Reliance Loan : జీవితం అన్నాక.. ఎవరైనా సరే అవసరానికి అప్పులు చేయక తప్పదు!! చివరకు మన దేశంలోనే సంపన్నుడైన ముకేశ్ అంబానీ అయినా సరే!! ఔను.. రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ రూ.25,500 కోట్ల అప్పు చేయబోతున్నారు. సాధ్యమైనంత తక్కువ వడ్డీరేటుతో ఈ లోన్‌ను ఇవ్వగలిగే విదేశీ బ్యాంకు కోసం ప్రస్తుతం ముకేశ్ అంబానీ అన్వేషిస్తున్నారు. దాదాపు 6 విదేశీ బ్యాంకులతో ఇప్పటికే చర్చలు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. 2025 సంవత్సరం మార్చికల్లా ఈ లోన్ మంజూరవుతుందనే అంచనాలు వెలువడుతున్నాయి.
Also Read :Human Rights Day 2024 : మానవ హక్కులకు జై.. సామాజిక అసమానతలకు నై
లోన్ ద్వారా లభించనున్న డబ్బుతో ఇప్పటికే రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు ఉన్న పాత అప్పులు, బకాయీలను తీర్చేయాలని ముకేశ్ భావిస్తున్నారట. రిలయన్స్ ఇండస్ట్రీస్ దాదాపు రూ.24వేల కోట్ల అప్పులు ఉన్నట్లు సమాచారం. అంటే.. ఆ అప్పులన్నీ తీర్చేసే ప్లాన్ రిలయన్స్ ఇండస్ట్రీస్ అధిపతి ఉన్నారు. గత సంవత్సరం కూడా రిలయన్స్ ఇండస్ట్రీస్ విదేశీ బ్యాంకుల నుంచి ఆఫ్ షోర్ లోన్ తీసుకుంది. అప్పట్లో విదేశాల్లోని దాదాపు 55 బ్యాంకులు కలిసి రిలయన్స్‌కు దాదాపు రూ.700 కోట్ల లోన్ మంజూరు చేశాయి.
Also Read :Nagarjuna Sagar 70 Years : 70వ వసంతంలోకి నాగార్జుసాగర్ డ్యాం.. నెహ్రూ చెప్పిన ‘‘ఆధునిక దేవాలయం’’ విశేషాలివీ
‘ఆఫ్ షోర్’ లోన్ అంటే ?
విదేశాల్లో ఉన్న ఆర్థిక సంస్థలు లేదా బ్యాంకుల నుంచి కంపెనీలు లోన్ తీసుకుంటే.. దాన్ని ‘ఆఫ్ షోర్’ లోన్ అంటారు. ఇది లాంగ్ టర్మ్ లోన్. చాలా ఎక్కువ ఏళ్ల పాటు దీన్ని చెల్లించే వెసులుబాటు ఉంటుంది. వడ్డీరేటు తక్కువగా ఉంటుంది. కంపెనీ వ్యాపార సామర్థ్యం, డైవర్సిఫికేషన్, ప్రస్తుత మార్కెట్ పరిస్థితి ఆధారంగా ఆఫ్ షోర్ లోన్‌లను బ్యాంకులు/ఆర్థిక సంస్థలు మంజూరు చేస్తాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్ క్యాపిటల్ విలువ దాదాపు రూ.17 లక్షల కోట్లు. ఇంత భారీ మార్కెట్ క్యాపిటల్ కలిగిన రిలయన్స్‌కు రూ.25వేల కోట్ల లోన్(Reliance Loan) అనేది చాలా చిన్నమాటే.