Site icon HashtagU Telugu

2 Lakhs Loan Limit : ఇక కొత్త లోన్ లిమిట్.. అంతకుమించి లోన్ ఇవ్వరు!

Micro Finance Loan Limit

2 Lakhs Loan Limit :  మైక్రో ఫైనాన్స్‌ కంపెనీల నియంత్రణ సంస్థ పేరు ‘ఎంఫిన్’. ఎంఫిన్ అంటే.. మైక్రో ఫైనాన్స్‌ ఇండస్ట్రీ నెట్‌వర్క్‌. ఎంఫిన్ ఏ రూల్‌ను అమల్లోకి తెస్తే.. దాన్ని కచ్చితంగా మైక్రో ఫైనాన్స్ కంపెనీలు పాటించాల్సి ఉంటుంది. ఈక్రమంలో ఇటీవలే ఎంఫిన్ కొన్ని కీలక మార్గదర్శకాలను జారీ చేసింది. అవి ఏమిటంటే.. మైక్రో ఫైనాన్స్‌ కంపెనీలు(Micro Finance Companies) ఒక వ్యక్తికి రూ.2 లక్షలకు మించి అప్పు ఇవ్వకూడదు. ఒక వ్యక్తికి 1 నుంచి 4 ఆర్థిక సంస్థలు మాత్రమే లోన్లు ఇవ్వాలి. ఈ అన్ని సంస్థల లోన్లు కలిపితే రూ.2 లక్షలకు(2 Lakhs Loan Limit) మించకూడదు. ఇంతకీ ఈ మార్గదర్శకాలను ఎంఫిన్ ఎందుకు జారీ చేసిందో ఇప్పుడు తెలుసుకుందాం..

We’re now on WhatsApp. Click to Join

చాలా మైక్రో ఫైనాన్స్‌ కంపెనీలు ఇష్టారాజ్యంగా రుణాలు మంజూరు చేస్తున్నాయి. దీనివల్ల వాటిని తీసుకున్న ప్రజలపై అప్పుల భారం ఒక్కసారిగా పెరిగిపోతోంది. అయితే అదే సమయంలో వారి ఆదాయం అంత భారీగా పెరగడం లేదు. ఫలితంగా ఆ అప్పులను ఏకకాలంలో తిరిగి చెల్లించలేక రుణగ్రహీతలు నానా కష్టాలు పడుతున్నారు. ఒకటికి మించి తీసుకునే రుణాలను చాలామంది దుర్వినియోగం చేస్తున్నారు. ఆ డబ్బును అనవసర ఖర్చులకు వినియోగిస్తున్నారు. ఫలితంగా రుణంగా తీసుకున్న డబ్బుల వల్ల రుణగ్రహీతకు సరైన ప్రయోజనం చేకూరడం లేదు. సాధ్యమైనన్ని తక్కువ లోన్స్ ఇస్తే ఈవిధమైన దుబారాను ఆపొచ్చని ఎంఫిన్ భావించింది. అందుకే మైక్రో ఫైనాన్స్ కంపెనీలు ఒక వ్యక్తికి రూ.2 లక్షలకు మించి లోన్ ఇవ్వకూడదనే రూల్‌ను పెట్టింది.

Also Read :IRS Officer : ఐఆర్ఎస్ అధికారిణి సంచలన నిర్ణయం.. మహిళ నుంచి పురుషుడిగా మారిన వైనం