Bank Holiday: ప్రతి నెల ప్రారంభంతో బ్యాంకుల సెలవు జాబితా విడుదల అవుతుంది. భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) సంవత్సరం ప్రారంభానికి ముందే బ్యాంకుల సెలవు జాబితాను (Bank Holiday) విడుదల చేస్తుంది. అయితే ఏదైనా నెలలో ప్రత్యేక సందర్భం లేదా ఇతర పనులు ఉంటే బ్యాంకుల సెలవు జాబితాలో మార్పులు జరగవచ్చు. కొన్నిసార్లు ప్రత్యేక రోజు లేకపోయినా బ్యాంకులు మూతపడతాయని తెలిసిందే. మార్చి 31న ఈద్ ఉన్నప్పటికీ బ్యాంకులకు సెలవు లేదు. ఎందుకంటే ఈరోజు ఆర్థిక సంవత్సరం 2024-25 క్లోజింగ్ డే కావడంతో సెలవు లేదు. అయితే ఏప్రిల్ 1న బ్యాంకులు మూతపడతాయో? లేదో తెలుసుకుందాం.
ఏప్రిల్ 1న బ్యాంకులు మూతపడతాయా లేదా?
భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) సూచనల ప్రకారం.. ఆర్థిక సంవత్సరం 2024-25 అన్ని లావాదేవీల అకౌంటింగ్ పనులు పూర్తి చేశారు. ఈ కారణంగా RBI ఏప్రిల్ 1, 2025న బ్యాంకులకు సెలవు ఆదేశాలు జారీ చేసింది. కొన్ని ప్రాంతాల్లో ఏప్రిల్ 1న బ్యాంకులు తెరిచి ఉంటాయి. కానీ భారతదేశంలోని చాలా రాష్ట్రాల్లో బ్యాంకులకు సెలవు ఉంటుంది.
Also Read: Rohit Sharma: చరిత్ర సృష్టించేందుకు సిద్ధమైన రోహిత్ శర్మ.. కేకేఆర్‌పై రికార్డు సాధిస్తాడా?
ఏప్రిల్ 1న బ్యాంకులు ఎక్కడ తెరిచి ఉంటాయి?
RBI ప్రకారం.. ఏప్రిల్ 1, మంగళవారం నాడు భారతదేశంలో కొన్ని ప్రాంతాల్లో బ్యాంకులకు సెలవు ఉండదు. మిజోరం, ఛత్తీస్‌గఢ్, మేఘాలయ, పశ్చిమ బెంగాల్, హిమాచల్ ప్రదేశ్‌లలో బ్యాంకులు తెరిచి ఉంటాయి. ఇక్కడి ప్రజలు ఏప్రిల్ 1న బ్యాంకింగ్ సౌకర్యాలను ఉపయోగించుకోవచ్చు.
బ్యాంకులు మూతపడినప్పుడు డబ్బు తీసుకోవచ్చా?
ఏప్రిల్ 1న బ్యాంకులు మూతపడితే డబ్బు తీసుకోవాల్సి వస్తే మీరు ATM కార్డ్ సహాయంతో నగదు తీసుకోవచ్చు. అంతేకాకుండా ఆన్‌లైన్ బ్యాంకింగ్ సౌకర్యం లేదా UPI పేమెంట్ ద్వారా కూడా ఆన్‌లైన్ లావాదేవీలు చేయవచ్చు. అయితే బ్యాంకులో చెక్ లేదా డ్రాఫ్ట్ జమ చేయించే పని కోసం బ్యాంక్ బ్రాంచ్ తెరిచే వరకు వేచి ఉండాలి.