Samsung : గెలాక్సీ ఎస్ సిరీస్ కోసం రిజర్వేషన్‌ను ప్రారంభించిన సామ్‌సంగ్

మొబైల్ ఏఐ లో ఒక కొత్త అధ్యాయాన్ని కొత్త గెలాక్సీ ఎస్ సిరీస్ ఆవిష్కరిస్తుంది. మీ జీవితంలోని ప్రతి క్షణంలోకి సజావుగా సౌలభ్యాన్ని తీసుకువచ్చే ప్రీమియం గెలాక్సీ ఆవిష్కరణలను ఆవిష్కరిస్తుంది.

Published By: HashtagU Telugu Desk
Samsung has opened the reservation for the Galaxy S series

Samsung has opened the reservation for the Galaxy S series

Samsung : భారతదేశంలో అతిపెద్ద వినియోగదారు ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ అయిన సామ్‌సంగ్, ఈరోజు నుండి తమ తదుపరి గెలాక్సీ ఎస్ సిరీస్ స్మార్ట్‌ఫోన్‌ను వినియోగదారులు ముందస్తు రిజర్వ్ చేసుకోవచ్చని వెల్లడించింది. మొబైల్ ఏఐ లో ఒక కొత్త అధ్యాయాన్ని కొత్త గెలాక్సీ ఎస్ సిరీస్ ఆవిష్కరిస్తుంది. మీ జీవితంలోని ప్రతి క్షణంలోకి సజావుగా సౌలభ్యాన్ని తీసుకువచ్చే ప్రీమియం గెలాక్సీ ఆవిష్కరణలను ఆవిష్కరిస్తుంది.

వినియోగదారులు Samsung.com, సామ్‌సంగ్ ఎక్స్క్లూజివ్ స్టోర్‌లు మరియు భారతదేశం అంతటా ప్రముఖ ఆన్‌లైన్ మరియు ఆఫ్‌లైన్ రిటైల్ స్టోర్‌లలో రూ. 2000 టోకెన్ మొత్తాన్ని చెల్లించడం ద్వారా ఫ్లాగ్‌షిప్ గెలాక్సీ ఎస్ సిరీస్‌ను ప్రీ-రిజర్వ్ చేసుకోవచ్చు. ప్రీ-రిజర్వ్ చేయబడిన కస్టమర్‌లు ముందస్తు గా ఫోన్ సొంతం చేసుకోవటానికి అర్హులు మరియు కొత్త గెలాక్సీ ఎస్ సిరీస్ పరికరాలను కొనుగోలు చేయడంపై రూ. 5000 వరకు ప్రయోజనాలను పొందుతారు.

గెలాక్సీ ఏఐ యొక్క తదుపరి పరిణామాన్ని సామ్‌సంగ్ తీసుకువస్తుంది, ఇది వినియోగదారులు ప్రతిరోజూ ప్రపంచంతో సంభాషించే విధానాన్ని మారుస్తుంది. కొత్త గెలాక్సీ ఎస్ సిరీస్ మొబైల్ ఏఐ అనుభవాల కోసం మరోసారి బార్‌ను సెట్ చేస్తుంది. జనవరి 22న కాలిఫోర్నియాలోని శాన్ జోస్‌లో జరిగే గెలాక్సీ అన్‌ప్యాక్డ్‌లో సామ్‌సంగ్ తన తదుపరి తరం గెలాక్సీ ఎస్ సిరీస్‌ను ఆవిష్కరించనుంది. లింక్: https://www.samsung.com/in/unpacked/

Read Also: Steve Jobs Wife : స్టీవ్ జాబ్స్ భార్య పేరు ఇక కమల.. ఎందుకంటే ?

  Last Updated: 13 Jan 2025, 06:42 PM IST