Site icon HashtagU Telugu

Reliance AGM : ముకేశ్ అంబానీ వైపు 35 లక్షల మంది చూపు.. 29నే రిలయన్స్ ఏజీఎం

Bloomberg Billionaire List

Bloomberg Billionaire List

Reliance AGM : రిలయన్స్ ఇండస్ట్రీస్‌.. మనదేశంలోనే అతిపెద్ద కంపెనీ. స్టాక్ మార్కెట్‌లో అత్యధిక వ్యాల్యుయేషన్ కలిగిన కంపెనీ కూడా ఇదే. అందుకే అది ఏ ప్రకటన చేసినా దాని ప్రభావం స్టాక్ మార్కెట్‌పైనా పడుతుంటుంది. ఇప్పుడు అందరి కళ్లు ఆగస్టు 29వ తేదీపై ఉన్నాయి. ఎందుకంటే ఆ రోజున రిలయన్స్ ఇండస్ట్రీస్ 47వ వార్షిక సర్వసభ్య సమావేశం (ఏజీఎం) జరగబోతోంది. ఆ సమావేశం వేదికగా రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత, అపర కుబేరుడు ముకేశ్ అంబానీ చేయనున్న ప్రసంగంపై యావత్ స్టాక్ మార్కెట్ ఫోకస్ ఉంది.

We’re now on WhatsApp. Click to Join

గురువారం రోజు (ఆగస్టు 29న) మధ్యాహ్నం 2 గంటలకు రిలయన్స్ ఇండస్ట్రీస్ 47వ వార్షిక సర్వ సభ్య సమావేశం జరగబోతోంది. ఈ కార్యక్రమం వేదికగా దాదాపు 35 లక్షల మంది రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్ హోల్డర్లను ఉద్దేశించి ముకేశ్ అంబానీ ప్రసంగించనున్నారు. రిలయన్స్ జియో, రిలయన్స్ రిటైల్ వ్యాపారాలు ప్రస్తుతం జోరు మీద ఉన్నాయి. ఈనేపథ్యంలో వాటిని కూడా స్టాక్ మార్కెట్‌లో లిస్టింగ్ చేసే అవకాశం ఉంది. దానిపై ముకేశ్ అంబానీ ప్రకటన చేస్తారనే అంచనాలు వెలువడుతున్నాయి. చిన్న కుమారుడు అనంత్ అంబానీ పెళ్లి కూడా జరిగిపోయింది. ముకేశ్ అంబానీ పిల్లలందరి వివాహాలు పూర్తయ్యాయి. ఈనేపథ్యంలో ఆగస్టు 29న ఏజీఎంలో పూర్తి స్పష్టతతో కూడిన వారసత్వ ప్రణాళికను ఆయన అనౌన్స్‌మెంట్ చేసే సూచనలు ఉన్నాయని పరిశీలకులు చెబుతున్నారు. ఆయిల్ అండ్ కెమికల్, న్యూఎనర్జీ, జామ్ నగర్‌లోని మెగా గ్రీన్ ఎనర్జీ కాంప్లెక్స్‌తో ముడిపడిన అంశాలపై ముకేశ్ కీలక ప్రకటనలు చేస్తారని అంచనా వేస్తున్నారు.

Also Read :Rajasingh : గవర్నమెంట్ భూమిలోనే ఒవైసీ ఇల్లు.. కూల్చాల్సిందే : రాజాసింగ్

  • 2016 సంవత్సరంలో జరిగిన రిలయన్స్ ఏజీఎంలో(Reliance AGM) జియో సేవలను ముకేశ్ అంబానీ ప్రకటించారు.
  • 2017లో జరిగిన రిలయన్స్ ఏజీఎంలో రూ.1500కే జియో ఫోన్ తీసుకొస్తున్నట్లు తెలిపారు.
  • 2018లో జరిగిన రిలయన్స్ ఏజీఎం వేదికగా రూ.2999కే జియో ఫోన్ 2 తీసుకొచ్చారు.
  • 2019లో జరిగిన  రిలయన్స్ ఏజీఎంలో  కంపెనీలోకి సౌదీ ఆరామ్‌కో పెట్టుబడుల గురించి ప్రకటించారు. జియో ఫైబర్‌ లాంచ్ చేస్తున్నట్లు వెల్లడించారు.
  • 2021లో జరిగిన రిలయన్స్ ఏజీఎం తమ కంపెనీ  న్యూ ఎనర్జీ వ్యాపారంలోకి ప్రవేశిస్తున్న విషయాన్ని ప్రకటించారు.