PM Kisan Yojana: కేంద్ర ప్రభుత్వం దీపావళి 2025 కంటే ముందు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన (PM Kisan Yojana) 21వ విడత రూ. 2,000లను విడుదల చేయబోతోంది. దీని ద్వారా లక్షలాది మంది రైతులకు లబ్ధి చేకూరుతుంది. అయితే లబ్ధిదారులందరికీ ఈ చెల్లింపు అందదు. అవును ఈ 5 పనులు పూర్తి చేయని రైతుల ఖాతాలోకి పీఎం కిసాన్ యోజన 21వ విడత జమ కాదు.
పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ వంటి వరద ప్రభావిత రాష్ట్రాలలోని కొంతమంది రైతులకు ఇప్పటికే చెల్లింపు అందినట్లు తెలుస్తోంది. కాబట్టి పండుగ సమయంలో మీ డబ్బు ఆగకుండా ఉండాలంటే ఈ 5 పనులను వెంటనే పూర్తి చేయండి.
e-KYC చేయించండి
ఇప్పటివరకు మీరు e-KYC పూర్తి చేయకపోతే వెంటనే చేయించండి. ఎందుకంటే ఇది పూర్తి చేయకపోతే మీకు ఈ విడత డబ్బులు అందవు. e-KYC లేకుండా ఎవరికీ డబ్బు పంపబడదు. కాబట్టి దీన్ని తక్షణమే పూర్తి చేయండి. మీరు ఆన్‌లైన్‌లో OTP ద్వారా లేదా CSC సెంటర్‌కు వెళ్లి వేలిముద్ర ద్వారా బయోమెట్రిక్ e-KYC కూడా చేయించుకోవచ్చు.
బ్యాంక్ ఖాతాలో లోపాలు ఉంటే సరిదిద్దండి
బ్యాంక్ వివరాలలో పొరపాటు లేదా లోపం ఉంటే విడత డబ్బులు చేరలేవు. అందుకే IFSC కోడ్‌ను సరిచూసుకోండి. అలాగే ఖాతా మూసివేయబడలేదని, బ్యాంక్ ఖాతా ఆధార్‌తో లింక్ చేయబడిందని నిర్ధారించుకోండి. వీటిలో ఏ చిన్న పొరపాటు ఉన్నా ట్రాన్సాక్షన్ విఫలమవుతుంది. మీ బ్యాంక్ వివరాలను తప్పకుండా తనిఖీ చేసుకోండి.
Also Read: Rinku Singh: టీమిండియా క్రికెటర్‌కు బెదిరింపులు.. రూ. 5 కోట్లు ఇవ్వాలని డిమాండ్!
భూమి ధృవీకరణ (Land Verification) తప్పక చేయించండి
విడత డబ్బులు పొందడానికి పీఎం కిసాన్ పోర్టల్‌లో భూమికి సంబంధించిన పత్రాలను అప్‌డేట్ చేయడం, ధృవీకరించడం తప్పనిసరి. తప్పుగా లేదా అసంపూర్తిగా ఉన్న పత్రాలు ఉంటే లబ్ధిదారుల జాబితా నుండి తొలగించే అవకాశం ఉంటుంది. అందుకే మీ సరైన పత్రాలను పోర్టల్‌లో అప్‌లోడ్ చేయండి.
ఫార్మర్ రిజిస్ట్రీ తప్పనిసరి
పీఎం కిసాన్ పోర్టల్‌లో రిజిస్ట్రేషన్‌తో పాటు ఫార్మర్ రిజిస్ట్రీ కూడా అవసరం. రాష్ట్ర ప్రభుత్వం ఫార్మర్ రిజిస్ట్రీ (PM Kisan Yojana Farmer Registry)లో రైతు పేరు నమోదై ఉంటేనే విడత డబ్బులు అందుతాయి.
లబ్ధిదారుల జాబితాలో (Beneficiary List) పేరు
మీ పేరు లబ్ధిదారుల జాబితాలో ఉందో లేదో తప్పకుండా తనిఖీ చేయండి. ఈ జాబితాలో పేరు ఉంటేనే విడత డబ్బులు వస్తాయి. pmkisan.gov.in వెబ్‌సైట్‌కు వెళ్లి మీ పేరు ఉందో లేదో తనిఖీ చేసుకోండి.
