Aadhaar Card: ఈ రోజుల్లో ఆధార్ కార్డ్ (Aadhaar Card) అత్యంత ముఖ్యమైన డాక్యుమెంట్లలో ఒకటిగా ఉంది. దీనిని గుర్తింపు ప్రూఫ్‌గా ఉపయోగిస్తారు. దీని కోసం మీరు హార్డ్ కాపీ లేదా ఫోటోకాపీని చూపించాల్సి ఉంటుంది. అయితే, ఇకపై అలాంటి అవసరం ఉండదు. నిజానికి భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) ఒక కొత్త వ్యవస్థను సిద్ధం చేసింది. దీని సహాయంతో మీరు ఇప్పుడు ఆధార్ ఎలక్ట్రానిక్ కాపీని మీ వద్ద ఉంచుకోగలరు.
UIDAI కొత్త వ్యవస్థ అనేక ప్రయోజనాలు
UIDAI కొత్త వ్యవస్థ QR కోడ్ ఆధారిత అప్లికేషన్‌గా ఉంటుంది. దీని సహాయంతో మీరు మీ ఆధార్ లేదా మాస్క్డ్ ఆధార్‌ను షేర్ చేయగలరు. అంటే రాబోయే కాలంలో ప్రజలు QR కోడ్‌ను స్కాన్ చేసి డిజిటల్‌గా తమ ఆధార్‌ను షేర్ చేయగలరు. E-Aadhar Cardను మీరు UIDAI అధికారిక వెబ్‌సైట్ లేదా mAadhar యాప్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇందులో ఒక QR కోడ్ ఉంటుంది. దాన్ని స్కాన్ చేసి మీ ఆధార్‌ను ధృవీకరించుకోవచ్చు. దీనితో ఆధార్ కార్డ్ ఫిజికల్ కాపీని మీతో తీసుకెళ్లే ఇబ్బంది తొలగిపోతుంది. మీ సమాచారం కూడా పూర్తిగా సురక్షితంగా ఉంటుంది.
Also Read: Indiramma Houses: కేసీఆర్ దత్తత గ్రామం వాసాలమర్రిలో అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు!
UIDAI సెంటర్‌కు వెళ్లాల్సిన అవసరం లేదు
అంతేకాకుండా, నవంబర్ నుంచి మరో కొత్త వ్యవస్థ అమలులోకి రానుంది. దీని ప్రకారం ఆధార్ కార్డ్ అప్‌డేట్ చేయడానికి ఇకపై UIDAI సెంటర్‌కు వెళ్లి బయోమెట్రిక్ వివరాలు సమర్పించాల్సిన అవసరం ఉండదు. కేవలం పాస్‌పోర్ట్, వోటర్ ఐడీ, పాన్ కార్డ్ వంటి గుర్తింపు పత్రాలు, అడ్రస్ ప్రూఫ్‌గా ఎలక్ట్రిసిటీ బిల్, రేషన్ కార్డ్ లేదా రెంట్ అగ్రిమెంట్‌ను అప్‌లోడ్ చేసి మీ ఆధార్‌లో సమాచారాన్ని అప్‌డేట్ చేయవచ్చు.
ఇంటి నుంచే నిమిషాల్లో ఆధార్ అప్‌డేట్
ఈ కొత్త అప్లికేషన్ ఈ విధంగా పనిచేస్తుంది. ఒక వ్యక్తి ఇచ్చిన QR కోడ్‌ను ఉపయోగించి ఆధార్‌ను ఒక మొబైల్ నుంచి మరో మొబైల్‌కు లేదా ఒక యాప్ నుంచి మరో యాప్‌కు ట్రాన్స్‌ఫర్ చేయవచ్చు. దీనితో హోటల్‌లో గది బుక్ చేస్తున్నప్పుడు లేదా రైలు ప్రయాణంలో ఐడీ ప్రూఫ్‌గా ఆధార్ కార్డ్‌ను చూపించడంలో చాలా సౌలభ్యం లభిస్తుంది. UIDAI సీఈవో భువనేష్ కుమార్ మాట్లాడుతూ.. ఈ వ్యవస్థ ఇంటి నుంచే ఆధార్ క్రెడెన్షియల్స్ అప్‌డేట్ చేయడానికి సహాయపడేందుకు రూపొందించబడిందని చెప్పారు.