Mukesh Ambani: రిలయన్స్ ఇండస్ట్రీస్ (RIL) ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ముఖేష్ అంబానీ (Mukesh Ambani) ఫోర్బ్స్ 2025 జాబితా ప్రకారం.. భారతదేశంలోని 100 మంది అత్యంత ధనవంతుల జాబితాలో అగ్రస్థానంలో నిలిచారు. అయితే ఆయన మొత్తం నికర విలువ ప్రస్తుతం $105 బిలియన్లుగా ఉంది. ఇది గత ఏడాది కంటే 12 శాతం అంటే $14.5 బిలియన్లు తగ్గింది.
సంపద క్షీణతకు కారణాలు
ఇటీవలి కాలంలో రూపాయి బలహీనపడటం, సెన్సెక్స్‌లో 3 శాతం వరకు పతనం కారణంగా కేవలం ముఖేష్ అంబానీ సంపదే కాదు ఫోర్బ్స్ జాబితాలో ఉన్న 100 మంది అత్యంత ధనవంతులైన భారతీయుల మొత్తం సంపద కూడా 9 శాతం తగ్గి $1 ట్రిలియన్‌కు చేరుకుంది. ఈ జాబితా www.forbes.com/india, www.forbesindia.comలో అందుబాటులో ఉంది. ఈ జాబితా ఫోర్బ్స్ ఆసియా అక్టోబర్ ఎడిషన్‌లో కూడా ప్రచురించబడింది.
Also Read: Govt Job : ‘ప్రతి ఫ్యామిలీకి ప్రభుత్వ ఉద్యోగం’ చట్టం – తేజస్వి హామీ
రెండవ స్థానంలో గౌతమ్ అదానీ
జాబితాలో రెండవ స్థానంలో మౌలిక సదుపాయాల రంగంలో వ్యాపార దిగ్గజం గౌతమ్ అదానీ ఉన్నారు. ఆయన మొత్తం నికర విలువ $92 బిలియన్లు. 2023లో హిండెన్‌బర్గ్ నివేదిక వెలువడిన తరువాత షేర్లలో భారీ పతనం నుంచి అదానీ గ్రూప్ వ్యవస్థాపకుడు, ఛైర్మన్ గౌతమ్ అదానీకి సెప్టెంబర్ 2025లో ఉపశమనం లభించింది. ఎందుకంటే మార్కెట్ రెగ్యులేటర్ సెబీ (SEBI) అమెరికన్ షార్ట్ సెల్లర్ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ చేసిన మోసపూరిత లావాదేవీల ఆరోపణలను నిర్ధారించలేకపోయాము అని ప్రకటించింది. హిండెన్‌బర్గ్ నివేదికలో చేసిన ఆరోపణల కారణంగా 2023లో అదానీ గ్రూప్ కంపెనీల షేర్లలో భారీ అమ్మకాలు జరిగాయి.
జాబితాలో మరికొందరు ప్రముఖులు
జాబితాలో మరికొందరు ప్రముఖుల వివరాలు ఈ విధంగా ఉన్నాయి.
- రాధాకిషన్ దమానీ కుటుంబం: $28.2 బిలియన్ల సంపదతో ఆరవ స్థానంలో ఉన్నారు.
- దిలీప్ సంఘ్వి: $26.3 బిలియన్ల సంపదతో ఏడవ స్థానంలో ఉన్నారు.
- బజాజ్ కుటుంబం: $21.8 బిలియన్ల నికర విలువతో ఎనిమిదవ స్థానంలో ఉంది.
- సైరస్ పూనావాలా: $21.4 బిలియన్ల సంపదతో తొమ్మిదవ స్థానంలో ఉన్నారు.
- కుమార్ బిర్లా: $20.7 బిలియన్ల నికర విలువతో పదవ స్థానంలో ఉన్నారు.
