Site icon HashtagU Telugu

RBI : మరోసారి వడ్డీ రేట్లు తగ్గించిన ఆర్బీఐ..ఈసారి ఎంతంటే !

RBI

RBI

భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) మరోసారి వడ్డీ రేట్లను తగ్గిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో 25 బేసిస్ పాయింట్లు (RBI MPC cuts repo rate) తగ్గించిన తర్వాత, తాజాగా మళ్లీ అదే స్థాయిలో తగ్గిస్తూ గవర్నర్ సంజయ్ మల్హోత్రా ప్రకటించారు. దీంతో రెపో రేటు 6.25 శాతం నుంచి 6 శాతానికి చేరింది. సోమవారం నుంచి ప్రారంభమైన మానిటరీ పాలసీ కమిటీ సమావేశంలో తీసుకున్న ఈ నిర్ణయాన్ని ఈ రోజు అధికారికంగా ప్రకటించారు. ఆర్బీఐ ఈ చర్య ద్వారా ఆర్థిక వ్యవస్థను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో వడ్డీ రేట్లను తగ్గించినట్లు తెలియజేసింది.

Manchu manoj : మరోసారి వీధికెక్కిన మోహన్ బాబు కుటుంబ విభేదాలు

వడ్డీ రేటు తగ్గింపు దృష్ట్యా గృహ, వాహన, వ్యక్తిగత రుణాలపై వడ్డీ శాతం తగ్గే అవకాశం ఉంది. దీంతో రుణాలపై ఈఎంఐలు తగ్గిపోయి, రుణగ్రహీతలకు ఆర్థిక భారం కొంత మేర తగ్గుతుంది. ఇది మధ్య తరగతి కుటుంబాలకు ఊరటనిచ్చే అంశం. అయితే మరోవైపు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు తగ్గే అవకాశముండటంతో డిపాజిటర్లకు ఇది నష్టం కలిగించవచ్చు. దీనిపై నిపుణులు అప్రమత్తం చేస్తున్నారు. ఆర్బీఐ స్థిర విధానం నుంచి సర్దుబాటు వైఖరికి మారాలని నిర్ణయం తీసుకోవడం, ప్రస్తుతం నెలకొన్న ఆర్థిక అనిశ్చితులను దృష్టిలో ఉంచుకుని తీసుకున్న మేలు నిర్ణయంగా భావిస్తున్నారు.

Raw Coconut: ఏంటి నిజమా.. కొబ్బరి ప్రతీ రోజు తింటే షుగర్ వ్యాధి దూరం అవుంతుందా?

ఆర్బీఐ గవర్నర్ మల్హోత్రా ప్రకారం.. 2025-26 ఆర్థిక సంవత్సరంలో జీడీపీ వృద్ధిరేటు 6.5 శాతంగా ఉండవచ్చని అంచనా వేయబడింది. త్రైమాసికాల వారీగా 6.5%, 6.7%, 6.6%, 6.3% వృద్ధిరేటులు నమోదవుతాయని చెప్పారు. ఆహార ధరల తగ్గుదలతో ద్రవ్యోల్బణం 4 శాతానికి చేరుకుంటుందని, ఇది ఆర్బీఐ లక్ష్యంలోనే ఉందని తెలిపారు. పారిశ్రామిక రంగం, సేవల ఎగుమతులు, రబీ పంట ఉత్పత్తులు వృద్ధికి దోహదపడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. భారత్‌లో విదేశీ మారక నిల్వలు కూడా 676 బిలియన్ డాలర్లకు చేరినట్లు వెల్లడిస్తూ, దేశ ఆర్థిక వ్యవస్థ స్థిరంగా ఉందని చెప్పారు.