PM Kisan Yojana: దీపావళి పండుగకు ముందు దేశవ్యాప్తంగా లక్షలాది మంది రైతులు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (PM Kisan Yojana) పథకం 21వ విడత కోసం ఆసక్తిగా ఎదురుచూశారు. అయితే దీపావళి వరకు ఈ విడత మొత్తాన్ని విడుదల చేయలేదు. ఇప్పుడు ఛత్ పూజ పండుగకు ముందే రైతులకు 21వ విడత విడుదల అయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు. కాగా వరదలు, విపత్తుల ప్రభావానికి గురైన కొన్ని రాష్ట్రాలలో రైతు నిధి 21వ విడతను ఇప్పటికే విడుదల చేశారు.
ఎప్పుడు విడుదలయ్యే అవకాశం ఉంది?
కొన్ని మీడియా రిపోర్టుల ప్రకారం.. ఛత్ పూజ సమయానికి ఈ విడత వచ్చే అవకాశం ఉందని చెబుతుండగా.. మరికొన్ని రిపోర్టులలో ఇవి నవంబర్ మొదటి వారంలో విడుదల కావచ్చని పేర్కొన్నారు. బీహార్‌లో ఎన్నికల వాతావరణాన్ని దృష్టిలో ఉంచుకుని కూడా నవంబర్‌లోనే 21వ విడత విడుదల అవుతుందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
Also Read: Muhurat Trading: ముహూర్త ట్రేడింగ్.. స్వల్ప లాభాలతో ముగిసిన మార్కెట్!
21వ విడత పొందడానికి ఈ పనులు తప్పక చేయండి
పీఎం కిసాన్ 21వ విడత మొత్తాన్ని పొందాలంటే రైతులు కింది ముఖ్యమైన పనులను తప్పకుండా పూర్తి చేయాలి.
ఈకేవైసీ (eKYC) తప్పనిసరిగా చేయించుకోండి: మీరు ఇప్పటివరకు మీ ఈకేవైసీ పూర్తి చేయకపోతే వెంటనే చేయించుకోండి. ఎందుకంటే ఇది లేకుండా 21వ విడత రాదు. మీరు సీఎస్‌సీ (CSC) సెంటర్‌కు వెళ్లి ఈకేవైసీ చేయించుకోవచ్చు. దీంతో పాటు అధికారిక పోర్టల్ pmkisan.gov.in లోకి వెళ్లి కూడా ఇ-కేవైసీ పూర్తి చేసుకోవచ్చు.
భూ-ధృవీకరణ (Land Verification) చేయించాలి: మీరు ఇప్పటివరకు భూ-ధృవీకరణ చేయించకపోతే వెంటనే చేయించండి. ఎందుకంటే సాగు చేయదగిన భూమి ధృవీకరణ పూర్తయిన తర్వాతే రైతు విడతకు అర్హులుగా పరిగణించబడతారు. మీరు ఈ పని చేయకపోతే మీ విడత ఆగిపోయే అవకాశం ఉంది.
ఆధార్ లింకింగ్ పూర్తి చేసుకోండి: మీ ఖాతాకు ఇప్పటికీ ఆధార్ కార్డు లింక్ చేయకపోతే వెంటనే ఈ పని పూర్తి చేయండి. మీ ఆధార్ లింక్ కాకపోతే 21వ విడత నిలిచిపోయే అవకాశం ఉంది. వెంటనే బ్యాంకుకు వెళ్లి ఈ పనిని పూర్తి చేయండి.