Site icon HashtagU Telugu

Mutual Fund : ఈక్విటీల్లో కొత్త స్కీమ్స్ లాంచ్..లిస్ట్‌లో చేరిన టాటా ఫండ్..సబ్‌స్క్రిప్షన్ డేట్ ఫిక్స్!

Mutual Fund

Mutual Fund

ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసే వారికి అలర్ట్. ఈ వారం ఈక్విటీల్లో ఏకంగా 11 కొత్త ఫండ్స్ లాంచ్ అయ్యాయి. వాటితో పాటు టాటా కంపెనీ నుంచి 1 ఎస్ఐఫ్ స్కీమ్ వచ్చింది. మరి ఏ ఏఎంసీ నుంచి ఏ స్కీమ్ లాంచ్ అయింది, ఏ కేటగిరీలో ఉన్నాయి, సబ్‌స్క్రిప్షన్ ఎప్పుడు ముగుస్తుంది? అనే వివరాలు ఈ స్టోరీ ద్వారా తెలుసుకుందాం.

మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్లకు మంచి అవకాశం. ప్రస్తుతం 11 మ్యూచువల్ ఫండ్ పథకాలు, ఒక ఎస్ఐఎఫ్ స్కీమ్ లాంచ్ అయ్యాయి. ఇందులో ఇన్వెస్ట్ చేస్తేందుకు సబ్‌స్క్రిప్షన్ చేసుకోవచ్చు. అసెట్ మేనేజ్మెంట్ కంపెనీలు తమ ప్రస్తుత ఆఫరింగ్స్‌లోని ఖాళీలను భర్తీ చేసేందుకు కొత్త ఫండ్స్ లాంచ్ చేశాయి. ప్రస్తుతం 4 ఇండెక్స్ ఫండ్స్ సబ్‌స్క్రిప్షన్ కోసం వచ్చాయి. అందులో కోటక్ నిఫ్టీ 500 మూమెంటమ్ 50 ఇండెక్స్ ఫండ్, నావీ నిఫ్టీ మిడ్ స్మాల్ క్యాప్ 400 ఇండెక్స్ ఫండ్ సబ్‌స్క్రిప్షన్ డిసెంబర్ 4, 5 తేదీల్లో ముగియనుంది. ఇక డిఎస్‌పీ నిఫ్టీ మిడ్ క్యాప్ 150 ఇండెక్స్ ఫండ్, డీఎస్‌పీ నిఫ్టీ స్మాల్ క్యాప్ 250 ఇండెక్స్ ఫండ్ సబ్‌స్క్రిప్షన్ డిసెంబర్ 8వ తేదీతో ముగియనుంది.

డీఎస్‌పీ నిఫ్టీ స్మాల్ క్యాప్ 250 ఈటీఎఫ్, డీఎస్‌పీ నిఫ్టీ మిడ్ క్యాప్ 150 ఈటీఎఫ్ ఫండ్ సబ్‌స్క్రిప్షన్ డిసెంబర్ 8వ తేదీన ముగుస్తున్నాయి. ఇక ఫండ్ ఆఫ్ ఫండ్ కేటగిరీలో మహీంద్రా మాన్యూలైఫ్ ఇన్‌కమ్ ప్లాస్ ఆర్బిట్రేజ్ యాక్టిన్ ఫండ్ ఆఫ్ ఫండ్, యాక్సిస్ మల్టీ అసెట్ యాక్టివ్ ఫండ్ ఆఫ్ ఫండ్ సబ్‌స్క్రిప్షన్ తేదీల వరుసగా డిసెంబర్ 1, డిసెంబర్ 5వ తేదీల్లో ముగుస్తున్నాయి. ఇక మల్టీ అసెంట్ అలొకేషన్ కేటగిరీ నుంచి వెల్త్ కంపెనీ మల్టీ అసెట్ అలొకేషన్ ఫండ్ సబ్‌స్క్రిప్షన్ డిసెంబర్ 3వ తేదీతో ముగుస్తోంది.

సెక్టోరల్ ఫండ్ కేటగిరీలో మీరే అసెట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ సబ్‌స్క్రిప్షన్ డిసెంబర్ 1తోనే ముగియనుంది. ఫిక్స్‌డ్ మెచ్యూరిటీ ప్లాన్‌లో డీఎస్‌పీ ఎఫ్ఎంపీ 277-789 డీ ఫండ్ సబ్‌స్క్రిప్షన్ డిసెంబర్ 1న ముగుస్తుంది. వీటితో పాటుగా ఒక ఎస్ఐఎఫ్ (స్పెషలైజ్డ్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్) వచ్చింది. టాటా మ్యూచువల్ ఫండ్ నుంచి ఈ కేటగిరీలో తొలిసారి లాంచ్ చేసింది.అదే టైటానియం హైబ్రిడ్ లాంగ్ షార్ట్ ఫండ్. ఈ స్కీమ్ సబ్‌స్క్రిప్షన్ డిసెంబర్ 8వ తేదీతో ముగియనుంది.

ఈ కథనం కేవలం ఇన్వెస్టర్లకు న్యూ ఫండ్ ఆఫర్స్ గురించిన సమాచారం అందించేందుకే తప్పితే ఎలాంటి పెట్టుబడులు పెట్టాలని ప్రోత్సహించేందుకు కాదు. మ్యూచువల్ ఫండ్స్‌లోనూ హైరిస్క్ ఉంటుంది. చాలా ఫండ్స్ మార్కెట్ ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. అలాగే కొత్త ఇన్వెస్టర్లు న్యూ ఫండ్ ఆఫర్స్‌కి దూరంగా ఉండడమే మంచిదని మార్కెట్ నిపుణులు సూచిస్తుంటారు. ఏదైనా స్కీమ్ ఎంచుకునే ముందు దాని గురించి పూర్తి వివరాలు తెలుసుకుని, నిపుణుల సలహాలతోనే ఇన్వెస్ట్ చేయాలి. మ్యూచువల్ ఫండ్స్‌లో షార్ట్ టర్మ్ గెయిన్స్ అంతగా కనిపించవు.

Exit mobile version