Bank Loans Easy : బ్యాంక్ లోన్ తీసుకోవాలని భావిస్తున్నారా ? అయితే మీకు అనుకూలంగా ఉండే ఓ కీలక నిర్ణయాన్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తాజాగా తీసుకుంది. అదేమిటో తెలుసుకోవాలంటే ఈ కథనం చదవాల్సిందే.
We’re now on WhatsApp. Click to Join
క్రెడిట్ స్కోరు అనేది మన ఆర్థిక క్రమశిక్షణకు ప్రతిబింబం. దాన్ని మనం కనీసం ఏడాదికోసారి లేదంటే రెండుసార్లు చెక్ చేసుకోవాలి. క్రెడిట్ స్కోర్, సిబిల్ వంటి సంస్థలు ఇచ్చే క్రెడిట్ రిపోర్టుల ఆధారంగా మన ఆర్థిక క్రమశిక్షణను గాడిలో పెట్టుకోవాలి. తీసుకున్న అప్పులను తీర్చే విషయంలో, క్రెడిట్ కార్డులను వినియోగించే విషయంలో తెలివిగా, పొదుపుగా వ్యవహరించాలి. అప్పుడే మన క్రెడిట్ స్కోరు పెరుగుతుంది. ఇక ఆర్‌బీఐ(Bank Loans Easy) నుంచి వచ్చిన కొత్త అప్ డేట్ విషయానికొస్తే.. బ్యాంకులు, క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీలు ప్రతి 15 రోజులకు ఒకసారి తమ కస్టమర్ల క్రెడిట్ రిపోర్టులను కచ్చితంగా అప్ డేట్ చేయాలని ఇటీవల ఆర్‌బీఐ ఆదేశించింది. ఈ రూల్ వల్ల అర్జెంటుగా బ్యాంకు లోన్ తీసుకోవాలని భావించే వారికి మేలు జరగనుంది.
Also Read :Bangladesh : భారత్ ఎదుట పాక్ ఆర్మీ సరెండర్.. శిల్పాలు ధ్వంసం చేసిన అల్లరిమూకలు
ఇంతకుముందు వరకు బ్యాంకులు, క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీలు నెలకోసారి క్రెడిట్ నివేదికను అప్‌డేట్ చేస్తుండేవి. 15 రోజులకు ఒకసారి క్రెడిట్ రిపోర్టును అప్‌డేట్ చేయడం అనేది బ్యాంకు అకౌంట్లు కలిగినవారికి, క్రెడిట్ కార్డులు కలిగిన వారికి ప్లస్ పాయింట్ అవుతుంది. ఉదాహరణకు ఒక వ్యక్తి తన అప్పును తిరిగి చెల్లించినా అతడి క్రెడిట్ స్కోరు పెరగడానికి ఇప్పటివరకు దాదాపు నెలరోజుల టైం పడుతోంది. ఇకపై 15 రోజుల్లో ఆ సమాచారాన్ని బ్యాంకులు, క్రెడిట్ ఇన్ఫర్మేషన్ బ్యూరోలు అప్‌డేట్ చేసేస్తాయి. దీనివల్ల నిజాయితీ కలిగిన కస్టమర్లకు ప్రయోజనం చేకూరుతుంది. అదే సమయంలో ఆర్థిక క్రమశిక్షణ లేని వారి అసలు ముఖాలు కూడా బయటపడతాయి.
Also Read :Bajaj Freedom CNG : బజాజ్ ఫ్రీడమ్ 125 కంటే తక్కువ ధరలో సీఎన్‌జీ బైక్..!
ప్రస్తుతం 750 కంటే ఎక్కువ సిబిల్ స్కోర్ ఉన్నవారికి బ్యాంకులు ఈజీగా లోన్లు ఇస్తున్నాయి. ఇలాంటి వాళ్లకు ఇచ్చే లోన్లపై వడ్డీరేటు కూడా చాలా తక్కువగా ఉంటుంది. కొంతమందికి 600 కంటే తక్కువ సిబిల్ స్కోరు ఉంటుంది. అలాంటి వారికి లోన్లు ఇచ్చేముందుకు బ్యాంకులు ముందుకు రావు. ఒకవేళ వారికి రుణాలు మంజూరు చేసినా ఎక్కువ వడ్డీని వసూలు చేస్తాయి.