Melinda Gates : బిల్‌గేట్స్ మాజీ భార్య, జెఫ్ బెజోస్ మాజీ భార్య కలిసి ఏం చేయబోతున్నారో తెలుసా ?

Melinda Gates : ‘‘బిల్ అండ్ మెలిండా గేట్స్’’ ఫౌండేషన్‌కు సంబంధించి ఇటీవల ఓ సంచలన వార్త బయటికి వచ్చింది.

Published By: HashtagU Telugu Desk
Melinda Gates

Melinda Gates

Melinda Gates : ‘‘బిల్ అండ్ మెలిండా గేట్స్’’ ఫౌండేషన్‌కు సంబంధించి ఇటీవల ఓ సంచలన వార్త బయటికి వచ్చింది. ఈ ఫౌండేషన్‌కు అపర కుబేరుడు బిల్‌‌గేట్స్ మాజీ సతీమణి మెలిండా గేట్స్ (Melinda Gates)  రాజీనామా చేశారు. ఫౌండేషన్ నుంచి తనకు లభించే రూ.లక్ష కోట్లతో సొంతం మరో స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేస్తానని ఆమె ప్రకటించారు. ఇంతకీ ఇలా ఎందుకు జరిగింది ? ఆమె నుంచి ఎందుకు ఫౌండేషన్ నుంచి తప్పుకున్నారు ? ఇప్పుడు తెలుసుకుందాం..

We’re now on WhatsApp. Click to Join

బిల్ గేట్స్ నుంచి మెలిండా గేట్స్ 2021 సంవత్సరం మే నెలలో విడాకులు తీసుకున్నారు. దీనికి కారణం జెఫ్రీ ఎప్‌స్టీన్‌ వ్యవహారం. ఇతగాడు మైనర్ బాలికలతో అమెరికాలోని పలు దీవుల్లో సెక్స్ దందాలు నడుపుతుండేవాడు. అమెరికా సహా చాలా దేశాలకు చెందిన వీఐపీలు, సంపన్నులు జెఫ్రీకి కస్టమర్లుగా ఉండేవారు. ఈ లిస్టులో బిల్ గేట్స్ పేరు కూడా ఉందంటూ 2019 సంవత్సరంలో అమెరికా మీడియాలో సంచలన కథనాలు వచ్చాయి. దీంతో భర్త బిల్‌గేట్స్‌పై మెలిండా గేట్స్ మనసు విరిగిపోయింది. 2021 సంవత్సరం మే నెలలో తన భర్త బిల్‌గేట్స్ నుంచి మెలిండా విడాకులు తీసుకొని వేరుపడ్డారు. అయినప్పటికీ ఆమె బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్ సహ వ్యవస్థాపకురాలి హోదాలో కొనసాగారు. తాజాగా రాజీనామాను ప్రకటిస్తూ.. జూన్ 7వ తేదీ తనకు ఫౌండేషన్‌లో చివరి వర్కింగ్ డే అని మెలిండా గేట్స్ వెల్లడించారు.

అమెజాన్ అధిపతి మాజీ భార్యతో కలిసి..

రానున్న రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా బాలికలు, మహిళల  కోసం స్వచ్ఛంద సేవా కార్యక్రమాలను చేపడతానని మెలిండా గేట్స్ ప్రకటించారు. తనకు ఫౌండేషన్ నుంచి లభించిన రూ.లక్ష కోట్లను ఇందుకోసం వాడుతానని స్పష్టం చేశారు. తదుపరిగా అమెజాన్ సహ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ మాజీ భార్య మాకెంజీ స్కాట్‌తో మెలిండా గేట్స్ చేతులు కలుపనున్నారని తెలుస్తోంది. మాకెంజీ స్కాట్ దగ్గర దాదాపు రూ.300 కోట్లకుపైనే సంపద ఉంది. జెఫ్ బెజోస్‌కు విడాకులిచ్చాక భరణంగా ఈ అమౌంట్ మాకెంజీ స్కాట్‌కు వచ్చింది. ఇద్దరూ కలిపి ప్రపంచ మహిళల సంక్షేమం కోసం నడుం బిగించనున్నారన్న మాట.

Also Read : AP : ఏపిలో 81 శాతం పోలింగ్‌: సీఈవో ముఖేశ్‌ కుమార్‌ మీనా

ఏడేళ్ల డేటింగ్ తర్వాత..

  • 1987 సంవత్సరంలో అమెరికాలోని న్యూయార్క్ నగరంలో జరిగిన పర్సనల్ కంప్యూటర్ ఎక్స్‌పో ట్రేడ్ షో వేదికగా తొలిసారిగా బిల్‌గేట్స్‌కు మెలిండా గేట్స్ కలిశారు.
  • ఈ పరిచయంతోనే ఆమెకు తన కంపెనీలో బిల్‌గేట్స్ ఉద్యోగమిచ్చారు.
  • ఇద్దరూ దాదాపు ఏడేళ్లపాటు డేటింగ్ చేశారు.
  • 1994 సంవత్సరంలో మెలిండా, బిల్ పెళ్లి చేసుకున్నారు.
  • బిల్‌గేట్స్‌తో పెళ్లయిన రెండేళ్ల తర్వాత (1996 సంవత్సరంలో) మైక్రోసాఫ్ట్ కంపెనీ నుంచి మెలిండా వైదొలిగారు. తమ ముగ్గురు పిల్లల పెంపకంపై పూర్తి ఫోకస్ పెట్టారు.

Also Read :TG Lok Sabha Polling : పార్లమెంట్ ఎన్నికల్లో 12 , 14 సీట్లు సాదించబోతున్నాం – భట్టి

  Last Updated: 14 May 2024, 05:23 PM IST