Site icon HashtagU Telugu

Gold From Lead : సీసాన్ని బంగారంగా మార్చేసే టెక్నాలజీ.. సైంటిస్టుల సక్సెస్

Gold From Lead Scientists Gold Markets Gold Prices

Gold From Lead : బంగారం తయారీ రంగంలో విప్లవాత్మక ఆవిష్కరణ జరిగింది.  సీసం నుంచి బంగారాన్ని తయారు చేశారు. స్విట్జర్లాండ్‌లోని జెనీవాలో ఉన్న యూరోపియన్ ఆర్గనైజేషన్ ఫర్ న్యూక్లియర్ రీసెర్చ్‌(సీఈఆర్ఎన్)కు చెందిన  భౌతిక శాస్త్రవేత్తలు ఈ ఘనతను సాధించారు. వివరాలివీ..

Also Read :1971 Vs 2025 Years :1971, 2025 ఒకేలా లేవు.. ఇప్పుడు పాక్ వద్ద అణ్వస్త్రాలున్నాయ్ : శశిథరూర్

సీసం బంగారంగా ఎలా మారుతుంది ? 

సీఈఆర్ఎన్ శాస్త్రవేత్తలు సీసాన్ని బంగారంగా మార్చడంలో సక్సెస్ అయ్యారు. సీసంలోని కేంద్రకాల అధిక శక్తి,  ఘర్షణల సమయంలో అవి బంగారం కేంద్రకాలుగా మారడాన్ని సైంటిస్టులు గుర్తించారు. సీసపు మూలకాల మధ్య ప్రోటాన్ సంఖ్యలో తేడాల (సీసానికి 82, బంగారానికి 79) వద్ద బంగారంగా రూపొందించడం కొంత కష్టమే. అయితే కాంతి వేగంతో ప్రయాణించే సీసపు కిరణాలలోని అయాన్లు అప్పుడప్పుడు ఎదురుగా ఢీకొనకుండా  ప్రయాణిస్తాయి. ఇలా జరిగినప్పుడు ఒక అయాన్ చుట్టూ ఉన్న తీవ్రమైన విద్యుదయస్కాంత క్షేత్రం అనేది శక్తి పల్స్‌ను సృష్టిస్తుంది. ఆ సమయంలో సీసపు కేంద్రకం నుంచి మూడు ప్రోటాన్‌లను బయటకు పంపడానికి ప్రేరేపిస్తుంది. ఇలా జరిగినప్పుడు సీసం బంగారంగా మారిపోతుందని సైంటిస్టులు వెల్లడించారు.

Also Read :Ambanis Mango Empire: రిలయన్స్ మామిడి సామ్రాజ్యం.. 600 ఎకరాల్లో 1.30 లక్షల మ్యాంగో ట్రీస్

ఒక తేడాను గుర్తించిన సైంటిస్టులు

యూరోపియన్ ఆర్గనైజేషన్ ఫర్ న్యూక్లియర్ రీసెర్చ్‌(సీఈఆర్ఎన్) సంస్థలో ‘సూపర్ ప్రోటాన్ సింక్రోట్రాన్’ అనే యాక్సిలరేటర్ కూడా ఉంది. దీన్ని ఉపయోగించి 2002 నుంచి 2004 సంవత్సరం వరకు సీసంపై పరిశోధనలు చేశారు. అప్పట్లోనూ సీసం(Gold From Lead) బంగారంగా మారడాన్ని గుర్తించారు. అయితే తాజాగా జరిగిన ప్రయోగాల్లో ఒక తేడాను గుర్తించారు. సీసంలోని కేంద్రకాల అధిక శక్తి,  ఘర్షణల సమయంలో అవి బంగారం కేంద్రకాలుగా మారుతున్నట్లు సైంటిస్టులు నిర్ధారణకు వచ్చారు. ఈ విధానంలో సీసం నుంచి మరింత ఎక్కువ మోతాదులో బంగారాన్ని తయారు చేయొచ్చని శాస్త్రవేత్తలు చెప్పారు. ఒకవేళ దీనికి సంబంధించిన నిర్దిష్ట సాంకేతికత అందుబాటులోకి వస్తే.. భవిష్యత్తులో సీసం భారీ మొత్తంలో గోల్డ్‌గా మారుతుంది. దీనివల్ల భవిష్యత్తులో సీసం ధరలు రెక్కలు తొడుగుతాయి. బంగారం సప్లై గణనీయంగా పెరిగితే.. దాని ధరలు దిగొచ్చే అవకాశం ఉంటుంది.