Rules Change: నవంబర్ నెల ముగియడానికి మరో రెండు రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఈ నెల ముగియగానే డిసెంబర్ 1, 2025 నుండి కొన్ని నిబంధనలు (Rules Change) మారబోతున్నాయి. ఇవి మీ జేబుపై నేరుగా ప్రభావితం చేస్తాయి. ఆ మార్పులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం!
ఆధార్ కార్డులో మార్పులు
UIDAI (యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా) డిసెంబర్ 1 నుండి ఆధార్ కార్డులో పెద్ద మార్పులు చేయబోతోంది. ఇప్పటివరకు ఆధార్ కార్డులో పేరు, చిరునామా, ఆధార్ నంబర్ వంటి ముఖ్యమైన వివరాలు ఉండేవి. కానీ UIDAI ఆధార్ కార్డును పెద్ద ఎత్తున రీడిజైన్ చేస్తోంది. ఇందులో కేవలం హోల్డర్ ఫోటో, ఒక QR కోడ్ మాత్రమే కనిపిస్తుంది. పేరు, చిరునామా, 12 అంకెల ఆధార్ నంబర్ వంటి వ్యక్తిగత వివరాలు కార్డుపై కనిపించకుండా తొలగించబడతాయి.
LPG (వంట గ్యాస్) ధరలు
వంట గ్యాస్ ధరలు డిసెంబర్ 1న మారతాయి. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ప్రతి నెలా మొదటి తేదీన అంతర్జాతీయ ధరలు, కరెన్సీ మార్పుల ఆధారంగా LPG రేట్లను సవరిస్తాయి. గత నెలలో డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధరలలో ఎలాంటి మార్పు జరగలేదు. ఇప్పుడు డిసెంబర్ 1న గృహ వినియోగదారులకు ఉపశమనం లభిస్తుందా లేక ఖర్చు పెరుగుతుందా అనేది తెలుస్తుంది.
Also Read: Trump: దక్షిణాఫ్రికాపై డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయం!
SBI రెండు కొత్త నియమాలు
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) డిసెంబర్ 1 నుండి రెండు కొత్త నిబంధనలను అమలు చేయబోతోంది. నవంబర్ 30 తర్వాత కస్టమర్లు mCash ఉపయోగించి లావాదేవీలు చేయలేరు. కస్టమర్లు దీనికి బదులుగా UPI, RTGS, NEFT వంటి ప్లాట్‌ఫారమ్‌లను ఉపయోగించవచ్చు. ATM ఫీజులలో కూడా మార్పు చేయబడింది. ఇది డెబిట్ కార్డ్ వినియోగదారులపై ప్రభావం చూపుతుంది. నిర్ణీత పరిమితికి మించి లావాదేవీలు చేస్తే సుమారు 2 రూపాయల అదనపు ఫీజు వసూలు చేయబడుతుంది.
కోటక్ మహీంద్రా బ్యాంక్ SMS ఛార్జీలు
కోటక్ మహీంద్రా బ్యాంక్ తన సేవింగ్స్ ఖాతా నిబంధనలను మార్చింది. డిసెంబర్ 1 నుండి ప్రతి SMS అలర్ట్ కోసం రూ. 0.15 పైసల ఫీజు వసూలు చేయబడుతుంది. అయితే ఈ ఛార్జీ నెలకు 30 కంటే ఎక్కువ SMS అలర్ట్‌లకు మాత్రమే వర్తిస్తుంది. RTGS, IMPS బదిలీలు, ATM నుండి డబ్బు విత్‌డ్రాయల్, ఇతర లావాదేవీలకు కూడా ఈ నియమం వర్తిస్తుంది. కొందరికి మాత్రం కొంత ఉపశమనం కల్పించారు.
లేబర్ కోడ్ (కార్మిక చట్టం)లో మార్పులు
డిసెంబర్ 1 నుండి న్యూ లేబర్ కోడ్ అమలులోకి రానుంది. దీని ప్రకారం.. జీతం నిర్మాణంలో మార్పులు కనిపిస్తాయి. ఉద్యోగుల మొత్తం జీతంలో 50% బేసిక్ శాలరీ అవుతుంది. దీనితో పాటు ఒక సంవత్సరం తర్వాతే గ్రాట్యుటీ (Gratuity) పొందే నిబంధన కూడా అమలులోకి వస్తుంది.
