Site icon HashtagU Telugu

NCLT : ఎన్‌సీఎల్‌టీ నుండి మరోసారి స్పైస్‌ జెట్‌కు నోటీసులు

Notice to Spicejet from NCLT once again

Notice to Spicejet from NCLT once again

Spice Jet : మరోసారి ఎన్‌సీఎల్‌టీ  స్పైస్‌ జెట్‌కు ఈరోజు (సోమవారం)  నోటీసులు జారీ చేసింది. ఆ సంస్థ ఆపరేషనల్‌ క్రెడిటార్లలో ఒకటైన టెక్‌జాకీ ఇన్ఫోటెక్‌ దాఖలు చేసిన పిటిషన్‌ ఆధారంగా ఎన్‌సీఎల్‌టీ ఈ నిర్ణయం తీసుకొంది. తాజా పిటిషన్‌ను మహేంద్ర ఖండేల్‌వాలా, సంజీవ్‌ తంజాన్‌తో కూడిన బెంచ్‌ పరిశీలించింది. నోటీసులు జారీ చేసి.. నవంబర్‌ 14వ తేదీకి విచారణను వాయిదా వేసింది.

Read Also: TMC MLA : కోల్‌కతా ఘటన.. సీబీఐ విచారణకు హాజరైన టీఎంసీ ఎమ్మెల్యే

తమ నుంచి స్పైస్‌ జెట్‌ సంస్థ రూ.1.2 కోట్ల విలువైన సాఫ్ట్‌వేర్‌ సేవలను వాడుకొందని టెక్‌జాకీ సంస్థ సెక్షన్‌ 9 కింద దాఖలు చేసిన పిటిషన్‌లో పేర్కొంది. ఆ బకాయిలకుగాను దివాలా పరిష్కార ప్రక్రియను ప్రారంభించాలని కోరింది. ఈ ఏడాది జూన్‌లో ఐర్లాండ్‌ కేంద్రంగా పనిచేసే ఈఎల్‌ఎఫ్‌ సంస్థ దాఖలు చేసిన పిటిషన్‌ ఆధారంగా స్పైస్‌జెట్‌కు నోటీసులు జారీ చేశారు. ఈ సంస్థకు స్పైస్‌జెట్‌ 12 మిలియన్‌ డాలర్ల బకాయిలు చెల్లించాల్సి ఉంది. ప్రపంచంలోనే ఇంజిన్‌ ఫైనాన్సింగ్‌లో ఇది అగ్రగామి. ఇదే కాక స్పైస్‌ జెట్‌పై పలు రుణదాతలు దివాలా పరిష్కార పిటిషన్లు దాఖలు చేసిన సంగతి తెలిసిందే.

క్వాలిఫైడ్‌ ఇనిస్టిట్యూషనల్‌ ప్లేస్‌మెంట్‌ ఆధారంగా రూ.3,000 కోట్లు సమీకరించినట్లు స్పైస్‌జెట్‌ సోమవారం వెల్లడించింది. దీనికి సంబంధించిన బిడ్‌ను సెప్టెంబర్‌ 16 తేదీన మొదలుపెట్టి 18వ తేదీన ముగించింది. ఈ క్యూఐపీ ఓవర్‌ సబ్‌స్క్రైబ్‌ అయినట్లు వెల్లడించింది. ప్రముఖ ఇన్వెస్టర్ల నుంచి తమకు నిధులు సమకూరినట్లు తెలిపింది. ఈ మొత్తం కాకుండా గతంలో ఫండింగ్‌ రౌండ్‌ నుంచి మరో రూ.736 కోట్లు వచ్చినట్లు పేర్కొంది.

Read Also: Dissanayake : శ్రీలంక నూతన అధ్యక్షుడికి ప్రధాని మోడీ, మల్లికార్జున ఖర్గేలు శుభాకాంక్షలు