదీర్ఘకాలం పాటు టెస్లాలో పనిచేశాను. ఇక కొంతకాలం విరామం తీసుకుంటాను.  కుటుంబంతో, స్నేహితులతో సరదగా సమయం గడుపుతాను. ఆ తర్వాతే కొత్త అవకాశాల కోసం వెతుకుతాను. ఫ్యామిలీకి నా సమయాన్ని కేటాయించడానికే రాజీనామా చేశాను’’ అని లింక్డిన్‌లో పోస్ట్‌లో శ్రీలా వెంకటరత్నం చెప్పుకొచ్చారు. టెస్లాతో తన ఈ ప్రయాణంలో ఎన్నో విజయాలు సాధించినట్లు తెలిపారు. ఈక్రమంలో తోటి ఉద్యోగుల సహకారం మరువలేనిదన్నారు. అయితే ఆమె పోస్టు కింద కామెంట్‌ పెట్టిన టెస్లా మాజీ సీఎఫ్‌ఓ కామెంట్‌కు శ్రీలా వెంకటరత్నం రిప్లై ఇస్తూ.. ‘టెస్లాలో పనిచేయడం కష్టం’ అని వ్యాఖ్యానించారు. అందుకు ఆయన కూడా నిజమే అని బదులివ్వడం గమనార్హం. ‘‘మంచి పనిచేశావు. టెస్లాలో పనిచేయడం అంత ఈజీ కాదు’’ అని సదరు టెస్లా మాజీ సీఎఫ్‌ఓ చెప్పారు. ఈ ఏడాది ఏప్రిల్‌ నెలలోనే ముగ్గురు ఎగ్జిక్యూటివ్‌లు టెస్లా కంపెనీని వదిలేశారు. ఈ పరిణామం జరిగిన నాలుగు నెలల్లోనే శ్రీలా కూడా బయటికి రావడం అక్కడి పరిస్థితిని అద్దంపడుతోంది.

Also Read :Sonobuoy : భారత సైన్యానికి రూ.442 కోట్ల ‘సోనో బ్యుయ్’‌లు.. ఏమిటివి ?

Also Read :RHUMI 1 Rocket: హైబ్రిడ్ రాకెట్‌ను ప‌రీక్షించిన ఇండియా.. వీడియో ఇదే..!