Site icon HashtagU Telugu

New EPFO Rules: పీఎఫ్ అకౌంట్ ఉన్న‌వారికి శుభ‌వార్త‌.. ఇక‌పై!

PF Money

PF Money

New EPFO Rules: ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (New EPFO Rules) ఉద్యోగుల డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ స్కీమ్ (EDLI)లో అనేక ముఖ్యమైన మార్పులను ప్రకటించింది. EPF సభ్యులకు కనీస జీవిత బీమా ప్రయోజనాన్ని అమలు చేయడం ప్రధాన మార్పులలో ఒకటి. దీని కింద ఇటీవల ఉద్యోగంలో చేరి ఏడాది సర్వీసులోపు మరణించిన ఉద్యోగులు కూడా బీమా ప్రయోజనం పొందుతారు. మరణించిన EPF సభ్యుల కుటుంబాలకు ఆర్థిక రక్షణను బలోపేతం చేయడం దీని లక్ష్యం. ఫిబ్రవరి 28, 2025న జరిగిన సమావేశంలో ప్రకటించిన ఈ మార్పులు బీమా చెల్లింపులను పెంచడం, కవరేజీని విస్తరించడం ద్వారా ఏటా వేలాది కుటుంబాలకు ప్రయోజనం చేకూరుస్తాయని భావిస్తున్నారు.

లక్షలాది మంది ఉద్యోగులు, వారి కుటుంబాలకు ప్రయోజనం

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ (CBT) సమావేశంలో ఈ నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సమావేశానికి కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్సుఖ్ మాండవ్య అధ్యక్షత వహించారు. దీనితో పాటు EPF ఖాతాదారులకు 8.25% వార్షిక వడ్డీ రేటు కూడా సిఫార్సు చేశారు. ఈ మార్పులు లక్షలాది మంది ఉద్యోగులు, వారి కుటుంబాలకు నేరుగా ప్రయోజనం చేకూరుస్తాయి.

Also Read: Rohit- Kohli Retirement: కోహ్లీ, రోహిత్ రిటైర్ కాబోతున్నారా? గిల్ ఏమ‌న్నాడంటే!

తక్కువ వ్యవధి పనిచేసే వారికి కూడా ప్రయోజనాలు

ఇంతకుముందు ఒక ఉద్యోగి ఒక సంవత్సరం సర్వీస్ పూర్తి కాకముందే మరణిస్తే అతని కుటుంబానికి ఎటువంటి బీమా ప్రయోజనం ఉండేది కాదు. కానీ ఇప్పుడు ఈ నిబంధనను మార్చారు. ఇప్పుడు ఒక ఉద్యోగి ఏడాదిలోపు మరణిస్తే అతని కుటుంబానికి రూ.50,000 బీమా లభిస్తుంది. ఈ నిర్ణయం ప్రతి సంవత్సరం 5,000 కుటుంబాలకు పైగా ప్రయోజనం పొందుతుంది. ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ (EPF)లో ఎంప్లాయీ డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ (EDLI) ఉంటుంది. ఇది ముఖ్యమైన సామాజిక భద్రతా ప్రయోజనంగా పనిచేస్తుంది. ఈ కార్యక్రమం EPF సభ్యులు తన ఉద్యోగ సమయంలో దురదృష్టవశాత్తు మరణించిన సందర్భంలో వారిపై ఆధారపడిన వారికి ఆర్థిక సహాయం అందిస్తుంది.

ఉద్యోగం మారిన తర్వాత కూడా బీమా ప్రయోజనం

ఈపిఎఫ్‌ఓ నిరంతర సర్వీసు సమయంలో ఉద్యోగాన్ని విడిచిపెట్టి మరో ఉద్యోగం పొందడం మధ్య ఉన్న అంతరానికి సంబంధించి తన విధానాన్ని కూడా సవరించింది. పాత నిబంధన ప్రకారం ఉద్యోగాలు మారేటప్పుడు ఒకటి లేదా రెండు రోజులు గ్యాప్ ఉంటే వారి కుటుంబాలు EDLI ప్రయోజనం పొందడానికి అనర్హులుగా ప్ర‌క‌టించేవారు. అయితే ఇప్పుడు ఈ నిబంధనను సులభతరం చేశారు. రెండు ఉద్యోగాల మధ్య 2 నెలల వరకు గ్యాప్ ఉన్నప్పటికీ ఉద్యోగి సర్వీస్ నిరంతరంగా లెక్క‌లోకి వ‌స్తుంది. అంటే ఉద్యోగులు వెంటనే మరో ఉద్యోగంలో చేరకపోయినా రూ. 2.5 లక్షల నుండి రూ. 7 లక్షల వరకు బీమా ప్రయోజనాలను పొందుతారు. ఈ మార్పు ప్రతి సంవత్సరం 1,000 కంటే ఎక్కువ మంది ఉద్యోగుల కుటుంబాలకు ప్రయోజనం చేకూరుస్తుంది.

పీఎఫ్ జమ చేయడంలో జాప్యంపై ఉపశమనం

ఇంతకు ముందు కంపెనీ ఉద్యోగుల పీఎఫ్‌ను సకాలంలో జమ చేయకపోతే భారీ జరిమానా చెల్లించాల్సి వచ్చేది. ఇప్పుడు ఈ నిబంధనను కూడా మార్చారు. ఇప్పుడు PF డిపాజిట్ చేయడంలో జాప్యంపై నెలకు 1% జరిమానా విధించబడుతుంది. ఇది కంపెనీలకు ఉపశమనం కలిగిస్తుంది.