PMI July Report: జులై 2025లో భారతదేశ సేవా రంగం గణనీయమైన వృద్ధిని నమోదు చేసింది. ఈ వృద్ధి గత 11 నెలల్లో అత్యధిక స్థాయికి చేరుకుంది. సీజనల్‌గా సర్దుబాటు చేయబడిన HSBC ఇండియా సర్వీస్ పీఎంఐ (PMI July Report:) జులైలో 60.5గా ఉంది. ఇది జూన్‌లో 60.4గా ఉంది. ఇది ఆగస్టు 2024 తర్వాత అత్యధిక స్థాయి. PMI సూచికలో 50 కంటే ఎక్కువ స్థాయి ఆర్థిక కార్యకలాపాలలో విస్తరణను సూచిస్తుంది. అయితే 50 కంటే తక్కువ స్థాయి సంకోచాన్ని సూచిస్తుంది.
ఈ వృద్ధికి ప్రధాన కారణాలలో కొత్త ఎగుమతి ఆర్డర్లలో వేగవంతమైన జోరు, మొత్తం విక్రయాలలో బలం ఉన్నాయి. సర్వే ప్రకారం.. భారతీయ సేవా ప్రదాతలు ఆసియా, కెనడా, యూరప్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, అమెరికా వంటి దేశాల నుండి కొత్త ఆర్డర్లను అందుకున్నారు. దీనితో అంతర్జాతీయ డిమాండ్‌లో బలమైన మెరుగుదల కనిపించింది.
Also Read: Electric Bike: ఈ బైక్‌తో ఒకేసారి 175 కిలోమీటర్ల జర్నీ.. ధర కూడా తక్కువే!
సేవా రంగంలో వేగం
ధరల విషయంలో జూన్‌తో పోలిస్తే ముడి పదార్థాలు, తుది ఉత్పత్తుల ఖర్చులలో వేగంగా వృద్ధి నమోదైంది. ఉత్పత్తి ధరలలో ఈ పెరుగుదల ఖర్చు ఒత్తిడి, బలమైన డిమాండ్‌ను సూచిస్తుంది. HSBC చీఫ్ ఎకనామిస్ట్ ప్రాంజుల్ భండారి ప్రకారం.. సేవా రంగంలో ఈ బలం ప్రధానంగా ఎగుమతి ఆర్డర్లలో వృద్ధి కారణంగా ఉంది. అయితే ధరలలో వచ్చిన ఈ జోరు భవిష్యత్తులో మారవచ్చని ఆమె సూచించింది. ఇటీవలి కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ (CPI), హోల్‌సేల్ ప్రైస్ ఇండెక్స్ (WPI) డేటా ద్వారా ఇది సూచించబడింది.
జూన్‌లో రిటైల్ ద్రవ్యోల్బణం 2.1 శాతంగా ఉంది. ఇది ఫిబ్రవరి నుండి 4 శాతం కంటే తక్కువగా ఉంది. అయితే హోల్‌సేల్ ధర ద్రవ్యోల్బణం 19 నెలల విరామం తర్వాత ఋణాత్మకంగా ఉంది. జూన్‌లో 0.13 శాతం తగ్గింది. ఇదే సమయంలో HSBC ఇండియా కాంపోజిట్ ఔట్‌పుట్ ఇండెక్స్ కూడా జులైలో స్వల్పంగా పెరిగి 61.1కి చేరుకుంది. ఇది జూన్‌లో 61.0గా ఉంది. ఈ సూచిక మాన్యుఫాక్చరింగ్, సర్వీస్ PMIల కలయిక. సర్వీస్ PMIని S&P గ్లోబల్ సుమారు 400 సేవా రంగ కంపెనీల సమాధానాల ఆధారంగా తయారు చేసింది.

