Currency Notes: కొత్త రూ.100, 200 నోట్లను (Currency Notes) విడుదల చేయనున్నారు. గవర్నర్ సంజయ్ మల్హోత్రా సంతకంతో కూడిన రూ.100, రూ.200 నోట్లను త్వరలో విడుదల చేయనున్నట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) మంగళవారం వెల్లడించింది. ఈ కొత్త నోట్లపై రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ సంజయ్ మల్హోత్రా సంతకం ఉంటుందని ఆర్‌బీఐ చీఫ్ జనరల్ మేనేజర్ పునీత్ పంచోలి మంగళవారం తెలిపారు. ఈ కొత్త నోట్లపై రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ సంజయ్ మల్హోత్రా సంతకం ఉంటుందని ఆర్‌బీఐ చీఫ్ జనరల్ మేనేజర్ పునీత్ పంచోలి మంగళవారం తెలిపారు.
డిజైన్ ఎలా ఉంటుంది?
ఈ కొత్త నోట్ల రూపకల్పన ప్రస్తుతం ఉన్న మహాత్మా గాంధీ (కొత్త) సిరీస్ రూ.100, రూ.200 నోట్లను పోలి ఉంటుంది. అంటే వాటి రంగు, నమూనా, భద్రతా లక్షణాలు ప్రస్తుత నోట్లకు అనుగుణంగా ఉంటాయి. గతంలో జారీ చేసిన రూ.100, రూ.200 పాత నోట్లన్నీ కూడా చలామణిలోనే ఉంటాయని, వాటిని చట్టబద్ధమైన టెండర్‌గా పరిగణిస్తామని ఆర్‌బీఐ స్పష్టం చేసింది. శక్తికాంత దాస్ స్థానంలో మల్హోత్రా డిసెంబర్ 2024లో RBI గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టారు.
Also Read: Orange Peels: తొక్కే కదా అని పడేయకండి.. లాభాలు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!
ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు?
నగదు సరఫరాను కొనసాగించడం, బ్యాంకింగ్ వ్యవస్థలో స్థిరత్వాన్ని నిర్ధారించే లక్ష్యంతో ఈ చర్య తీసుకున్నట్లు ఆర్బీఐ అధికారులు పేర్కొన్నారు. కొత్త గవర్నర్ సంతకంతో కూడిన నోట్లను జారీ చేయడం అనేది ఒక సాధారణ ప్రక్రియ. ఇది ప్రతి కొత్త గవర్నర్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత జరుగుతుంది. కొత్తగా నియమితులైన గవర్నర్ సంజయ్ మల్హోత్రా సంతకంతో కూడిన రూ.50 బ్యాంకు నోట్లను త్వరలో విడుదల చేస్తామని ఆర్‌బిఐ ఇంతకుముందు చెప్పింది. ఈ నోట్ల రూపకల్పన మహాత్మా గాంధీ (కొత్త) శ్రేణికి చెందిన రూ.50 బ్యాంకు నోట్లను పోలి ఉంటుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గతంలో జారీ చేసిన అన్ని రూ.50 డినామినేషన్ బ్యాంక్ నోట్లు చట్టబద్ధమైన చెల్లుబాటులో కొనసాగుతాయి.