Site icon HashtagU Telugu

Mukesh Ambani: ముఖేష్ అంబానీకి భారీ షాక్‌.. ఒక్క‌రోజే రూ. 9200 కోట్ల న‌ష్టం..!

Mukesh Ambani

Mukesh Ambani

Mukesh Ambani: ఆసియాలోనే అత్యంత సంపన్నుడైన వ్యాపారవేత్త ముఖేష్ అంబానీ (Mukesh Ambani) కుమారుడు అనంత్ అంబానీ పెళ్లికి వేల కోట్లు వెచ్చించడం ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఒక అంచనా ప్రకారం వారి పెళ్లికి దాదాపు రూ. 6500 వేల కోట్లు ఖర్చయ్యాయని స‌మాచారం. ముఖేష్ అంబానీ సంపద గురించి అందరికీ తెలుసు. అయితే ఇంతలో అతనికి ఓ పెద్ద షాక్ తగిలింది. మంగళవారం ఒక్కరోజే ముఖేష్ అంబానీకి రూ.9200 కోట్ల నష్టం వాటిల్లింది.

స్టాక్ మార్కెట్‌లో గందరగోళం నెలకొంది

నిజానికి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్‌లో చేసిన ప్రకటనల తర్వాత స్టాక్ మార్కెట్‌లో గందరగోళం నెలకొంది. ఆ తర్వాత స్టాక్‌ మార్కెట్‌లో భారీ పతనమైంది. సీతారామన్ లాంగ్ టర్మ్ (ఎల్‌టిసిజి), షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ (ఎస్‌టిసిజి) పన్నులను పెంచుతున్నట్లు ప్రకటించడంతో స్టాక్ మార్కెట్ నష్టాల్లో కూరుకుపోయింది. ఇది ముఖేష్ అంబానీ షేర్లపై ప్రత్యక్ష ప్రభావం చూపింది. తీవ్ర నష్టాలను చవిచూడాల్సి వచ్చింది.

ముఖేష్ అంబానీ నికర విలువలో ఇంత నష్టం

ఈ నష్టం ముఖేష్ అంబానీ నికర విలువపై పెద్ద ప్రభావం చూపింది. బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ గణాంకాలే ఇందుకు నిదర్శనం. సమాచారం ప్రకారం ముఖేష్ అంబానీ నికర విలువ 24 గంటల్లో తగ్గింది. డేటా ప్రకారం.. అతని ఆస్తిలో 1.10 బిలియన్ డాలర్లు అంటే రూ. 9200 కోట్ల నష్టం జరిగింది. ప్రస్తుతం ఆయన సంపద 112 బిలియన్ డాలర్లుగా మారింది. అయితే బుధవారం రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లలో స్వల్ప పెరుగుదల కనిపించింది. షేరు రూ.2,988 వద్ద ముగిసింది.

Also Read: YS Jagan Vs BJP : ఇక బీజేపీకి వ్యతిరేకంగా వైఎస్ జగన్ ? ఏపీలో మారనున్న సమీకరణాలు!

అదానీ గ్రూప్ లాభపడింది

అయితే మరోవైపు ఈ గందరగోళంలో అదానీ గ్రూప్‌కు కొంత లాభం వచ్చింది. అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ నికర విలువ 724 మిలియన్ డాలర్లు అంటే దాదాపు రూ.6060 కోట్లు పెరిగింది. సమాచారం ప్రకారం.. అతని సంపద 102 బిలియన్ డాలర్లకు పెరిగింది. దేశంలోనే అత్యంత సంపన్నుల జాబితాలో గౌతమ్ అదానీ రెండో స్థానంలో ఉన్నారు. నిజానికి బడ్జెట్ రోజున, స్టాక్ మార్కెట్‌లో లిస్టయిన అదానీ గ్రూప్ కంపెనీల షేర్లలో విపరీతమైన పెరుగుదల కనిపించింది. బుధవారం ఎన్‌ఎస్‌ఈలో అదానీ ఎంటర్‌ప్రైజెస్ షేరు రూ.2,968.80 వద్ద ముగిసింది. దీని ప్రభావం అదానీ నికర విలువపై కనిపించింది.

We’re now on WhatsApp. Click to Join.

AP: బీజేపీ శాసనసభాపక్ష నేతగా ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు, పార్టీ విప్‌గా ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి ఎంపికైన‌ట్లు స్పీకర్ అయ్యన్నపాత్రుడు వెల్లడించారు. వీరిద్దరి ఎంపికపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి లేఖ పంపినట్లు తెలిపారు. అసెంబ్లీలో ప్యానల్ స్పీకర్లుగా మండలి బుద్ధ ప్రసాద్, వరదరాజుల రెడ్డి, జ్యోతుల నెహ్రూ, కోళ్ల లలిత కుమారి, దాసరి సుధ, పి.విష్ణుకుమార్ రాజులను ఎంపిక చేసినట్లు ప్రకటించారు.

Exit mobile version