Site icon HashtagU Telugu

New Income Tax Slabs: రూ. 12 లక్షల నుంచి రూ. 50 లక్షల మధ్య ఆదాయంపై ఎంత పన్ను ఆదా అవుతుంది?

New Income Tax Slabs

New Income Tax Slabs

New Income Tax Slabs: సాధారణ బడ్జెట్ 2025 ఫిబ్రవరి 1న పార్లమెంట్‌లో ప్రవేశపెట్టారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ దేశం మొత్తం లెక్కలను ప్రజెంట్ చేస్తూ మధ్యతరగతి ప్రజలకు పెద్ద ఊరటనిచ్చారు. కొత్త ఆదాయపు పన్ను శ్లాబ్ New (Income Tax Slabs) ప్రయోజనం రూ. 12 లక్షల కంటే తక్కువ ఆదాయం ఉన్నవారికి అందుబాటులో ఉంది. అయితే కొత్త ఐటీ శ్లాబ్ ప్ర‌కారం పన్ను చెల్లింపుదారులు ఎంత ఆదా చేస్తారో ఇప్పుడు తెలుసుకుందాం.

కేంద్రంలోని మోదీ ప్రభుత్వం రూ.12 లక్షల వ‌ర‌కు ఇన్ క‌మ్ ట్యాక్స్ క‌ట్టాల్సిన అవ‌స‌రం లేద‌ని స్ప‌ష్టం చేసింది. కొత్త పన్ను విధానాన్ని అనుసరించే వ్యక్తులు పన్ను మినహాయింపు ప్రయోజనం పొందుతారు. అయితే పాత పన్ను విధానంపై ఎలాంటి ప్రకటన చేయలేదు. ఇలాంటి పరిస్థితిలో ప్రజలు ఇప్పుడు ఎంత ఆదాయంపై ఎంత పన్ను ఆదా అవుతుందో లెక్కించడంలో కాస్త గంద‌ర‌గోళంలో ఉన్నారు.

ఇప్పుడు మరింత డబ్బు ప్రజల చేతుల్లోకి వస్తుంది

పన్ను చెల్లింపుదారులు ఆదాయపు పన్ను సెక్షన్ 87A కింద పన్ను మినహాయింపు పొందుతారు. 12 లక్షల వరకు ఆదాయం పన్ను రహితం అయిన తర్వాత ఇప్పుడు ప్రజల చేతుల్లో ఎక్కువ డబ్బు ఉంటుంది. అయితే రూ. 13 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ ఆదాయం పన్ను పే చేయాల్సి ఉంటుంది.

Also Read: Congress MLAS Issue : రహస్య భేటీ వార్తలు అవాస్తవం – ఎమ్మెల్యేల క్లారిటీ

12 లక్షల ఆదాయంపై 80 వేల పన్ను ఆదా అవుతుంది

రూ.12 లక్షల వరకు ఆదాయంపై రూ.80 వేలు ఆదా అవుతుంది. రూ.16 లక్షల ఆదాయంపై రూ.50 వేలు, రూ.20 లక్షల ఆదాయంపై రూ.90 వేలు, రూ.24 లక్షల ఆదాయంపై రూ.1.10 లక్షలు, రూ.50 లక్షల ఆదాయంపై రూ.1.10 లక్షలు ఆదా అవుతాయి.

ఎంత ఆదాయంపై ఎంత పన్ను ఆదా?

కేంద్ర ప్ర‌భుత్వం తాజాగా ప్ర‌క‌టించిన కొత్త ఐటీ శ్లాబ్ ప్ర‌కారం ఎంత ఆదాయంపై ఎంత ప‌న్ను ఆదా అవుతుంది అనే విష‌యం తెలుసుకుందాం.

రూ. 12 ల‌క్ష‌ల్లోపు ఆదాయం ఉంటే ప‌న్ను క‌ట్టాల్సిన అవ‌ర‌సంలేదు. అలాగే రూ. 80 వేలు ఆదా చేసుకోవ‌చ్చు. రూ. 16 ల‌క్ష‌ల్లోపు ఆదాయం ఉంటే రూ. 1.20 ల‌క్షల ప‌న్ను క‌ట్టాల్సి ఉంటుంది. అలాగే రూ. 50 వేలు ఆదా చేసుకోవ‌చ్చు. రూ. 20 ల‌క్ష‌ల్లోపు ఆదాయం ఉంటే రూ. 2 ల‌క్ష‌ల ప‌న్ను చెల్లించాల్సి ఉంటుంది. అలాగే రూ. 90 వేలు ఆదా చేసుకోవ‌చ్చు. రూ. 24 ల‌క్ష‌ల్లోపు ఆదాయం ఉంటే రూ. 3 ల‌క్ష‌ల ప‌న్ను క‌ట్టాల్సి ఉండ‌గా.. రూ. 1.10 ల‌క్ష‌లు సేవ్ చేసుకోవ‌చ్చు. రూ. 50 ల‌క్ష‌ల్లోపు ఆదాయం ఉంటే రూ. 10.80 ల‌క్ష‌ల ప‌న్ను చెల్లించాల్సి వ‌స్తుంది. వీరు కూడా రూ. 1.10 ల‌క్ష‌లు సేవ్ చేసుకోవ‌చ్చు.

Exit mobile version