Site icon HashtagU Telugu

MIT World Peace University : ఇస్రో తో ఎంఐటి-డబ్ల్యూపియూ చరిత్ర

MIT-WPU created history with ISRO

MIT-WPU created history with ISRO

MIT World Peace University : గుర్తించదగిన ఒక విజయములో, ఎంఐటి వరల్డ్ పీస్ యూనివర్సిటి (ఎంఐటి-డబ్ల్యూపియూ), పూణె, వద్ద స్పేస్ టెక్నాలజి రిసెర్చ్ గ్రూప్ (ఎస్‎టిఈఆర్‎జి) తన మొట్టమొదటి స్పేస్ పేలోడ్, ఎస్‎టిఈఆర్‎జి-పి1.0 ను ప్రారంభించింది. ఇస్రో సహకారముతో విదేశాలలో ప్రారంభించబడిన పిఎస్‎ఎల్‎వి-సి60, ఈ పేలోడ్ విశ్వవిద్యాలయానికి ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలిచింది.  భారతదేశపు అంతరిక్ష పరిశోధన ప్రయత్నాలకు దోహదపడుతుంది.

ఎలెక్ట్రికల్ మరియు ఎలెక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ విభాగమునుండి విద్యార్థులు మరియు ఫాకల్టీలచే రూపొందించబడిన మరియు అభివృద్ధి చేయబడిన ఈ పేలోడ్, తన కాస్ట్-ఎఫెక్టివ్ అంతరిక్ష సాంకేతికతలో ఒక ముఖ్యమైన పురోగతిని సూచిస్తుంది. ఎంఐటి-డబ్ల్యూపియూ విద్యార్థులు చరిత్ర సృష్టించడములో ఫాకల్టి సభ్యులు మరియు ఎంఐటి-డబ్ల్యూపియూ యొక్క తిరుగులేని మద్ధతుతోపాటు ప్రొ. డా. మూర్తి చావలి యాదవ్ యొక్క నైపుణ్య మార్గదర్శనము కీలకపాత్ర పోషిస్తుండగా ఈ మిషన్ యొక్క విజయము ప్రతిభావంతులైన విద్యార్థుల సమిష్ఠి కృషి ఫలితంగా లభించింది.

ప్రొ. డా. మూర్తి చావలి యాదవ్, డీన్ ఆర్&డి, ఎంఐటి-డబ్ల్యూపియూ, విద్యార్థుల-నేతృత్వములోని ఈ ప్రయత్నముపై ఇలా వ్యాఖ్యానించారు. “పిఎస్‎ఎల్‎వి-సి60 పై సిఓటిఎస్-ఆధారిత ఏవియోనిక్స్ పరీక్షించే ఈ పేలోడ్, మా బృందము యొక్క చాతుర్యము మరియు చిత్తశుద్ధికి ఒక ప్రామాణికము. ఇది అంతరిక్ష సాంకేతికతలో యువ ప్రతిభ య్ ఒక్క సామర్థ్యాన్ని ప్రాధాన్యీకరిస్తుంది మరియు మా సంస్థకు ఒక గర్వకారణమైన క్షణం.” అన్నారు. వైఖరి నిర్ణయము కొరకు సిఓటిఎస్ ఎంఈఎంఎస్-ఆధారిత 9-యాక్సిస్ ఐఎంయూ సెన్సార్స్ మరియు ఏఆర్‎ఎం-ఆధారిత మైక్రోకంట్రోలర్స్ యొక్క పనితనాన్ని పరీక్షించుటకు, ఆధునిక డేటా ఫిల్ట్రేషన్ టెక్నిక్స్ నియోగించుటకు మరియు సరైన పనితీరు కొరకు అధిక-రెజల్యూషన్ డేటా సేకరణ మరియు నిల్వలను వినియోగించుటకు ఈ ఎస్‎టిఈఆర్‎జి-పి1.0 పేలోడ్ రూపొందించబడింది.

ముందుగా-తయారుచేయబడిన సర్క్యూట్స్ పై ఆధారపడకుండా, వ్యవస్థను విద్యార్థులు దేశీయంగా అభివృద్ధి చేశారు. “ముందుగా-తయారుచేయబడిన సర్క్యూట్స్ ను కొనుగోలు చేఅకుండా ఈ సిస్టమ్ అభివృద్ధి చేయబడింది. ధృఢమైన ఈ సిస్టమ్ వైఖరి (ఉపగ్రహము యొక్క విన్యాసము) నిర్ణయము మరియు వినూత్న ఫిల్టరింగ్ కొరకు ఒక అనుకూలమైన ప్రత్యామ్నాయాన్ని అందిస్తుంది.” అని డా. పారుల్ జాదవ్, ప్రోగ్రాం డైరెక్టర్ ఆఫ్ ఎలెక్ట్రికల్ అండ్ ఎలెక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, అన్నారు. “స్పేస్ టెక్నాలజి రిసెర్చ్ గ్రూప్ (ఎస్‎టిఈఆర్‎జి) విద్యార్థులు గత 38 వారాల నుండి ఈ పని కోసం పనిచేస్తున్నారు. అభివృద్ధి చేయబడిన పరిష్కారానికి మేము గర్విస్తున్నాము మరియు ఈ పరిశోధనను ముందుకు తీసుకెళ్తాం,” అని ఆమె చెప్పుకొచ్చారు.

