Site icon HashtagU Telugu

Anil Ambani: అనిల్‌ అంబానీకి బిగ్‌ షాక్‌

Anil Ambani

Anil Ambani

ప్రముఖ వ్యాపారవేత్త అనిల్ అంబానీ (Anil Ambani )కి భారీ షాక్ తగిలింది. అనిల్ అంబానీపై మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ (SEBI bans ) ఐదేళ్ల పాటు నిషేధం విధించింది. అనిల్ అంబానీ సహా మరో 24 సంస్థలను నిషేదించారు. వీరందరినీ సెక్యూరిటీ మార్కెట్ నుంచి సెబీ నిషేధించింది. కేవలం నిషేధమే కాదు రూ.25 కోట్ల పెనాల్టీని కూడా సెబీ విధించింది.

We’re now on WhatsApp. Click to Join.

ఈ నిషేధం తర్వాత, అనిల్ అంబానీ ఇకపై సెక్యూరిటీ మార్కెట్‌లో పాల్గొనలేరు. లిస్టెడ్ కంపెనీలో డైరెక్టర్, కీ మేనేజర్ పర్సనల్ లాంటి పదవులు దక్కకుండా ఆదేశాలు ఇచ్చింది. సెక్యూరిటీస్ మార్కెట్ నుంచి కంపెనీ నిధుల మళ్లింపు జరగకుండా చర్యలు తీసుకోవాలని పేర్కొంది. రిలయన్స్ హోమ్ ఫైనాన్స్‌ను సెక్యూరిటీల మార్కెట్ నుంచి బ్యాన్‌ చేసింది. రిలయన్స్ హోమ్ ఫైనాన్స్‌పై ఆరు నెలల పాటు నిషేధంతో పాటు రిలయన్స్ హోమ్ ఫైనాన్స్‌పై రూ. 6 లక్షల జరిమానా విధించింది. కంపెనీ నుండి నిధుల మళ్లింపు ఆరోపణలపై సెబి వీరి ఫై చర్య తీసుకుంది.

Read Also : Drum Brake vs Disk Brake : డిస్క్ లేదా డ్రమ్ బ్రేక్, ఏ సేఫ్టీ ఫీచర్ ఉన్న బైక్ మంచిది..?

Exit mobile version