ఐటీ రంగం వేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో హైదరాబాద్‌లో ఆఫీస్ స్పేస్(Office Space)కి భారీ డిమాండ్ ఉంటుందని ఎన్నో అంచనాలు వెలువడ్డాయి. కానీ పరిస్థితి పూర్తి భిన్నంగా మారిందని తెలుస్తోంది. రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ సంస్థ వెస్టియన్ (Real estate consultant firm Vestian) నిర్వహించిన సర్వే ప్రకారం.. బెంగళూరుని తర్వాత అత్యధికంగా ఖాళీ ఆఫీస్ భవనాలు ఉన్న నగరం హైదరాబాద్(Hyderabad)నే అని తేలింది. ప్రస్తుతానికి నగరంలో దాదాపు 284 లక్షల చదరపు అడుగుల ఆఫీస్ స్పేస్ ఖాళీగా ఉంది.
CM Revanth Reddy: నేడు ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి.. కారణమిదే?
ఇదే రెండు సంవత్సరాల క్రితం వరకు హైదరాబాద్‌లో ఆఫీస్ స్థలానికి పోటీ ఉండేది. ఆఫీస్ భవనాలు లభించకపోవడంతో సంస్థలు భారీ అద్దె చెల్లిస్తూ కార్యాలయాలు ఏర్పాటు చేసేవి. కానీ ఇప్పుడు పరిస్థితి తారుమారు అయింది. ‘To Let’ బోర్డులు ఎక్కడ చూసినా కనిపిస్తున్నాయి. ప్రభుత్వ మార్పు తర్వాత కొన్ని కంపెనీలు ఇతర రాష్ట్రాల వైపు దృష్టి మళ్లించగా, అమెరికాలో ట్రంప్ పాలనలో వచ్చిన ఆంక్షల వల్ల అనేక ఐటీ ప్రాజెక్టులు నిలిచిపోయాయి.
Kedarnath Dham: కేదర్‌నాథ్‌లో ప్రారంభమైన పూజలు.. తెరుచుకున్న ఆలయం!
ఈ మార్పుల ప్రభావంతో అనేక కంపెనీలు ఉద్యోగులను తగ్గించుకోవడం, కార్యాలయాలు మూసివేయడం వంటి చర్యలు తీసుకున్నాయి. ఫలితంగా భారీ స్థాయిలో ఆఫీస్ స్పేస్‌లు ఖాళీ అవుతున్నాయి. రియల్ ఎస్టేట్ రంగానికి ఇది గట్టి ఎదురుదెబ్బగా భావిస్తున్నారు. ఒకప్పుడు భవిష్యత్తు వ్యాపార కేంద్రంగా భావించిన హైదరాబాద్, ప్రస్తుతం ఆఫీస్ స్పేస్ పరంగా నిశ్శబ్దంగా మారింది. ఈ పరిణామాలపై రాష్ట్ర ప్రభుత్వం మరియు వ్యాపార వర్గాలు వ్యూహాత్మక చర్యలు తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తోంది.
ఈ పరిణామం వల్ల హైటెక్ సిటీ, గచ్చిబౌలి వంటి ప్రాధాన్య ప్రాంతాల్లో కూడా ఖాళీలు కనిపిస్తుండడం గమనార్హం.