RBIs New Rule: బ్యాంకు బిచాణా ఎత్తేస్తే.. ఖాతాదారులకు ఎంత ఇస్తారు.. కొత్త అప్‌డేట్

ఇకపై ఈ పరిమితిని రూ.10 లక్షల దాకా పెంచాలని ఆర్‌బీఐ(RBIs New Rule) యోచిస్తోందట.

Published By: HashtagU Telugu Desk
Rbis New Rule Bank Collapse Dicgc Insurance Cover Money Back

RBIs New Rule: ఏదైనా బ్యాంకు తన ఖాతాదారులకు డిపాజిట్లను తిరిగి చెల్లించడంలో ఫెయిల్ అయితే .. పరిస్థితేంటి ?  ఈవిషయంలో మనం ఎలాంటి గాబరా పడాల్సిన అవసరం లేదు.  ఎందుకంటే దేశంలోని బ్యాంకులన్నీ  రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) అనుబంధ సంస్థ డిపాజిట్‌ ఇన్సూరెన్స్‌ అండ్‌ క్రెడిట్‌ గ్యారంటీ కార్పొరేషన్‌ (డీఐసీజీసీ) పరిధిలోకి వస్తాయి. ఒకవేళ ఏదైనా బ్యాంకు ఖాతాదారులకు డిపాజిట్లను తిరిగి చెల్లించకుంటే.. ఆ మొత్తాన్ని స్వయంగా డీఐసీజీసీ చెల్లిస్తుంది. అయితే ప్రస్తుతానికి బ్యాంకులో ఉన్న డిపాజిట్ మొత్తం రూ.5 లక్షలకు మించితే కష్టమే. ఎందుకంటే ఇప్పుడు అమల్లో ఉన్న రూల్ ప్రకారం మోసపోయిన బ్యాంకు డిపాజిటర్లకు డీఐసీజీసీ కేవలం రూ.5 లక్షల వరకే తిరిగి చెల్లించగలదు. అంతకుముందు 2020 సంవత్సరం వరకైతే ఇది కేవలం రూ.1 లక్షగానే ఉండేది. ఇకపై ఈ పరిమితిని రూ.10 లక్షల దాకా పెంచాలని ఆర్‌బీఐ(RBIs New Rule) యోచిస్తోందట. అంటే ఏదైనా బ్యాంకు డిపాజిటర్లను చీట్ చేస్తే.. గరిష్ఠంగా రూ.10 లక్షల దాకా వెనక్కి పొందొచ్చు. తద్వారా భారీగా డిపాజిట్లు చేసే వ్యక్తులు/వ్యాపార సంస్థలకు ఊరట లభిస్తుంది. ఈమేరకు బ్యాంకుల నుంచి ప్రతి సంవత్సరం వసూలు చేసే బీమా ప్రీమియంలను డీఐసీజీసీ పెంచనుంది.

Also Read :Gyanesh Kumar : కేంద్ర ఎన్నికల సంఘం సారథిగా జ్ఞానేశ్‌ కుమార్‌.. నేపథ్యమిదీ

ఏ రకం బ్యాంకు అకౌంట్లు కవర్ అవుతాయి ?

డీఐసీజీసీ బీమా కవరేజీని పొందే బ్యాంకు ఖాతా రకాలివీ.. 

  • సేవింగ్స్ ఖాతాలు 
  • ఫిక్స్‌డ్ డిపాజిట్లు 
  • కరెంట్ ఖాతాలు 
  • రికరింగ్ డిపాజిట్లు 
  • ఇతరత్రా టైమ్ డిపాజిట్ ఖాతాలు 

Also Read :Aircraft Crashed : ల్యాండ్ కాగానే విమానం బోల్తా.. 18 మందికి గాయాలు

బ్యాంకు ఫెయిల్ కాగానే ఏమవుతుంది ?

  1. ఏదైనా బ్యాంకు తమ ఖాతాదారుల డిపాజిట్లను తిరిగి చెల్లించడంలో ఫెయిల్ అయితే వెంటనే ఆర్‌బీఐ రంగంలోకి దిగుతుంది.  ఆ బ్యాంకు దివాలా తీసిందనే ప్రకటన చేస్తుంది. ఖాతాదారులకు ఊరట కల్పించే ప్రక్రియను మొదలుపెడుతుంది.
  2. దివాలా తీసిన బ్యాంకును డీఐసీజీసీ (DICGC) స్వాధీనం చేసుకుంటుంది. ఖాతాదారుల క్లెయిమ్‌లను పరిశీలించడం మొదలుపెడుతుంది.
  3. దివాలా తీసిన బ్యాంకులో డిపాజిట్లు కలిగిన వారి ఖాతాలలోకి గరిష్ఠంగా రూ.5 లక్షల దాకా 90 రోజుల్లోగా జమ చేస్తారు.
  4. రూ.5 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్లు కలిగిన బ్యాంకు ఖాతాదారులు .. అదనంగా తమ డబ్బులు తిరిగి కావాలంటే ఎదురు చూడాలి.
  Last Updated: 18 Feb 2025, 09:39 AM IST