దేశ ఆర్థిక వ్యవస్థపై ఆర్‌బీఐ చెప్పిన కీల‌క అంశాలీవే!

పట్టణ ప్రాంతాల్లో డిమాండ్ బలంగా ఉండటం వల్ల మొత్తం ఆర్థిక కార్యకలాపాలు పుంజుకున్నాయి. అయితే, మాన్యుఫ్యాక్చరింగ్ (తయారీ రంగం), గ్రామీణ డిమాండ్‌లో కొంత మందగమనం కనిపించింది.

Published By: HashtagU Telugu Desk
RBI

RBI

RBI: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) తన డిసెంబర్ నెలకు సంబంధించిన బులెటిన్‌ను విడుదల చేసింది. ఇందులో భాగంగా ‘స్టేట్ ఆఫ్ ది ఎకానమీ’ (ఆర్థిక వ్యవస్థ స్థితిగతులు) పై ఒక వ్యాసాన్ని ప్రచురించింది. నవంబర్ నెలలో దేశవ్యాప్తంగా ఆర్థిక కార్యకలాపాలు పటిష్టంగా ఉన్నాయని సెంట్రల్ బ్యాంక్ ఈ నివేదికలో పేర్కొంది.

పట్టణ ప్రాంతాల్లో డిమాండ్ బలంగా ఉండటం వల్ల మొత్తం ఆర్థిక కార్యకలాపాలు పుంజుకున్నాయి. అయితే, మాన్యుఫ్యాక్చరింగ్ (తయారీ రంగం), గ్రామీణ డిమాండ్‌లో కొంత మందగమనం కనిపించింది. సేవా రంగం తన పటిష్టతను చాటుకుంది. పండుగ సీజన్ ముగిసిన తర్వాత కూడా నవంబర్ నెలలో ఆర్థిక కార్యకలాపాలు బలంగా కొనసాగుతున్నాయని ‘హై-ఫ్రీక్వెన్సీ ఇండికేటర్స్’ సూచిస్తున్నాయి. ఈ-వే బిల్లులు, పెట్రోలియం వినియోగం, డిజిటల్ చెల్లింపులలో వృద్ధి నమోదైంది. మరోవైపు, జీఎస్టీ (GST) రేట్ల హేతుబద్ధీకరణ ప్రభావం వల్ల జీఎస్టీ రెవెన్యూ వసూళ్లు కొంత తగ్గాయి.

Also Read: ప్రియుడి మోజులో కట్టుకున్న భర్తను ముక్కలుగా నరికి చంపిన భార్య

రూపాయి విలువపై ఆర్‌బీఐ వివరణ

భారత రూపాయి (INR) కదలికల గురించి ఆర్‌బీఐ తన వ్యాసంలో ప్రస్తావించింది. నవంబర్ నెలలో అమెరికన్ డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ బలహీనపడింది. దీనికి ప్రధాన కారణాలు కూడా పేర్కొంది.

  • అంతర్జాతీయ మార్కెట్లో అమెరికన్ డాలర్ బలపడటం.
  • విదేశీ పోర్ట్‌ఫోలియో పెట్టుబడులు (FPI) తగ్గడం.
  • భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందాలపై నెలకొన్న అనిశ్చితి.

అయినప్పటికీ ఇతర ప్రధాన కరెన్సీలతో పోలిస్తే రూపాయి విలువలో హెచ్చుతగ్గులు తక్కువగానే ఉన్నాయని ఆర్‌బీఐ తెలిపింది. డిసెంబర్ 19 నాటికి నవంబర్ చివరి నాటి స్థాయితో పోలిస్తే రూపాయి 0.8 శాతం బలహీనపడింది. ‘రియల్ ఎఫెక్టివ్ టర్మ్స్’లో చూస్తే నవంబర్‌లో రూపాయి స్థిరంగా ఉందని నివేదిక పేర్కొంది.

ఆర్థిక వృద్ధిపై ఆర్‌బీఐ గవర్నర్ విశ్లేషణ

ఈ నెల ప్రారంభంలో జరిగిన ద్రవ్య పరపతి విధాన సమీక్ష సందర్భంగా ఆర్‌బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా వివ‌రాల ప్ర‌కారం.. 2025-26 ఆర్థిక సంవత్సరం (FY26) మూడవ త్రైమాసికంలో దేశీయ ఆర్థిక కార్యకలాపాలు బలంగానే ఉన్నాయని తెలిపారు. అయితే కొన్ని కీలక సూచికలలో కనిపిస్తున్న బలహీనతను బట్టి చూస్తే, మొదటి అర్ధభాగంతో (H1) పోలిస్తే రెండవ అర్ధభాగంలో (H2) వృద్ధి వేగం కొంత నెమ్మదించిందని ఆయన అభిప్రాయపడ్డారు.

  Last Updated: 23 Dec 2025, 04:38 PM IST