Zero Balance Accounts: సామాన్య వినియోగదారులకు ఉపశమనం కల్పిస్తూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ ఖాతా నిబంధనల్లో (Zero Balance Accounts) పెద్ద మార్పులు చేసింది. ఈ మార్పులలో ఇకపై ప్రతి నెలా పరిమితి లేని డిపాజిట్లు, ఎటువంటి రెన్యూవల్ ఫీజు లేకుండా ఉచిత ఏటీఎం లేదా డెబిట్ కార్డు వినియోగం, ప్రతి సంవత్సరం కనీసం 25 పేజీల ఉచిత చెక్‌బుక్, ఇంటర్నెట్, మొబైల్ బ్యాంకింగ్, పాస్‌బుక్ లేదా నెలవారీ స్టేట్‌మెంట్ ఉచితంగా ఇవ్వడం వంటివి ఉన్నాయి. ఈ మార్పులను అమలు చేయడానికి ఆర్‌బీఐ బ్యాంకులకు 7 రోజుల సమయం ఇచ్చింది.
ఉచిత విత్‌డ్రాల పరిమితి ఎంత?
బ్యాంకులు ప్రతి నెలా కనీసం నాలుగు ఉచిత విత్‌డ్రాలను అనుమతించాలి. ఇందులో వారి సొంత ఏటీఎంలు, ఇతర బ్యాంకుల ఏటీఎంల నుండి చేసే లావాదేవీలు కూడా ఉంటాయి. ఈ కొత్త నిబంధన ప్రకారం.. UPI, IMPS, NEFT, RTGS వంటి డిజిటల్ చెల్లింపుల లావాదేవీలను విత్‌డ్రాల్‌గా పరిగణించబడవు. అంటే ఈ డిజిటల్ లావాదేవీల కోసం వినియోగదారుల నుండి అదనంగా ఛార్జీ వసూలు చేయబడదు.
ప్రస్తుత BSBD ఖాతాదారులు కొత్తగా ప్రారంభించిన సదుపాయాల కోసం అభ్యర్థించవచ్చు. అదే సమయంలో సాధారణ పొదుపు ఖాతాదారులు తమ ఖాతాలను BSBD ఖాతాలోకి మార్చుకోవచ్చు. అయితే వారికి ఇదివరకే మరే ఇతర బ్యాంకులోనూ ఖాతా ఉండకూడదు.
ఈ కొత్త మార్పులు ఏప్రిల్ 1, 2026 నుండి అమల్లోకి వస్తాయి. అయినప్పటికీ బ్యాంకులు వాటి అభీష్టం మేరకు ముందుగానే వీటిని స్వీకరించవచ్చు. బ్యాంకులచే అందించబడే బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ ఖాతాల ఫ్రేమ్‌వర్క్‌ను అధికారికంగా మార్చడానికి RBI తన ‘రిస్పాన్సిబుల్ బిజినెస్ కండక్ట్ డైరెక్షన్స్, 2025’ను అప్‌డేట్ చేయడానికి ఈ కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది.
Also Read: Airlines Ticket Prices: ఇండిగో సంక్షోభం.. విమాన టికెట్ల ధరలపై కేంద్రం కీలక నిర్ణయం!
మార్పులు
నెలవారీ విత్‌డ్రాలు: నెలలో కనీసం నాలుగు సార్లు డబ్బు తీయడానికి ఎటువంటి ఛార్జీ ఉండదు.
డిజిటల్ చెల్లింపులు: కార్డ్ స్వైప్ (PoS), NEFT, RTGS, UPI, IMPS వంటి డిజిటల్ చెల్లింపులు నాలుగు సార్ల పరిమితి కింద లెక్కించబడవు.
ఉచిత సదుపాయాలు: సంవత్సరానికి కనీసం 25 పేజీల చెక్‌బుక్, ఉచిత ఇంటర్నెట్, మొబైల్ బ్యాంకింగ్, ఉచిత పాస్‌బుక్ లేదా నెలవారీ స్టేట్‌మెంట్ సౌకర్యం లభిస్తుంది.
ఏటీఎం/డెబిట్ కార్డు: ఎటువంటి వార్షిక రుసుము లేకుండా ఏటీఎం, డెబిట్ కార్డు ఇవ్వబడుతుంది.
మార్పుల ఉద్దేశ్యం ఏమిటి?
ఈ మార్పులను అమలు చేయడంలో ఉద్దేశ్యం BSBD ఖాతాలకు ప్రజల సంఖ్యను పెంచడం, తద్వారా వారు దాని ఉపయోగాలు అర్థం చేసుకోవడం. ఈ కొత్త నిబంధనలు లోకల్ ఏరియా బ్యాంక్, రూరల్ కోఆపరేటివ్ బ్యాంక్, అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్, స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, పేమెంట్ బ్యాంక్, కమర్షియల్ బ్యాంక్… అన్ని బ్యాంకులకూ వర్తిస్తాయి.
