New Rules: వచ్చే నెల ఒకటో తేదీ నుంచి అంటే జూలై 1వ తేదీ నుంచి ప్రజల అవసరాలకు సంబంధించి 5 నిబంధనల్లో మార్పులు (New Rules) చోటుచేసుకుంటున్నాయి. ఈ మార్పులు సామాన్యుల జేబులపై ప్రభావం చూపనున్నాయి. మారనున్న రూల్స్‌లో వంట గ్యాస్ నుంచి బ్యాంకుల్లో ఎఫ్‌డీగా డిపాజిట్ చేసిన మొత్తం వరకు ఉంటాయి.
LPG సిలిండర్ ధర మారుతుంది
ఎల్‌పిజి సిలిండర్ కొత్త ధర ప్రతి నెలా మొదటి తేదీన విడుదల అవుతుంది. ఈ ధర తక్కువ లేదా ఎక్కువ కావచ్చు. లేదా అందులో ఎలాంటి మార్పు ఉండదు. కానీ పెట్రోలియం కంపెనీలు వీటన్నింటికీ సంబంధించి అప్‌డేట్‌లు జారీ చేయాల్సి ఉంటుంది. జులై 1న కూడా డొమెస్టిక్ ఎల్‌పీజీ సిలిండర్లలో మార్పు ఉండవచ్చు. ఈ మార్పు చమురు మార్కెటింగ్ కంపెనీలు నిర్ణయిస్తారు. ఈ ధరలు గృహ, వాణిజ్య సిలిండర్‌లకు వర్తిస్తుంది.
DBI బ్యాంక్ ప్రత్యేక FD పథకం
IDBI బ్యాంక్ కస్టమర్లకు 300 రోజులు, 375 రోజులు, 400 రోజుల ప్రత్యేక FD పథకాలను అందిస్తోంది. ఈ FD పథకంపై బ్యాంక్ 7.75 శాతం వరకు వడ్డీని ఇస్తోంది. ఈ పథకం ప్రయోజనాన్ని జూన్ 30 వరకు పొందవచ్చు. బ్యాంక్ ఈ FD స్కీమ్‌కి ఉత్సవ్ స్కీమ్ అని పేరు పెట్టింది. దీని తర్వాత బ్యాంక్ ఈ పథకాన్ని మూసివేస్తుంది.
ఇండియన్ బ్యాంక్ ప్రత్యేక FD
ఇండియన్ బ్యాంక్ కస్టమర్లకు ప్రత్యేక ఎఫ్‌డి కూడా ఇస్తోంది. ఈ FD 300, 400 రోజుల ప్రత్యేక ఎఫ్‌డీలను అందిస్తోంది. వాటి పేర్లు ఇండ్ సూపర్ 400, ఇండ్ సుప్రీం 300. ఈ ఎఫ్‌డీలపై బ్యాంక్ 7.05 శాతం నుంచి 7.80 శాతం వడ్డీని ఇస్తోంది. ఇండ్ సూపర్ 400 పథకం కింద రూ. 10 వేల నుంచి రూ. 2 కోట్ల వరకు పెట్టుబడి పెట్టవచ్చు. ఈ రెండు పథకాలలో పెట్టుబడి పెట్టడానికి చివరి తేదీ జూన్ 30.
Also Read: Leader of the Opposition : ప్రతిపక్ష నేతగా రాహుల్‌గాంధీ.. ఏయే పవర్స్ ఉంటాయో తెలుసా ?
పంజాబ్, సింధ్ బ్యాంక్ ప్రత్యేక FD పథకం
పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ కూడా ఎఫ్‌డిపై ప్రత్యేక పథకాన్ని తీసుకొచ్చింది. ఈ పథకం 222, 333, 444 రోజులు. ఈ పథకాల్లో పెట్టుబడిపై 8.05 శాతం వరకు వడ్డీ ఇస్తారు. 222 రోజుల ఎఫ్‌డిపై 7.05 శాతం, 333 రోజుల ఎఫ్‌డిపై 7.10 శాతం, 444 రోజుల ఎఫ్‌డిపై 7.25 శాతం వడ్డీ ఇస్తారు. సీనియర్ సిటిజన్లకు 444 రోజుల ఎఫ్‌డిపై 8.05 శాతం వడ్డీ ఇస్తారు. ఈ పథకాలలో పెట్టుబడికి చివరి తేదీ కూడా జూన్ 30.
We’re now on WhatsApp : Click to Join
క్రెడిట్ కార్డ్ బిల్లుపై కొత్త నిబంధనలు
జూలై 1 నుంచి క్రెడిట్ కార్డ్ బిల్లు చెల్లింపునకు సంబంధించిన నిబంధనలు కూడా మారుతున్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఈ నిబంధనలలో మార్పులు చేసింది. ఈ నిబంధనల ప్రకారం.. ఇప్పుడు PhonePe, Cred మొదలైన కంపెనీలు భారత్ బిల్ చెల్లింపు వ్యవస్థ (BBPS)లో నమోదు చేసుకోవాలి. ఆ తర్వాత క్రెడిట్ కార్డ్ వినియోగదారులు ఈ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా క్రెడిట్ కార్డ్ బిల్లులను చెల్లించగలరు. జూన్ 30 నాటికి ఈ ప్లాట్‌ఫారమ్‌లో నమోదు చేసుకోని కంపెనీలు తమ క్రెడిట్ కార్డ్ బిల్లులను చెల్లించలేవు. అయితే, ఆన్‌లైన్ బిల్లు చెల్లింపు క్రెడిట్ కార్డ్ వెబ్‌సైట్ లేదా యాప్‌లో కొనసాగుతుంది.