PM Kisan 19th Installment: ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన 19వ విడత (PM Kisan 19th Installment) ఈ నెలలోనే విడుదల కానుంది. ఫిబ్రవరి 24న బీహార్‌లో పర్యటించనున్న ప్రధాని నరేంద్ర మోదీ అక్కడ రైతుల 19వ విడతకు సంబంధించిన నిధులను విడుదల చేయనున్నారు. ఫిబ్రవరి 24న వాయిదాల ప్రకటన వెలువడేలోపు రైతులు తమ ఖాతాల్లో ఎలాంటి లోటుపాట్లు ఉంటే వాటిని తొలగించుకోవాలని అధికారులు సూచించారు. ముందుగా రైతులు ఇ-కెవైసిని పొందడం అవసరం, లేకపోతే ఖాతాలో డబ్బు పొందడంలో సమస్య రావొచ్చు. మీ ఖాతాలోకి పీఎం కిసాన్ 19వ విడత డబ్బు వచ్చిందో లేదో తెలుసుకోవడానికి కొన్ని పద్ధతులను చెబుతున్నాం. తద్వారా మీరు మీ ఖాతాలో డబ్బు జమ అయిందో లేదో తెలుసుకోవచ్చు.
బ్యాలెన్స్ చెక్ చేసుకోవడం ఎలా?
పీఎం కిసాన్ యోజన 19వ విడత ఈ నెలలో విడుదల కానుంది. వాయిదాలు విడుదలైన వెంటనే రైతుల బ్యాంకు ఖాతాల్లోకి డబ్బులు రావడం ప్రారంభమవుతుంది. ఈ సమయంలో లబ్ధిదారులు వారి ఖాతాకు డబ్బు వచ్చిందో లేదో కొన్ని దశల్లో తెలుసుకోవచ్చు. దీని కోసం లబ్ధిదారులు PM కిసాన్ అధికారిక వెబ్‌సైట్ https://pmkisan.gov.in/కి లాగిన్ కావాలి. దాని తర్వాత స్టేటస్ ఆప్షన్ కనిపిస్తుంది. దాన్ని ఎంచుకున్న తర్వాత రిజిస్ట్రేషన్ నంబర్, క్యాప్చా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. వీటిని ఎంటర్ చేసిన తర్వాత మీ రిజిస్టర్డ్ నంబర్‌పై OTP వస్తుంది, దాన్ని పూరించండి. దీని తర్వాత మీరు మీ ఆధార్ నంబర్‌ను నమోదు చేయడం ద్వారా మీ బ్యాలెన్స్‌ని తనిఖీ చేయవచ్చు. ఈ మొత్తం ప్రక్రియ కోసం మీరు e-KYC పూర్తి చేయడం అవసరం. డబ్బులు రాకపోతే సంబంధిత అధికారులతో మాట్లాడవచ్చు.
Also Read: Ganga Tiger : గంగానదిలో పెద్దపులులు.. ఏమిటివి ? వాటికి ఏమవుతోంది ?
e-KYC కోసం మూడు పద్ధతులు ఉన్నాయి. వాటిలో మొదటిది OTP-ఆధారిత e-KYC, రెండవది ముఖ ప్రమాణీకరణ ఆధారిత e-KYC, మూడవది బయోమెట్రిక్ ఆధారిత e-KYC. దీని కోసం కూడా మీరు అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లాలి. అక్కడ స్టేటస్ పైన e-KYC ఎంపిక కనిపిస్తుంది.
19వ విడత ఎప్పుడు వస్తుంది?
19వ విడత సొమ్మును ఈ నెల 24న రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు. ఈ విషయాన్ని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ వెల్లడించారు. ఈ క్రమంలోనే ప్రధాని మోదీ బీహార్ పర్యటనలో ఉంటారని, అక్కడి నుంచి 19వ విడతను ప్రకటిస్తారని చెప్పారు. కొంతమంది లబ్ధిదారులతో కూడా ప్రధాని మోదీ మాట్లాడనున్నారు. ప్రభుత్వం ప్రతి నాలుగు నెలలకొకసారి రైతుల ఖాతాల్లోకి రూ. 2,000 జమ చేస్తుందని మనకు తెలిసిందే.