Rupee: భారతీయ కరెన్సీ మార్కెట్ నేడు తీవ్ర గందరగోళానికి గురైంది. సోమవారం ప్రారంభ ట్రేడింగ్‌లో డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ ఎన్నడూ లేని విధంగా 95.14 కనిష్ట స్థాయికి పడిపోయింది. భారత రూపాయి 95 మార్కును దాటడం ఇదే తొలిసారి. కేవలం ఈ మార్చి త్రైమాసికంలోనే డాలర్‌పై రూపాయి విలువ 4.4% మేర బలహీనపడింది.
RBI కఠిన చర్యలు, స్పెక్యులేషన్‌పై ఆంక్షలు
శుక్రవారం మార్కెట్ ముగిసిన తర్వాత బ్యాంకుల కోసం నెట్ ఓపెన్ ఫారెక్స్ పొజిషన్ పరిమితిని ఆర్బీఐ $100 మిలియన్లకు నిర్ణయించింది. బ్యాంకులు దీనిని ఏప్రిల్ 10లోపు అమలు చేయాల్సి ఉంటుంది. స్పెక్యులేషన్‌ను అరికట్టడమే ఈ చర్య ముఖ్య ఉద్దేశ్యం అయినప్పటికీ గడువు చాలా తక్కువగా ఉండటంతో మార్కెట్‌లో ఆందోళన నెలకొందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దీనివల్ల పొజిషన్ అన్‌వైండింగ్ జరిగి రూపాయిపై ఒత్తిడి పెరిగింది.
Also Read: నేడు సీఎస్కే- ఆర్ఆర్ మధ్య పోరు.. హెడ్-టు-హెడ్ రికార్డులివే!!
బాండ్ మార్కెట్‌లో 21 నెలల రికార్డు బ్రేక్
రూపాయి పతనం ప్రభావం ప్రభుత్వ బాండ్ మార్కెట్‌పై కూడా స్పష్టంగా కనిపిస్తోంది. భారత 10 ఏళ్ల బెంచ్‌మార్క్ బాండ్ ఈల్డ్ నేడు 7.0121%కి చేరుకుంది. జూలై 2024 తర్వాత ఈల్డ్ 7% స్థాయిని దాటడం ఇదే మొదటిసారి. బాండ్ ఈల్డ్ పెరగడం అంటే ప్రభుత్వం తీసుకునే అప్పులు ఖరీదైనవిగా మారుతాయని అర్థం. ఇది భవిష్యత్తులో బ్యాంక్ వడ్డీ రేట్లు, మీ EMIల పెరుగుదలకు దారితీసే అవకాశం ఉంది.
ముడి చమురు రెట్టింపు దెబ్బ
అంతర్జాతీయ మార్కెట్‌లో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర $116 మార్కును దాటడంతో భారత వాణిజ్య లోటు మరింత పెరుగుతుందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. చమురు దిగుమతుల కోసం భారీగా డాలర్లు అవసరం కావడంతో డాలర్‌కు డిమాండ్ పెరిగి రూపాయి విలువ మరింత బలహీనపడింది.
