CEO of Wedding : రాధికా మర్చంట్ ఇంటర్వ్యూ.. నీతా అంబానీ గురించి ఏమన్నారంటే..

CEO of Wedding : ముకేశ్ అంబానీ చిన్న కోడలు రాధికా మర్చంట్ ప్రముఖ ఫ్యాషన్ మ్యాగజైన్‌ ‘వోగ్‌’‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పెళ్లికి సంబంధించిన ఆసక్తికర విశేషాలను వివరించారు.

Published By: HashtagU Telugu Desk
Ceo Of Wedding Nita Ambani

CEO of Wedding : ముకేశ్ అంబానీ చిన్న కోడలు రాధికా మర్చంట్ ప్రముఖ ఫ్యాషన్ మ్యాగజైన్‌ ‘వోగ్‌’‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పెళ్లికి సంబంధించిన ఆసక్తికర విశేషాలను వివరించారు. తమ పెళ్లి ఇంత గ్రాండ్‌గా జరగడానికి కారణం అత్తయ్య నీతా అంబానీయే అని ఆమె చెప్పారు. నీతా అంబానీ ఒక సీఈవోలా(CEO of Wedding) వ్యవహరించి.. మొత్తం పెళ్లి గ్రాండ్‌గా జరిగేలా చూశారన్నారు.  తమ పెళ్లి ఏర్పాట్ల విషయంలో అత్తయ్య నీతా అంబానీ(Nita Ambani) దార్శనికత, నిబద్ధతతో వ్యవహరించారని రాధిక చెప్పారు.

We’re now on WhatsApp. Click to Join

పెళ్లి పనుల్లో అత్తయ్యకు వదిన ఈశా అంబానీ, తోటికోడలు శ్లోకా మెహతా సహకరించారని రాధిక పేర్కొన్నారు. వెడ్డింగ్ ప్లానర్స్‌, మరికొంతమంది సిబ్బంది సహకారంతో వివాహ నిర్వహణ ఏర్పాట్లు జరిగాయన్నారు. వారంతా కలిసి నిర్విరామంగా పనిచేయబట్టే తమ పెళ్లి అంగరంగ వైభవంగా జరిగిందని రాధిక వివరించారు. ‘‘అనంత్ అంబానీ జాతకం, నా జాతకం ఆధారంగా పెళ్లి తేదీలను మా పూజారి డిసైడ్ చేశారు’’ అని ఆమె తెలిపారు.

Also Read :KCR : సుప్రీంకోర్టు కూడా తిరస్కరిస్తే కేసీఆర్ ఏం చేస్తారు..?

  • 2023 జనవరిలో అనంత్‌-రాధిక నిశ్చితార్థం జరిగింది.
  •  జామ్‌నగర్‌లో ఒకసారి, క్రూజ్‌ షిప్‌లో మరోసారి ప్రీ వెడ్డింగ్ వేడుకలు జరిగాయి.
  • జులై 12న వివాహం, 13న శుభ్‌ ఆశీర్వాద్‌, 14న రిసెప్షన్ నిర్వహించారు.
  • ఈ వేడుకల్లో జాతీయ, అంతర్జాతీయ ప్రముఖులు పాల్గొన్నారు.
  • ఈ వేడుకల్లో అంబానీ కుటుంబసభ్యుల దుస్తులు, నగలు అందరినీ ఆకర్షించాయి.
  • అతిథుల కోసం చేసిన ఏర్పాట్లు ఆశ్చర్యపరిచాయి.

Also Read :Vijayasai Reddy : విజయసాయిరెడ్డి ఛానెల్‌ పెడితే.. సాక్షికి దెబ్బ తప్పదా..?

అనంత్  అంబానీ – రాధికా మర్చంట్ వివాహ తంతులో భాగంగా జరిగే అప్పగింతల కార్యక్రమం వేళ  ముకేశ్ అంబానీ ఎమోషనల్ అయ్యారు. నవ వధువు రాధికా మర్చంట్ తాను పుట్టినింటిని వదిలి వెళ్లిపోతున్నానన్న ఆలోచన తట్టుకోలేక ఎమోషనల్ అయింది. అలాంటి భావోద్వేగ సమయంలో ఆమెను చూస్తూ ముకేశ్ అంబానీ కూడా కన్నీళ్లుపెట్టుకుంటారు. ఆ సున్నితమైన ఘట్టంలో రాధిక కన్నీరుమున్నీరుగా విలపిస్తుంటే అనంత్‌ ఓదార్చే ప్రయత్నం చేశారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట వైరల్‌ అవుతోంది.

Also Read :Chhattisgarh: హాస్టల్‌లో మైనర్ గర్భం , రహస్యంగా అబార్షన్

  Last Updated: 15 Jul 2024, 04:39 PM IST