Site icon HashtagU Telugu

Coffee Day : కాఫీ డేకు భారీ ఊరట.. దివాలా చర్యలను ఆపాలంటూ ఆదేశాలు

Coffee Day Insolvency Nclat

Coffee Day :  కాఫీ డే ఎంటర్‌ప్రైజెస్‌‌కు భారీ ఊరట దక్కింది. ఆ కంపెనీపై దివాలా చర్యలకు సంబంధించి నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్‌(ఎన్‌సీఎల్‌టీ) ఇచ్చిన ఆర్డర్స్‌పై చెన్నైకు చెందిన నేషనల్ కంపెనీ లా అప్పిలేట్‌ ట్రిబ్యునల్‌ బుధవారం స్టే విధించింది. ఈ ఆదేశాలతో  కాఫీ డే దివాలా ప్రక్రియ తాత్కాలికంగా నిలిచిపోయింది. కంపెనీ సీఈఓ మాళవిక క్రిష్ణ హెగ్డే దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన అప్పీలేట్‌ ట్రైబ్యునల్‌, ఎన్‌సీఎల్‌‌టీ ఇచ్చిన ఉత్తర్వులపై స్టే విధించింది. ఈమేరకు ఇవాళ  మధ్యంతర ఉత్తర్వులను వెలువరించింది. కేఫ్ కాఫీ డే పేరుతో రిటైల్‌ చైన్‌ను కాఫీ డే ఎంటర్‌ప్రైజెస్‌(Coffee Day) నిర్వహిస్తోంది.

We’re now on WhatsApp. Click to Join

అంతకుముందు ఐడీబీఐ ట్రస్టీ షిప్ సర్వీసెస్ లిమిటెడ్‌కు కాఫీ డే రూ.228.45 కోట్లు చెల్లించలేదంటూ నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్‌ బెంగళూరు బెంచ్‌ వద్ద పిటిషన్ దాఖలైంది. దాన్ని విచారించిన బెంచ్ కాఫీ డేపై దివాలా చర్యలను ప్రారంభించాలని ఆర్డర్ ఇచ్చింది. ఈ ప్రక్రియ సజావుగా సాగేలా మధ్యవర్తిని ఏర్పాటు చేయాలని నిర్దేశించింది. తాజాగా చెన్నైకు చెందిన నేషనల్ కంపెనీ లా అప్పిలేట్‌ ట్రిబ్యునల్‌ మధ్యంతర ఉత్తర్వులతో దివాలా చర్యలు ఆగిపోయాయి.

Also Read :WFI President: వినేష్ ఫోగట్‌కు శుభవార్త.. WFI కీల‌క ప్రకటన..!

Also Read :Soaked Dates: ప్రతిరోజు నానబెట్టిన ఖర్జూరం తింటే ఏం జరుగుతుందో మీకు తెలుసా?