ఓలా ఎలక్ట్రిక్ మొబిలిటీ సంస్థ (Ola Electric Mobility) మరోసారి ఉద్యోగులను తొలగించేందుకు (Laying off )సిద్ధమైంది. ఈసారి దాదాపుగా 1000 మంది ఉద్యోగులు (1,000 Employees), కాంట్రాక్టు వర్కర్లు తమ ఉద్యోగాలను కోల్పోయే ప్రమాదంలో ఉన్నారని తెలుస్తోంది. కంపెనీ నష్టాలను తగ్గించుకునే క్రమంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇప్పటికే 2023 నవంబర్‌లో 500 మందిని ఉద్యోగాల నుంచి తొలగించిన కంపెనీ, ఇప్పుడు మరోసారి ఉద్యోగులను తగ్గించుకోవడం పరిశ్రమ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
Immediately Have Babies: అర్జెంటుగా పిల్లల్ని కనమంటున్న సీఎం.. ఎందుకో తెలుసా ?
గత కొన్ని నెలలుగా ఓలా ఎలక్ట్రిక్ తీవ్ర ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటోంది. మార్కెట్‌లో ఉన్న తీవ్రమైన పోటీ, ఉత్పత్తి వ్యయాలు, అమ్మకాలు తగ్గిపోవడంతో కంపెనీ ఆదాయం తగ్గిపోతోంది. ప్రస్తుతం ఓలా షేర్లు 60% తగ్గి రూ.55 వద్ద కొనసాగుతున్నాయి. కంపెనీ తన వ్యయాలను తగ్గించుకునే ప్రయత్నంలో భాగంగా ఉద్యోగులను తొలగించడం మొదలుపెట్టిందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ తొలగింపుల ప్రభావం కంపెనీ అన్ని విభాగాలపై పడనుంది. ఉత్పత్తి, మేనేజ్‌మెంట్, సేల్స్ & మార్కెటింగ్ సహా ఇతర శాఖల్లో కూడా ఉద్యోగుల తొలగింపు జరిగే అవకాశముంది. ప్రస్తుతం 4000 మంది ఉద్యోగులతో నడుస్తున్న ఓలా ఎలక్ట్రిక్, ఈ తొలగింపుల తర్వాత మరింత తక్కువ మంది ఉద్యోగులతో ముందుకు వెళ్లబోతోందని సమాచారం.
Immediately Have Babies: అర్జెంటుగా పిల్లల్ని కనమంటున్న సీఎం.. ఎందుకో తెలుసా ?
ఓలా ఎలక్ట్రిక్ తీసుకున్న ఈ నిర్ణయంతో సంస్థ వ్యయాలను తగ్గించుకుని, సంస్థను తిరిగి లాభదాయకమైన దిశగా తీసుకెళ్లాలని భావిస్తోంది. అయితే వరుసగా ఉద్యోగులను తొలగించడం, కంపెనీ భవిష్యత్తుపై అనిశ్చితిని పెంచే అవకాశం ఉందని పరిశీలకులు చెబుతున్నారు. ఉద్యోగుల తొలగింపు ప్రభావం ఓలా ఎలక్ట్రిక్ ఉత్పత్తుల నాణ్యత, వినియోగదారుల విశ్వాసంపై ఎలా ఉంటుందన్నదీ ఆసక్తికరంగా మారింది.