Site icon HashtagU Telugu

Loan Foreclosure Charges: బ్యాంకుల నుండి రుణాలు తీసుకునే వారికి గుడ్ న్యూస్..!

Loan Foreclosure Charges

Loan Foreclosure Charges

Loan Foreclosure Charges: బ్యాంక్‌లు రుణాల ముందస్తు చెల్లింపులపై రుణగ్రహీతల నుంచి ప్రీ పేమెంట్‌ పెనాల్టీ/ ఫోర్‌క్లోజర్‌ పేరుతో వసూలు చేసే ఛార్జీల విధానాన్ని తొలగించే దిశగా ఆర్‌బీఐ ( Loan Foreclosure Charges) చ‌ర్య‌లు తీసుకుంది. రుణగ్రహీతల సమస్యను దృష్టిలో ఉంచుకుని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఒక ప్రతిపాదన చేసింది. సూక్ష్మ, చిన్న సంస్థలు (MSEలు), ప‌ర్స‌న‌ల్ లోన్‌ తీసుకునే ఫ్లోటింగ్ రేటు రుణాలపై ముందస్తు చెల్లింపు ఛార్జీలు లేదా ముందస్తు చెల్లింపు జరిమానాలను తొలగించాలని ఈ ప్రతిపాదన తీసుకువచ్చింది.

ఈ ప్రతిపాదన వల్ల లబ్ది పొందేది వీరే

ఈ విషయంలో RBI ముసాయిదా మార్గదర్శకాలను జారీ చేసింది. మార్చి 21, 2025 నాటికి సంబంధిత పార్టీల నుండి అభిప్రాయాన్ని కోరింది. దీని తర్వాతే తుది నిర్ణయం తీసుకోనుంది. మార్గదర్శకాల ప్రకారం.. ఒక వ్యక్తి ఫ్లోటింగ్ రేటు రుణం తీసుకొని గడువుకు ముందే తిరిగి చెల్లిస్తే అప్పుడు ఎటువంటి ఫోర్‌క్లోజర్ ఛార్జీ లేదా ముందస్తు చెల్లింపు జరిమానా విధించకూడదు. అయితే, వ్యాపార రుణాల విషయంలో ఈ మినహాయింపు వర్తించదు. అదేవిధంగా టైర్ 1, టైర్ 2 అర్బన్ కోఆపరేటివ్ బ్యాంకులు (UCBలు) బేస్ లేయర్ NBFCలు మినహా అన్ని ఆర్థిక సంస్థలు సూక్ష్మ, చిన్న సంస్థలకు (MSEలు) విస్తరించిన ఫ్లోటింగ్ రేట్ వ్యాపార రుణాలపై ఎటువంటి ఛార్జీలు విధించడానికి అవ‌కాశం ఉండ‌క‌పోవ‌చ్చు.

Also Read: Tesla In Andhra Pradesh: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు మ‌రో భారీ శుభ‌వార్త‌.. రాయ‌ల‌సీమ‌కు టెస్లా కంపెనీ!

ఈ నియమాలు అన్ని రకాల ఫ్లోటింగ్ రేటు రుణాలకు వర్తిస్తాయని రిజర్వ్ బ్యాంక్ తెలిపింది. రుణం ఎక్కడి నుండి తీసుకోబడింది. అది పూర్తిగా లేదా పాక్షికంగా తిరిగి చెల్లించబడిందా అనే దానితో సంబంధం లేకుండా ఈ నియమాలు వర్తిస్తాయని RBI తెలిపింది. అయితే, MSE విషయంలో ఈ మినహాయింపు నిర్దేశించిన రుణ పరిమితిపై మాత్రమే అందుబాటులో ఉంటుంది. MSE మొత్తం రుణ మొత్తం రూ. 7.50 కోట్ల కంటే ఎక్కువగా ఉంటే ఆ అదనపు మొత్తంపై ఈ నియమం వర్తించదు. ఆర్‌బిఐ ముసాయిదా మార్గదర్శకాలు కూడా బ్యాంకులు ఏ రుణానికి కనీస లాక్-ఇన్ వ్యవధిని విధించలేవని పేర్కొన్నాయి. దీని అర్థం కస్టమర్ తాను కోరుకున్న వెంటనే రుణాన్ని తిరిగి చెల్లించడానికి వెసులుబాటు క‌ల్పించిన‌ట్లే అని స‌మాచారం. బ్యాంకు ఎలాంటి ఛార్జీని వసూలు చేయదు.

ఫ్లోటింగ్ రేట్ రుణాలు అంటే ఏమిటి?

ఫ్లోటింగ్ రేట్ రుణాలు అంటే వడ్డీ రేట్లు మారుతూ ఉండే రుణాలు. ఈ వడ్డీ రేట్లు RBI రెపో రేటు లేదా MCLR (మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్-బేస్డ్ లెండింగ్ రేట్) ఆధారంగా మారుతాయి. స్థిర రేటు రుణాలలో వడ్డీ రేటు రుణ కాలవ్యవధి అంతటా ఒకే విధంగా ఉంటుంది. కానీ ఫ్లోటింగ్ రేటు రుణాలలో ఇది RBI పాలసీ వడ్డీ రేట్లపై తీసుకున్న నిర్ణయాల ప్రకారం మారుతుం

Exit mobile version