Porn Sites Vs Bank Accounts: ‘పోర్న్ సైట్ స్కామ్’ కలకలం రేపుతోంది. మనదేశంలో దీని బారిన ఎంతోమంది పడుతున్నారు. తమ కష్టార్జితాన్ని సైబర్ కేటుగాళ్లకు చేతులారా సమర్పించుకుంటున్నారు. ఇంతకీ ఏమిటీ స్కామ్ ? ఎలా జరుగుతోంది ?
Also Read :Shock To Old Vehicles: పాత వాహనాలకు షాక్.. పెట్రోలు బంకుల్లో ఇక నో పెట్రోల్
స్మార్ట్ ఫోన్లు, కంప్యూటర్లకు..
‘నోటిఫికేషన్’ అంటే సమాచారాన్ని అందించే అలర్ట్. మన ఫోన్లు, కంప్యూటర్లకు నిత్యం ఎన్నో నోటిఫికేషన్లు వస్తుంటాయి. ‘పోర్న్ సైట్ స్కామ్’ చేస్తున్న సైబర్ కేటుగాళ్లు స్మార్ట్ ఫోన్లు, కంప్యూటర్లకు నోటిఫికేషన్లను పంపుతారు. ఇంటర్నెట్ బ్రౌజర్ తెరవగానే అవి కనిపిస్తాయి. వీటిని చూసి నిజమైనవే అని పలువురు భావిస్తున్నారు. ఆ నోటిఫికేషన్‌లో ఉన్న మెసేజ్‌ను చూసి చెమటోడుస్తున్నారు. ఏం చేయాలో అర్థం కాక ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.
Also Read :Akash Ambani : ముకేశ్ అంబానీ గురించి ఆకాశ్ అంబానీ ఏం చెప్పారో తెలుసా?
నోటిఫికేషన్‌లో ఏముంది ?
‘‘మీరు మైనర్లకు సంబంధించిన పోర్న్ కంటెంట్‌ను(Porn Sites Vs Bank Accounts)చూశారు. అది చట్ట విరుద్ధమైన పని. అందుకే చట్టపరంగా మీ డివైజ్‌ను లాక్ చేశాం. జరిమానా చెల్లించకుంటే మీపై క్రిమినల్ ప్రొసీడింగ్స్ మొదలు పెడతాం’’ అని సైబర్ కేటుగాళ్లు పంపే నోటిఫికేషన్‌లో ఉంటోంది. దీనిలోని లోగోలు, భాష బాగా మర్యాదపూర్వకంగా, హుందాగా ఉంటాయి. అందుకే కొంతమంది ఈ నోటిఫికేషన్ ప్రభుత్వం నుంచే వచ్చిందని ఈజీగా నమ్ముతున్నారు.
బెదిరింపులో మరో లెవల్
నోటిఫికేషన్‌ను పంపాక స్కామర్లు కౌంట్‌డౌన్ టైమర్‌ను నడుపుతారు. ఆ టైమర్ ముగిసేలోగా జరిమానా కట్టాలని డిమాండ్ చేస్తారు. లేదంటే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరిస్తారు. డిజిటల్ పేమెంట్ ఆప్షన్లు ఉన్నాయని అంటారు. ఒకవేళ ఎవరైనా ఇవన్నీ నమ్మి డిజిటల్‌గా డబ్బులు కట్టేందుకు రెడీ అయితే.. వారి బ్యాంకు అకౌంటు, క్రెడిట్ కార్డు అకౌంటు వివరాలను హ్యాక్ చేస్తారు. అయితే డబ్బులు ట్రాన్స్‌ఫర్ అయిన వెంటనే ఈ హ్యాంకింగ్ తతంగం చేస్తారు. ఇలాంటి నోటిఫికేషన్లు వస్తే మీరు అస్సలు నమ్మకండి. బీ అలర్ట్.