Site icon HashtagU Telugu

No Income Tax: రూ. 17 లక్షల జీతం కూడా పన్ను రహితమే.. మీరు చేయాల్సింది ఇదే!

ITR Filing

ITR Filing

No Income Tax: 2025-26 కేంద్ర బడ్జెట్‌లో రూ. 12 లక్షల వరకు వార్షిక ఆదాయం పన్ను రహితం (No Income Tax) చేసిన విష‌యం తెలిసిందే. కానీ, మీ కంపెనీ మీ జీతం నిర్మాణాన్ని మార్చినట్లయితే కొన్ని అలవెన్సులను పొందడం ద్వారా ఈ ఆదాయ పరిమితిని రూ. 17 లక్షలకు పెంచవచ్చు. ఆదాయపు పన్ను చట్టం ప్రకారం.. కొత్త పన్ను విధానంలో కొన్ని అలవెన్సులు పన్ను పరిధిలో లేవు. అయితే, నిర్దేశించిన షరతుల మేర‌కు ఈ ఆదాయం ప‌న్ను ర‌హితం అవుతుంది. జీతం నిర్మాణంలో మార్పు FY 26లో మీ వార్షిక ఆదాయాన్ని దాదాపు రూ. 17 లక్షలకు ఎలా పన్ను లేకుండా చేయగలదో తెలుసుకుందాం.

ఎకనామిక్ టైమ్స్ నివేదిక ప్రకారం.. కొత్త పన్ను విధానంలో ఆదాయపు పన్ను చట్టంలో పన్ను చెల్లింపుదారులు వారి జీత నిర్మాణాన్ని పునర్నిర్మించడంలో సహాయపడే కొన్ని అలవెన్సులు ఉన్నాయ‌ని తెలిపింది. కొన్ని షరతులు నెరవేరినట్లయితే ఈ అలవెన్సులు పన్ను రహితంగా ఉంటాయి. పన్ను ఆదా చేయడంలో మీకు సహాయపడే కొన్ని రీయింబర్స్‌మెంట్‌లు, అలవెన్సులు క్రింది విధంగా ఉన్నాయి.

Also Read: ODI Batting Rankings: ఐసీసీ వ‌న్డే ర్యాంకింగ్స్ ఇవే.. కోహ్లీ ఎన్నో ర్యాంక్‌లో ఉన్నాడంటే?

టెలిఫోన్, మొబైల్ బిల్లులు

జీతం పొందే ఉద్యోగి అతను చెల్లించిన టెలిఫోన్, మొబైల్ బిల్లులపై మినహాయింపును క్లెయిమ్ చేయవచ్చు. దీనికి పరిమితి లేదు. ఏ పన్ను విధానంలోనైనా టెలిఫోన్, ఇంటర్నెట్ బిల్లుల మినహాయింపుకు సంబంధించి ఎటువంటి పరిమితిని నిర్ణయించలేదని పన్ను కన్సల్టింగ్ సంస్థ నాంగియా అండర్సన్ ఎల్‌ఎల్‌పి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ యోగేష్ కాలే పేర్కొన్నట్లు ET నివేదిక పేర్కొంది. అయితే, ఉద్యోగులు సహేతుకమైన మొత్తాన్ని మాత్రమే క్లెయిమ్ చేయాలి. ఉద్యోగులు తమ జీతం నిర్మాణాన్ని టెలిఫోన్, మొబైల్, ఇంటర్నెట్ బిల్లులను చేర్చినట్లయితే ఈ చర్య వారి పన్ను బాధ్యతను తగ్గించవచ్చు.

రవాణా భత్యం

ఆదాయపు పన్ను చట్టం కింద వికలాంగులకు పన్ను రహిత రవాణా భత్యం కోసం నిబంధన ఉంది. ఉద్యోగి ఇంటి నుండి కార్యాలయానికి, కార్యాలయం నుండి ఇంటికి ప్రయాణించేటప్పుడు అయ్యే ఖర్చులను క్లెయిమ్ చేయవచ్చు. వికలాంగ ఉద్యోగులకు ఇచ్చే ట్రాన్స్‌పోర్ట్ అలవెన్స్‌లో నెలకు రూ.3,200 లేదా సంవత్సరానికి రూ.38,400 వరకు రాయితీ లభిస్తుందని తెలుస్తోంది.

ట్రావెల్ అల‌వెన్స్

ఇది ఉద్యోగులకు వారి పని కోసం యజమాని కల్పించే సౌకర్యం. ఇది వికలాంగ ఉద్యోగులకు అందించే రవాణా భత్యం నుండి వేరుగా ఉంటుంది. వర్క్ ప్లేస్‌కు వెళ్లేటప్పుడు ఈ ఖర్చు చేస్తే ఉద్యోగి అందుకున్న రవాణా రీయింబర్స్‌మెంట్ పన్ను రహితంగా ఉంటుందని తెలుస్తోంది. రీయింబర్స్‌మెంట్ క్లెయిమ్ చేయడానికి ఉద్యోగి బిల్లును సమర్పించాల్సి ఉంటుంది. కాబట్టి 2026 ఆర్థిక సంవత్సరంలో రూ. 12 లక్షల వరకు వార్షిక జీతం ఆదాయం పన్ను రహితం అయితే మీరు ఈ పన్ను విధానాన్ని అనుసరిస్తే రూ. 16,64,959 వరకు ఉన్న మీ మొత్తం జీతం పన్ను రహితంగా ఉంటుంది.

Exit mobile version