Site icon HashtagU Telugu

Trolls : నీ కొడుకు పెళ్లి ఖర్చు మా మీద వేస్తున్నావా..అంబానీ..?

Jio Recharge

Jio Recharge

ప్రముఖ టెలికాం సంస్థ రిలయన్స్ జియో.. (Reliance Jio).. కస్టమర్లకు భారీ షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. తమ మొబైల్ రీఛార్జ్ టారిఫ్ ప్లాన్లను (Jio Tarif Plans) భారీగా పెంచేసింది. దీనిపై కస్టమర్లు విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. నీ కొడుకు పెళ్లి ఖర్చు మా మీద వేస్తున్నావా..అంబానీ అంటూ సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారు.

అంబానీ రెండో కుమారుడు అనంత్ అంబానీ పెళ్లి జులై12న జరగబోతుంది. రెండు నెలల క్రితం గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో వీరిద్దరి ప్రీ వెడ్డింగ్ వేడుకలు మూడు రోజుల పాటు ఘనంగా జరిగాయి. ఆ వేడుకలకు పెద్ద ఎత్తున సినీ, రాజకీయ, క్రీడా, వ్యాపార ప్రముఖులతో పాటు విదేశాల నుంచి కూడా అతిరథ మహరథులు విచ్చేశారు. రెండో ప్రీ వెడ్డింగ్ వేడుకలు ముంబైలో జరిగాయి. ప్రీ వెడ్డింగ్ వేడుకలే ఆ రేంజ్ లో ఉంటే ఇంక పెళ్లి ఏ రేంజ్ లో జరుగుతుందో చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం వీరి పెళ్లి కార్డు కూడా హాట్ టాపిక్ గా మారింది. వెడ్డింగ్ కార్డ్​ను ఒక ఆలయం రూపంతో బాక్స్​లాగా తీర్చిదిద్దారు. అమర్చిన రెండు చిన్న తలుపులు తెరవగానే రంగురంగుల లైట్ల వెలుగులో ఓంకారనాదంతో మొదలైన విష్ణు సహస్రనామం వినిపిస్తోంది. వెండితో చేసిన పూజ మందిరాన్ని అమర్చారు. ఆ ఆలయం నలువైపుల వినాయకుడు, దుర్గాదేవి, రాధాకృష్ణ, విష్ణమూరి బంగారు విగ్రహాలను ఏర్పాటు చేశారు. పూజ మందిరమంతా చిన్న చిన్న గంటలతో ముచ్చటగా కనిపిస్తుంది. ఇది శుభలేఖా..మరోటా అనే రేంజ్ లో ఉంది. ఇలా ఈ పెళ్లి కి అంబానీ వందల కోట్లు ఖర్చు చేస్తున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

ఇదే క్రమంలో జియో మొబైల్ రీఛార్జ్ టారిఫ్ ప్లాన్లను (Jio Tarif Plans) భారీగా పెంచేస్తునట్లు ప్రకటించడం ఫై కస్టమర్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న కనిష్ట నెలవారి ప్రీపెయిడ్ ప్లాన్ ను రూ.155 నుంచి రూ.189కి పెంచింది. ప్లాన్ ను బట్టి ఈ పెంపు కనిష్టంగా రూ. 34 నుంచి గరిష్టంగా రూ.600 వరకు పెంచింది. మరోవైపు 1 జీబీ డేటా యాడ్ ఆన్ ప్లాన్ రీఛార్జి ధరను రూ.15 నుంచి రూ.19కి పెంచింది. అలాగే.. జియో రూ. 209 ప్రీపెయిడ్ ప్లాన్ ధర ఇప్పుడు రూ. 249 అయింది. దాని వాలిడిటీ 28 రోజులు ఉంటుంది. రూ.239 ప్లాన్ ఇప్పుడు రూ.299గా మారింది. దీని వాలిడిటీ 28 రోజులు ఉంటుంది. జియో సేఫ్, జియో ట్రాన్స్ లేట్. క్వాంటం సెక్యూర్ కమ్యూనికేసన్ ఆప్ పర్ కాలింగ్, మెసేజింగ్, ఫైల్ ట్రాన్స్ ఫర్ తదితరాల కోసం రూ.199 చెల్లించాలి. జియో ట్రాన్స్ లేట్ అంటే బహుళ భాషా కమ్యూనికేషన్ యాప్, వాయిస్ కాల్, వాయిస్ మెసేజ్, టెక్ట్స్, ఇమేజ్ ట్రాన్స్ లేషన్ కోసం నెలకు రూ.99 చెల్లించాల్సి ఉంటుంది. కాగా.. ఈ ధరలు జూలై 3 నుండి అమల్లోకి రానున్నట్లు తెలిపింది. రిలయన్స్ జియో రీఛార్జ్ ధరలను భారీగా పెంచడంపై నెటిజన్లు మండిపడుతున్నారు. ‘కొడుకు పెళ్లి ఖర్చు మొత్తాన్ని దేశ ప్రజల నెత్తిన పడేస్తున్నావా అంబానీ మావా’ అంటూ ట్రోల్ చేస్తున్నారు. ‘ఎన్నికలు అయిపోయాయి కదా ఇక బాదుడే బాదుడు’ అని కామెంట్స్ చేస్తున్నారు.

Read Also : Online PAN Card Frauds: పాన్ కార్డ్ యూజర్స్ కి అలర్ట్.. జాగ్రత్తగా లేకపోతే భారీగా నష్టం?