PM Kisan 20th Installment: రైతులు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన 20వ వాయిదా కోసం (PM Kisan 20th Installment) కోసం ఇంకా వేచి ఉండాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ రోజు బీహార్‌కు చేరుకున్న ప్రధానమంత్రి మోదీ 20వ వాయిదాకు సంబంధించి ఎలాంటి ప్రకటన చేయలేదు. ఆయన బీహార్ పర్యటనలో ఉన్నారు. రైతులు ఈ రోజు వాయిదాకు సంబంధించి ప్రకటన వస్తుందని ఆశించారు. కానీ అలాంటిదేమీ జరగలేదు. ఇప్పుడు రైతులు మరింత కాలం వేచి ఉండాల్సి ఉంటుంది. ప్రభుత్వం నుండి కూడా PM కిసాన్ యోజన 20వ వాయిదాకు సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. కాబట్టి, రైతులు మరింత సమయం వేచి ఉండాల్సి ఉంటుంది.
ప్రతి 4 నెలలకు రైతుల ఖాతాల్లోకి డబ్బులు
పీఎం కిసాన్ యోజన కింద కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం 3 వాయిదాలలో రూ. 6,000 ఆర్థిక సహాయాన్ని నేరుగా రైతుల బ్యాంకు ఖాతాలలో జమ చేస్తుంది. ఈ వాయిదాలు ప్రతి నాలుగు నెలలకు రూ. 2,000 చొప్పున బదిలీ చేయబడతాయి. గతంలో అనగా 19వ వాయిదా ఈ ఏడాది ఫిబ్రవరిలో విడుదల చేశారు. దీని ద్వారా దేశవ్యాప్తంగా 9.8 కోట్ల రైతులు లబ్ధి పొందారు. ఇందులో 2.41 కోట్ల మహిళా రైతులు కూడా ఉన్నారు.
Also Read: Maruti Suzuki e Vitara: మారుతి సుజుకి నుంచి ఎలక్ట్రిక్ కారు.. ఫీచర్లు, ధర వివరాలీవే!
మీ పేరు లబ్ధిదారుల జాబితాలో ఉందా? ఇలా తనిఖీ చేయండి!
- ముందుగా https://pmkisan.gov.in వెబ్‌సైట్‌కు వెళ్ళండి.
- హోమ్‌పేజీలో “డాష్‌బోర్డ్” ట్యాబ్‌పై క్లిక్ చేయండి.
- ఇప్పుడు ‘విలేజ్ డాష్‌బోర్డ్’ ట్యాబ్‌లో మీ వివరాలను నమోదు చేయండి. రాష్ట్రం, జిల్లా, ఉప-జిల్లా, పంచాయతీ వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది.
- ఆ తర్వాత “Get Report” బటన్‌పై క్లిక్ చేయండి.
- ఇప్పుడు మీరు లబ్ధిదారుల జాబితాలో ఉంటే మీ పేరును చూడవచ్చు.
ముఖ్యమైన విషయాలు గమనించండి
పీఎం కిసాన్ యోజన ద్వారా రాయితీ మొత్తాన్ని పొందడానికి కొన్ని ముఖ్యమైన షరతులను పాటించాలి.
- మీ బ్యాంకు ఖాతా ఆధార్‌తో లింక్ అయి ఉండాలి.
- DBT (డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్) ఆప్షన్ ఖాతాలో యాక్టివ్‌గా ఉండాలి.
- ఈ-కెవైసీ పూర్తి చేయాలి (మీరు PM Kisan పోర్టల్ ద్వారా ఈ-కెవైసీ చేయవచ్చు).
- పోర్టల్‌లో ‘Know Your Status’ ట్యాబ్ ద్వారా ఆధార్ లింకింగ్, కెవైసీ స్థితిని తనిఖీ చేయవచ్చు.
సాధారణంగా ప్రతి నాలుగు నెలలకు వాయిదా విడుదల అవుతుంది. కానీ ఈసారి 20వ వాయిదాలో ఆలస్యం జరిగింది. ఈ ఆలస్యం లోక్‌సభ, రాష్ట్ర ఎన్నికల కారణంగా జరిగినట్లు తెలుస్తోంది.