విశ్వవిద్యాలయము విద్యార్థి, అచింత్య చావరె, ప్రాజెక్ట్ ఫౌండర్ ఎస్‎టిఈఆర్‎జి-1.0 ఈ మైలురాయి గురించి ఇలా పేర్కొన్నారు. “‎ఎస్‎టిఈఆర్‎జి మరియు ఈ ప్రాజెక్ట్ ఫౌండర్ గా, మా మొదటి మిషన్ ఫలించడం మాకెంతో గర్వకారణంగా ఉంది. ఈ మిషన్ విద్యార్థులు, ఫాకల్టి యొక్క సమిష్ఠి ప్రయత్నాలు మరియు ఎంఐటి-డబ్ల్యూపియూ నుండి నిరంతర మద్ధతు కారణంగా విజయం సాధించింది. ప్రత్యేకించి అవకాశం ఇచ్చిన ఇస్రో మరియు ఇన్-స్పేస్ వారికి మేమెంతో ఋణపడి ఉంటాము. ఈ పేలోడ్ అంతరిక్ష సాంకేతికత రంగములో తదుపరి పరిశోధన మరియు అభివృద్ధి కొరకు మా పైలట్ మిషన్ గా పనిచేస్తుంది.”

ప్రారంభానికి ప్రయాణము చిన్న పని కాదు, అని మిషన్ లీడ్ శ్రీరంగ్ సరంజామె వివరించారు. “ఎనిమిది నెలల తీవ్రమైన కృష్టితో, మేము ఆర్బిటల్ మెకానిక్స్, సిస్టమ్ ఇంటిగ్రేషన్ మరియు కఠినమైన అంతరిక్ష అర్హత ప్రమాణాలలో సవాళ్ళను ఎదుర్కొన్నాము. ప్రతిఒక్కటి దోషరహితంగా పనిచేసిన అంతిమ పరీక్షిలో ఆలస్యమైన రాత్రులు మరియు లెక్కలేని పునరావృత్తులు ముందడుగు వేయడములో సహాయపడ్డాయి మరియు ఈ ప్రయాణాన్ని మరింత ఫలదాయకముగా చేశాయి.”

ఎస్‎టిఈఆర్‎జి వంటి విద్యార్థి బృందాలకు తమ అంతరిక్ష అన్వేషణ ప్రయత్నములో మద్ధతు ఇవ్వడములో ఇస్రో మరియు ఇన్-స్పేస్ కీలకపాత్ర పోషించాయి. సమీక్ష ప్రక్రియ సమయములో, ఇస్రో అధికారులు పేలోడ్ డిజైన్ ను గణనీయంగా పునర్నిర్వచించిన విలువైన సూచనలు మరియు మార్గదర్శనాన్ని అందించారు. ఇస్రో కమిటీలు మరియు పిఎస్‎ఎల్‎వి ప్రాజెక్ట్ డైరెక్టర్ నుండి అభినందనలు అందుకున్న తమ సులభమైన, కాని ప్రభావవంతమైన డిజైన్ తో నిర్మాణాత్మకంగా ధృఢమైన మరియు ఎలెక్ట్రికల్ గా రెడండెంట్ అయిన సిస్టమ్ సృష్టించడములో బృందము యొక్క వైఖరి అత్యధికంగా అభినందించబడింది.

తరువాత, ఎస్‎టిఈఆర్‎జి బృందము ఎంఐటి-డబ్ల్యూపియూ యొక్క మొట్టమొదటి క్యూబ్‎సాట్ రూపకల్పనకు ప్రతిష్ఠాత్మక ప్రణాళికలు కలిగి ఉంది. ఈ ఉపగ్రహములో విద్యార్థులు మరియు ఫాకల్టిలచే సమిష్ఠిగా రూపొందించబడిన వినూత్నమైన ప్రయోగాత్మక పేలోడ్స్ ఉంటాయి, ఇవి ఆవిష్కరణ మరియు అకడమిక్ ఉత్కృష్టతలను పెంచుటలో విశ్వవిద్యాలయము యొక్క చిత్తశుద్ధిని ముందుకు తీసుకెళ్తాయి. అలాగే బృందము ట్రాకింగ్ మరియు కమ్యూనికేషన్ కొరకు ఒక అంకితమైన గ్రౌండ్ స్టేషన్ ను స్థాపించాలని లక్ష్యంగా చేసుకుంది, తద్వారా ఎండ్-టు-ఎండ్ ఉపగ్రహ మిషన్ సామర్థ్యాలను సాధించుటలో మరో అడుగు దగ్గర చేసింది. బృందము తన పరిజ్ఞానాన్ని విస్తరించుకోవాలని మరియు కోర్ స్పేస్ టెక్నాలజీలలో వారి సహకార ప్రయత్నాలను బలోపేతం చేసుకోవాలని కోరుకుంటుండముతో, జాతీయ మరియు అంతర్జాతీయ పోటీలలో పాల్గొనడము కూడా కనుచూపుమేరలో ఉంది.

Read Also: Rajat Patidar: ఆర్సీబీకి కెప్టెన్ దొరికేశాడు.. సెంచరీతో ప్రమాద హెచ్చరికలు