Gold Loan Renewal : మీరు లేదా మీకు తెలిసిన వాళ్లు గోల్డ్ లోన్ తీసుకున్నారా ? అయితే ఈ కొత్త అప్‌డేట్ తెలుసుకోండి. అలర్ట్ అయిపోండి. గోల్డ్ లోన్‌ను తిరిగి చెల్లించే విషయంలో కీలక మార్పు జరిగింది. గతంలో గోల్డ్ లోన్‌ను రెన్యూవల్ చేసే సమయంలో, అదే బంగారంపై మరో లోన్‌ను జనరేట్ చేసేవారు. పాత లోన్ అమౌంటును అసలులో జమ చేసుకుని, లోన్ తీసుకున్న వ్యక్తి నుంచి వడ్డీని వసూలు చేసేవారు. ఇలా చేయడం వల్ల బ్యాంకులకు గోల్డ్ లోన్స్ వసూలు అనేది కష్టతరంగా మారేది. ఈవిషయాన్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) గుర్తించింది. ముఖ్యమైన మార్పులు చేసింది.
Also Read :Grok Vs Telugu Words : ‘గ్రోక్’తో గోక్కుంటున్న తెలుగు నెటిజన్లు
ఈ కారణాల వల్లే..
కొత్త అప్‌డేట్ ఏమిటంటే.. ఆర్‌బీఐ ఆదేశాల మేరకు గోల్డ్ లోన్స్ చెల్లింపు వ్యవధిని బ్యాంకులు ఏడాది కాలానికి పరిమితం చేశాయి. అంటే ఆలోగా గోల్డ్ లోన్‌ను తిరిగి చెల్లించాల్సిందే. ఆర్‌బీఐ ఈమేరకు మార్పును చేయడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. ప్రస్తుతం మన దేశంలోని బ్యాంకుల లాకర్లలో బంగారం నిల్వలు పెరిగిపోయాయి. అందుకే బంగారు రుణాలను ఏడాదికి మించి రెన్యూవల్ చేయకూడదని ఆర్బీఐ చాలా ఏళ్ల క్రితమే ఆదేశించింది. అయినా పలు బ్యాంకులు ఈ ఆదేశాలను పెద్దగా పట్టించుకోలేదు. దీన్ని సీరియస్‌గా తీసుకున్న ఆర్‌బీఐ.. అన్ని బ్యాంకులకు జరిమానా విధించింది. తాము గతంలో జారీ చేసిన నిబంధనల్ని పక్కాగా అమలు చేయాలని 2024 డిసెంబరులో అల్టిమేటం ఇచ్చింది. ఈనేపథ్యంలో బ్యాంకులన్నీ బంగారు రుణాలపై ఆంక్షలను అమలు చేయడం మొదలుపెట్టాయి. ఈ ఏడాది జనవరి నుంచి వీటి అమలు కఠినతరమైంది.
Also Read :CM Revanth : బీజేపీ ఎంపీ అరుణకు సీఎం రేవంత్ ఫోన్.. వివరాలివీ
ముఖ్య రూల్స్..
తాకట్టులో ఉన్న బంగారంపై(Gold Loan Renewal) ఉన్న పాతరుణాన్ని తీర్చడానికి.. దానిపైనే కొత్త రుణాలను మంజూరు చేయడాన్ని ఆర్బీఐ బ్యాన్ చేసింది. అంతేకాదు.. ఇక నుంచి బంగారు రుణాలను ఎందుకు తీసుకుంటున్నారో బ్యాంకులకు రుణగ్రహీతలు చెప్పాలి. వ్యవసాయం కోసం రూ.1 లక్షకు మించి గోల్డ్ లోన్ తీసుకునే వారు తప్పకుండా భూమి పత్రాలను సమర్పించాలి. ఈ రూల్స్‌ను పాటించని బ్యాంకులపై జరిమానాలు విధిస్తారు.