Site icon HashtagU Telugu

Pani Puri : వామ్మో..ప్లేటు పానీపూరీ రూ.333

Panipuri Cost

Panipuri Cost

ప్రస్తుతం పానీపూరి (Pani Puri) కి ఎంత డిమాండ్ ఉందో చెప్పాల్సిన పనిలేదు. ఒకప్పుడు పెద్ద పెద్ద సిటీలలోనే ఈ పానీపూరి బండ్లు కనిపించేవి..కానీ ఇప్పుడు మరుమూలా గ్రామాల్లో కూడా పానీపూరి బండ్లు కనిపిస్తున్నాయి. చూసేందుకు చాల చీఫ్ గా కనిపించిన..వీటి రాబడి..లాభాలు ఏ సాఫ్ట్ వెర్ ఉద్యోగికి కూడారవు. ఆ రేంజ్ లో ఈ బిజినెస్ నడుస్తుంది. చోటూ.. పది రూపాయల పానీపూరీ ఇవ్వు.. అంటాం. ప్లేట్ పట్టుకుంటాం. ఇన్ని ఉల్లిపాయ ముక్కలు ప్లేట్ లో వేసుకొని.. పూరీలో ఇంత చాట్ వేసి.. ఓ రకమైన పానీయంలో ముంచి ప్లేట్ లో పెడతాడు. దాంట్లో కొన్ని ఉల్లిగడ్డ ముక్కలేసుకొని నోట్లో వేసుకుంటే.. ఇట్టే కరిగిపోతుంది పానీపూరి. పానీపూరి అమ్మే వ్యక్తి.. టకా టకా ప్లేట్ లో పానీపూరీ వేస్తూనే ఉంటాడు. మనం ఆరగిస్తూనే ఉంటాం. అలా ఎన్ని వేసినా తింటూనే ఉంటాం. అంతలా నోరూరిస్తుంది పానీపూరీ. చిన్నపిల్లల దగ్గర్నుంచి పండు ముసలి వరకు పానీపూరీ అనగానే నోరూరాల్సిందే.

We’re now on WhatsApp. Click to Join.

ఇప్పటివరకు పానీపూరి ప్లేట్ ధర రూ. 20 నుండి 50 వరకు ఉంటుందనే తెలుసు..కానీ ముంబై ఎయిర్ పోర్ట్ (Mumbai Airport) లో మాత్రం ప్లేట్ వచ్చేసి రూ.333. తాజాగా ఎయిర్‌పోర్టుకు వెళ్లిన ఓ బిజినెస్‌మెన్ పానీపూరీ తిందామని అక్కడే ఉన్న ఓ ఫుడ్ స్టాల్‌కు వెళ్లాడు. అక్కడ ప్లేట్ పానీపూరీ రూ.333 అని రాసి ఉండటం చూసి షాక్ ఇచ్చాడు. వెంటనే దాని ఫోటో తీసుకుని కౌశిక్ ముఖర్జీ (Kaushik Mukherjee) అనే బిజినెస్‌మెన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ముంబై ఎయిర్‌పోర్టులో ఉండే ఫుడ్ స్టాల్స్‌లోని ఫుడ్ చాలా ఖరీదు అని తెలుసు కానీ.. మరీ అంత కాస్ట్‌ లీ అని తెలియదు అని పేర్కొన్నాడు. ఆ ఫోటోలో పక్కనే దహీ పూరీ, సెవ్ పూరీ కూడా ప్లేట్‌కు రూ.333 ఉండటం గమనార్హం. ఒక్కో ప్లేట్‌లో 8 పానీపూరీలు ఉన్నాయి. అంటే 8 పానీపూరీలకు రూ.333 అన్నమాట. తినేటోడి ఆకలి తీరాలంటే కనీసం పానీపూరి లకే రూ.2000 కు పెట్టాల్సిందన్నమాట.

Read Also : Narendra Modi : కాంగ్రెస్ ప్రభుత్వం భారతదేశాన్ని కొత్త శిఖరాలకు తీసుకెళ్లగలదా