Ratan Tatas Friend : రతన్ టాటా.. భారతదేశ పారిశ్రామిక రంగంపై చెరగని ముద్రవేసిన ఘనుడు. ఆయనకు పర్సనల్ అసిస్టెంట్(పీఏ)గా సేవలు అందించిన యువతేజం శంతను నాయుడు. మహారాష్ట్రలోని పూణేకు చెందిన ఈ కుర్రాడు.. రతన్ టాటాకు క్లోజ్ ఫ్రెండ్ కూడా. రతన్ టాటా బతికి ఉన్నన్ని నాళ్లు.. ఆయన వెంటనే శంతను ఉండేవాడు. ఇప్పుడు శంతనుకు కొత్త బాధ్యతలను టాటా గ్రూప్ అప్పగించింది. ఆ వివరాలేంటో చూద్దాం..
Also Read :Anasuya Bharadwaj : స్టార్ హీరో, మెగా డైరెక్టర్.. అలా అడిగితే నో చెప్పాను : అనసూయ
తండ్రిని గుర్తు చేసుకున్న శంతను..
శంతను నాయుడుకు టాటా మోటార్స్‌లో స్ట్రాటజిస్ట్ ఇనీషియేటివ్స్ విభాగానికి హెడ్, జనరల్ మేనేజర్‌గా నియమించారు. ఈవిషయాన్ని స్వయంగా శంతను(Ratan Tatas Friend) లింక్డిన్ వేదికగా వెల్లడించారు. ‘‘టాటా మోటార్స్‌లో జనరల్ మేనేజర్, హెడ్ – స్ట్రాటజిక్ ఇనీషియేటివ్‌గా నేను కొత్త జర్నీని ప్రారంభిస్తున్నాను. ఇందుకు సంతోషంగా ఉంది. మా నాన్న టాటా మోటార్స్ కార్ల తయారీ ప్లాంట్ నుంచి తెల్లటి చొక్కా, నేవీ ప్యాంటు వేసుకొని ఇంటికి నడిచి వచ్చేవారు. ఆయన కోసం కిటికీ దగ్గర నిలబడి నేను ఎదురు చూసేవాడిని. అదంతా నాకు బాగా గుర్తుంది. ఇప్పుడు లైఫ్ ఫుల్ సర్కిల్‌లోకి వచ్చింది’’ అని లింక్డ్ఇన్లో శంతను రాసుకొచ్చారు.
Also Read :Zomato : జొమాటో కొత్త యాప్ లాంచ్..ఇక అన్ని ఇక్కడే ..!!
ఎవరీ శంతను ?
- శంతను నాయుడు మహారాష్ట్రలోని పూణే వాస్తవ్యుడు.
- ఆయన 2014 సంవత్సరంలో పూణేలో ఉన్న సావిత్రీ బాయి ఫూలే విశ్వవిద్యాలయంలో ఇంజనీరింగ్ డిగ్రీ చేశారు.
- 2016 లో కార్నెల్ విశ్వవిద్యాలయంలో ఎంబీఏ చేశారు.
- శంతును ఆటోమొబైల్ డిజైన్ ఇంజనీర్‌గా తొలుత రాణించారు. రోడ్డు మీద వేగంగా వెళ్లే వాహనాల వల్ల కుక్కలకు ప్రమాదం జరగకుండా ఒక ఆవిష్కరణ చేేశారు. కుక్కల కోసం రేడియం కాలర్స్‌ను తయారు చేశారు.
- కుక్కల కోసం రేడియం కాలర్స్‌ను తయారు చేసిన విషయం తెలిసి రతన్ టాటా చాలా సంతోషించారు. ఎందుకంటే ఆయనకు కుక్కలంటే చాలా ఇష్టం.
- రేడియం కాలర్స్‌ను తయారు చేసిన శంతను నాయుడిని రతన్ టాటా అప్పట్లో పిలిపించి మాట్లాడారు.
- శంతను నాయుడు ప్రాజెక్టులో పెట్టుబడి పెడతానని ఆసందర్భంగా రతన్ టాటా ప్రకటించారు.
- అప్పటి నుంచే శంతను, రతన్ టాటా మధ్య స్నేహం మొదలైంది.
- 2018 సంవత్సరం నుంచి రతన్ టాటా సహాయకుడిగా శంతను నాయుడు పనిచేయడం ప్రారంభించారు.
- 2024 అక్టోబర్‌లో రతన్ టాటా తుదిశ్వాస విడిచారు. అప్పటివరకు రతన్ టాటా వద్దే పీఏగా శంతను సేవలు అందించారు.
- రతన్ టాటా తన వీలునామాలో శంతను నాయుడు విద్య కోసం ఇచ్చిన అప్పును మాఫీ చేస్తున్నట్లు ప్రకటించారు.
- 2021లో శంతను నాయుడు ప్రారంభించిన గుడ్‌ఫెలోస్ సంస్థలో యాజమాన్యాన్ని రతన్ టాటా వదులుకున్నట్లు తెలుస్తోంది. ఈ సంస్థ భారతదేశంలో ఒంటరిగా నివసిస్తున్న వృద్ధులకు సహాయం చేస్తుంది.