Lanka Pay : ఇక నుంచి ‘లంక పే’.. టూరిస్టులకు గుడ్ న్యూస్

యూపీఐ లావాదేవీల్లో మనదేశంలో టాప్ ప్లేసులో ఉన్న ‘ఫోన్ పే’ కంపెనీ విస్తరణ దిశగా మరో ముందడుగు వేసింది.

  • Written By:
  • Updated On - May 16, 2024 / 02:36 PM IST

Lanka Pay : యూపీఐ లావాదేవీల్లో మనదేశంలో టాప్ ప్లేసులో ఉన్న ‘ఫోన్ పే’ కంపెనీ విస్తరణ దిశగా మరో ముందడుగు వేసింది. మన పొరుగు దేశం శ్రీలంకలోనూ ‘లంక పే’(Lanka Pay)  పేరుతో యూపీఐ సర్వీసులను మొదలుపెట్టింది. అక్కడికి పెద్దసంఖ్యలో వెళ్లే భారతీయ టూరిస్టులకు దీనివల్ల ఎంతో సౌకర్యం కలుగుతుందని ఫోన్ పే వెల్లడించింది. శ్రీలంక పర్యటనకు వెళ్లే భారతీయులు ప్రత్యేకించి చిన్నచిన్న లావాదేవీలను అతి సులువుగా చేసుకునేందుకు లంక పే దోహదం చేస్తుందని తెలిపింది. శ్రీలంక దేశ ప్రజలు లావాదేవీల్లో కొత్త విప్లవాన్ని తమ వేగవంతమైన సేవల ద్వారా చూడబోతున్నారని ఫోన్ పే పేర్కొంది. ప్రధానంగా టూరిజంపై ఆధారపడిన శ్రీలంక వంటి దేశాలకు యూపీఐ సేవలు చాలా అవసరమని చెప్పింది. ఫోన్ పే సేవలు శ్రీలంకలో ప్రారంభమయ్యాయనే విషయాన్ని శ్రీలంకలోని భారత హైకమిషన్ ట్విట్టర్ వేదికగా వెల్లడించింది.

We’re now on WhatsApp. Click to Join

శ్రీలంకకు టూర్ల కోసం వెళ్లే భారతీయులు ఇకపై ఫోన్ పే యాప్ నుంచి నేరుగా లంక పే క్యూఆర్ కోడ్‌లను స్కాన్ చేసి పేమెంట్స్ చేయొచ్చని ఫోన్ పే చెప్పింది. ఫోన్ పే అకౌంట్ల నుంచి లంక పే అకౌంట్లకు నేరుగా డబ్బులను పంపుకోవచ్చని తెలిపింది. దీనివల్ల శ్రీలంకలో నగదు లావాదేవీలు తగ్గిపోయి.. డిజిటల్ లావాదేవీలు కొత్త రెక్కలు తొడుగుతాయని పేర్కొంది.

Also Read :Covaxin : కొవాగ్జిన్ టీకాతోనూ సైడ్ ఎఫెక్ట్స్.. బనారస్ హిందూ వర్సిటీ స్టడీ రిపోర్ట్

ఫోన్ పే గత సంవత్సరం పేటీఎం సౌండ్‌బాక్స్ మాదిరిగానే స్మార్ట్ స్పీకర్‌ను విడుదల చేసింది. కేవలం 6 నెలల్లోనే 20 లక్షల స్మార్ట్ స్పీకర్లను (స్మార్ట్ స్పీకర్స్) వ్యాపారుల షాపుల్లో ఫోన్ పే ఇన్‌స్టాల్ చేసింది. ఈ స్మార్ట్ స్పీకర్లు కస్టమర్ క్యూఆర్ కోడ్‌ని స్కాన్ చేసి చెల్లింపు చేసినప్పుడు వాయిస్ సందేశం ద్వారా ట్రాన్సాక్షన్ వివరాలను ప్రకటిస్తుంది. ఫోన్ పే స్మార్ట్ స్పీకర్ పరికరం ఒకసారి ఛార్జ్ చేస్తే నాలుగు రోజుల బ్యాటరీ లైఫ్ ఉంటుంది . పేటీఎం అటువంటి స్పీకర్లను అమలు చేయడంలో మొదటిది. సౌండ్‌బాక్స్ అనే దాని పరికరం ప్రసిద్ధి చెందింది. ఇప్పుడు ఈ సౌండ్‌బాక్స్ పేటీఎంకి ముఖ్యమైన ఆదాయ వనరు. పేటీఎం నికర చెల్లింపు ఆదాయంలో శాతం. 38 శాతం షేర్ సౌండ్ బాక్స్ నుంచే వస్తుంది.

Also Read : AP : ఏపిలో మనం చరిత్ర సృష్టించబోతున్నాం: ఐప్యాక్‌ టీంతో సీఎం జగన్‌