Retail Mogul : డీమార్ట్ బిజినెస్ శరవేగంగా దేశమంతటా వ్యాపించింది. ఇప్పుడు ఈ కంపెనీకి దేశంలో వందలాది స్టోర్లు ఉన్నాయి. ఈ కంపెనీ ఓనర్ రాధాకిషన్ దమానీ మన దేశంలోని అత్యంత ధనవంతుల్లో ఒకరు. తాజాగా దమానీ ముంబై ఛండీవలీ ప్రాంతంలో 1.2 ఎకరాల భూమిని రూ. 117 కోట్లకు కొన్నారు. కంపెనీ తన వృద్ధి ప్రణాళికల్లో భాగంగా వరుసపెట్టి ప్లాట్లు కొంటోంది. ఈ ప్లాట్ ముంబైలోని ఇండస్ట్రియల్ జోన్‌లో ఉంది. ఇక్కడ డీమార్ట్ రిటైల్ షాపింగ్ సెంటర్ లేదా కమర్షియల్ బిల్డింగ్‌ను కట్టాలనే ప్లాన్‌లో దమానీ(Retail Mogul) ఉన్నారట. ఈ భూమిని కొనేందుకు దమానీ స్టాంప్ డ్యూటీ కింద రూ. 7.03 కోట్లు కట్టారట. మే 6వ తేదీనే ఈ భూమికి సంబంధించిన రిజిస్ట్రేషన్ జరిగిందట.
We’re now on WhatsApp. Click to Join
- డీమార్ట్ స్టోర్ల ప్రస్థానం 2002లో ముంబైలోని పోవైలో తొలి స్టోరుతో మెుదలైంది.
- ప్రస్తుతం డీమార్ట్‌కు మహారాష్ట్ర, గుజరాత్, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, దిల్లీ, తమిళనాడు, పంజాబ్, రాజస్థాన్‌లలో స్టోర్లు ఉన్నాయి.
- దేశంలో ఇప్పుడు డీమార్ట్ స్టోర్ల సంఖ్య 367కు చేరింది.
- 2023-24 ఆర్థిక సంవత్సరం చివరి నాటికి డీమార్ట్ రిటైల్ బిజినెస్ ఏరియా 15.1 మిలియన్ చదరపు అడుగులు ఉంది.
- ఒక్క ఆర్థిక సంవత్సరంలోనే కొత్తగా 41 స్టోర్లను డీమార్ట్ తెరిచింది.
- గత ఆర్థిక సంవత్సరంలో డీమార్ట్ నికర లాభం రూ. 2536 కోట్లుగా నమోదైంది.
- 2022-23లో డీమార్ట్ నికర లాభం రూ. 2378 కోట్లుగా ఉంది. ఆదాయం రూ. 50789 కోట్లుగా నమోదైంది.
- భారత్‌లోని అత్యంత సంపన్నుల లిస్టులో దమానీ 8వ ప్లేస్‌లో ఉన్నారు.
- బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం.. దమానీ సంపద 22.5 బిలియన్ డాలర్లుగా ఉంది. భారత కరెన్సీలో చూస్తే ఇది రూ. 1.87 లక్షల కోట్లు.