Health Insurance Vs Pollution : ఆరోగ్య బీమా పాలసీలను తీసుకునే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఇది ప్రజల్లో పెరిగిన ఆరోగ్య స్పృహకు నిదర్శనం. ఏదైనా ఆరోగ్య అత్యవసర పరిస్థితి ఎదురైతే.. తప్పకుండా ఆరోగ్య బీమా పాలసీ రక్షణ కల్పిస్తుంది. ఈ పాలసీల నెలవారీ/వార్షిక బీమా ప్రీమియంలను నిర్ణయించే క్రమంలో పలు అంశాలను ఆరోగ్య బీమా కంపెనీలు పరిగణనలోకి తీసుకుంటాయి. ‘వాతావరణ మార్పులు’ అనే అంశాన్ని కూడా లెక్కలోకి తీసుకొని, ఆరోగ్య బీమా ప్రీమియంను డిసైడ్ చేస్తారు. ఈవిషయంలోనే ఒక కొత్త అప్‌డేట్‌ను మనం తెలుసుకోబోతున్నాం.
Also Read :Viral Video : నిండు గర్భిణి ఏడు కిలోమీటర్లు డోలిలోనే.. వీడియో వైరల్
10 శాతం నుంచి 15 శాతం పెంపు
ప్రస్తుతం మన దేశంలోని ప్రధాన నగరాల్లో కాలుష్య స్థాయులు(Health Insurance Vs Pollution) పెరుగుతున్నాయి. దీని ప్రభావం ప్రజల ఆరోగ్యాలపై పడుతోంది. ఫలితంగా శ్వాసకోశ వ్యాధులు వస్తున్నాయి. ఈ అంశాన్ని ఆరోగ్య బీమా కంపెనీలు పరిగణనలోకి తీసుకున్నాయి. ప్రజల ఆరోగ్యాలకు కాలుష్యంతో ముప్పు పెరిగినందున, అంతమేరకు బీమా ప్రీమియంలను పెంచాలని ఆరోగ్య బీమా కంపెనీలు భావిస్తున్నాయి. ఈ పెంపు వివిధ ఆరోగ్య బీమా పాలసీలను బట్టి సగటున 10 శాతం నుంచి 15 శాతం దాకా ఉంటుందని అంచనా వేస్తున్నారు. దీనివల్ల ఆయా పాలసీలు తీసుకునే వారిపై ప్రతినెలా కొంతమేర ఆర్థిక భారం పెరిగే అవకాశం ఉంటుంది.ఆరోగ్య బీమా పాలసీలను క్లెయిమ్ చేసుకుంటున్న వారి సంఖ్య 2023 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 2025లో 8 శాతం మేర పెరగిందట. పాలసీ క్లెయిమ్‌ల సంఖ్య పెరిగితే.. ఆరోగ్య బీమా కంపెనీల ఖర్చులు పెరిగిపోతాయి. ఈ ఖర్చును సమం చేసుకోవాలంటే తాము బీమా ప్రీమియంలను అంతమేరకు పెంచుకోక తప్పదని కంపెనీలు భావిస్తున్నాయి.
‘గాలి నాణ్యత’ అనే ఫ్యాక్టర్
ఆరోగ్య బీమా పాలసీల ప్రీమియంలను పెంచే అంశంపై బీమా కంపెనీలు ఏకపక్షంగా నిర్ణయం తీసుకోలేవు. ఈవిషయంలో బీమారంగ నియంత్రణ సంస్థ ‘ఐఆర్‌డీఏఐ’ నుంచి అనుమతులను పొందాలి. ఇప్పటికే ఈ దిశగా పలు ఇన్సూరెన్స్ కంపెనీలు ప్రయత్నాలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. ‘గాలి నాణ్యత’ అనే ఫ్యాక్టర్‌ను జోడించి ఆరోగ్య బీమా ప్రీమియంలను పెంచుకునే ఛాన్స్ ఇవ్వాలని ‘ఐఆర్‌డీఏఐ’ను కోరుతున్నట్లు సమాచారం. అయితే దీనిపై ‘ఐఆర్‌డీఏఐ’ ఎలా స్పందిస్తుందో వేచిచూడాలి.