Site icon HashtagU Telugu

Reliance Jio : కస్టమర్లకు షాక్ ఇచ్చిన JIO

Jio Plans

Jio Plans

ప్రముఖ టెలికాం సంస్థ రిలయన్స్ జియో.. (Reliance Jio).. కస్టమర్లకు భారీ షాక్ ఇచ్చింది. తమ మొబైల్ రీఛార్జ్ టారిఫ్ ప్లాన్లను (Jio Tarif Plans) భారీగా పెంచేసింది. 12.5 శాతం నుంచి.. మ్యాగ్జిమమ్ 25 శాతానికి రేట్లు పెంచేస్తూ.. కీలక ప్రకటన జారీ చేసింది. ఫ్రీ కాల్స్ తో కస్టమర్లను పెంచుకుంటూ వెళ్లిన జియో..ఆ తర్వాత బాదుడు మొదలుపెట్టింది. జియో నెట్ వర్క్ కు అలవాటైన వారు అందులో నుండి బయటకు రాలేక జియో నే వాడుతూ వస్తున్నారు. ఇదే సందర్బంగా నెట్ వర్క్ బాగుండడం..ఆఫర్లు కూడా అదే స్థాయిలో ఇస్తుండడంతో జియో వదులుకోలేకపోతున్నారు. ఇప్పటికే పలుమార్లు రీఛార్జ్ టారిఫ్ ప్లాన్లను పెంచిన సంస్థ..తాజాగా ఇప్పుడు మరోసారి పెంచేసింది.

We’re now on WhatsApp. Click to Join.

ప్రస్తుతం ఉన్న కనిష్ట నెలవారి ప్రీపెయిడ్ ప్లాన్ ను రూ.155 నుంచి రూ.189కి పెంచింది. ప్లాన్ ను బట్టి ఈ పెంపు కనిష్టంగా రూ. 34 నుంచి గరిష్టంగా రూ.600 వరకు పెంచింది. మరోవైపు 1 జీబీ డేటా యాడ్ ఆన్ ప్లాన్ రీఛార్జి ధరను రూ.15 నుంచి రూ.19కి పెంచింది. అలాగే.. జియో రూ. 209 ప్రీపెయిడ్ ప్లాన్ ధర ఇప్పుడు రూ. 249 అయింది. దాని వాలిడిటీ 28 రోజులు ఉంటుంది. రూ.239 ప్లాన్ ఇప్పుడు రూ.299గా మారింది. దీని వాలిడిటీ 28 రోజులు ఉంటుంది. జియో సేఫ్, జియో ట్రాన్స్ లేట్. క్వాంటం సెక్యూర్ కమ్యూనికేసన్ ఆప్ పర్ కాలింగ్, మెసేజింగ్, ఫైల్ ట్రాన్స్ ఫర్ తదితరాల కోసం రూ.199 చెల్లించాలి. జియో ట్రాన్స్ లేట్ అంటే బహుళ భాషా కమ్యూనికేషన్ యాప్, వాయిస్ కాల్, వాయిస్ మెసేజ్, టెక్ట్స్, ఇమేజ్ ట్రాన్స్ లేషన్ కోసం నెలకు రూ.99 చెల్లించాల్సి ఉంటుంది. కాగా.. ఈ ధరలు జూలై 3 నుండి అమల్లోకి రానున్నట్లు తెలిపింది.

Read Also : BRS: ఎమ్మెల్యేల కొనుగోళ్లను కాంగ్రెస్ పార్టీ వెంటనే నిలిపేయాలి: ఎంపీ రవిచంద్ర